‘‘పిల్లలు.. మీ పేరు.. మీ తల్లిదండ్రుల పేర్లు రాయండి’’అని జిల్లా కలెక్టర్ అంటే.. తరగతిలోని ఏ ఒక్కరూ సరిగా రాయలేదు. దీంతో కలెక్టర్ అసలు స్కూల్లో పాఠాలు చెబుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వల్లభ్‌రావుపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మంగళవారం వల్లభ్‌రావునగర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐదో తరగతి గదిలో వెళ్లి విద్యార్థులతో ‘టీచర్లు ఎలా చదువు చెబుతున్నారు’అని ప్రశ్నించారు. ఏ ఒక్కరినుంచీ సమాధానం రాలేదు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురై.. ‘మీ పేర్లు, మీ తల్లిదండ్రుల పేర్లను రాయండి’అన్నారు.
Published Tue, Jan 10 2017 7:18 AM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM
Advertisement
Advertisement
Advertisement