డ్రగ్స్ కేసు క్లైమాక్స్‌కు చేరింది. నెలరోజులుగా నానా హడావుడి చేసిన అధికారులు ఈ కేసులో ఆపరేషన్ ముగించారు. చార్జిషీట్ వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రధాన పెడ్లర్లుగా ఆరోపణలెదుర్కొంటున్న కెల్విన్, జీశాన్, మైక్ కమింగాతోపాటు మరో 17 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. సినీ ప్రముఖులను సైతం వరుసగా విచారించారు. ఇందులో ప్రొడ్యూసర్లు, దర్శకులు, హీరోలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. ఉన్నారని చెప్పి చివరికి కేసును చార్జిషీట్ దిశగా పయనించేలా చేశారు. మంగళవారం సినీ నటుడు నందుతో కేసు విచారణ ముగియనుంది. కేసులో సోమవారంనాటికి 11 మంది సినీ ప్రముఖులను 88 గంటలపాటు విచారించారు.