ప్రత్యేక హోదాను పక్కనపెట్టిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు తెలుగు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. హోదా కోసం ఏపీ ప్రజలంతా పోరాడుతుంటే చంద్రబాబు, వెంకయ్య శరీరాలు వేరు అయినా...ఆలోచన ఒకటేనని, అవిభక్త కవలలుగా ప్రత్యేక హోదా అవసరం లేదంటున్నారని భూమన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.