పట్టిసీమ ప్రాజెక్టు కింద పరిహారం రూపేణా నూజివీడులో ఎకరాకు రూ. 52లక్షలు ఇస్తే, వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు మాత్రం కేవలం లక్ష రూపాయలే ఇచ్చారని, వెనకబడిన శ్రీకాకుళం జిల్లాను మరింత వెనక్కి నెట్టేస్తున్నారని నిర్వాసితులు వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది యూజ్ అండ్ త్రో విధానమని మండిపడ్డారు.