Teachers suspension
-
30 మంది టీచర్ల సస్పెన్షన్
సాక్షి, అమరావతి/మచిలీపట్నం/పసుమర్రు (పామర్రు)/ఏలూరు (ఆర్ఆర్ పేట): రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ తదితర అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 44 మంది అరెస్ట్ అయ్యారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి చెప్పారు. వీరిలో 30 మంది ప్రభుత్వ టీచర్లను పాఠశాల విద్యా శాఖ సస్పెండ్ చేసిందని తెలిపారు. కృష్ణా జిల్లాలో ఏడుగురు.. పామర్రు మండలం పసుమర్రు జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అందిన సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ, విద్యా శాఖ అధికారులతో కలిసి కృష్ణా జిల్లా డీఈవో తాహెరా సుల్తానా సోమవారం తనిఖీలు జరిపారు. ఉపాధ్యాయులు సీహెచ్ వెంకయ్యచౌదరి, వై.సురేష్, పి.గంగాధరం, కె.వరప్రసాద్, తిరుమలేష్, శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని డీఈవో తెలిపారు. వీరికి ఏలూరు జిల్లా కనుమోలు టీచర్ బి.రత్నకుమార్ సహకరించినట్లు గుర్తించామన్నారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తాము కూడా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. మాస్ కాపీయింగ్ ప్రయత్నం భగ్నం.. ఏలూరులోని సత్రంపాడు విద్యా వికాస్ స్కూల్లోని పరీక్ష కేంద్రాన్ని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఎల్.శ్రీకాంత్ సోమవారం తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం డిపార్ట్మెంటల్ అధికారి రామాంజనేయ వరప్రసాద్ మ్యాథ్స్ ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులు చెబుతుండగా.. అదనపు ఇన్విజిలేటర్ ప్రదీప్ తెల్ల కాగితం కింద రెండు కార్బన్ పేపర్లు పెట్టి రాస్తుండడాన్ని గుర్తించారు. ఇదంతా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలోనే జరగడాన్ని గమనించి.. వెంటనే వారందరినీ ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డిపార్ట్మెంటల్ అధికారిని, అదనపు ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యా శాఖకు సిఫార్సు చేశారు. -
గుమ్మలక్ష్మీపురం ఘటనపై మంత్రి సీరియస్.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
సాక్షి, విజయనగరం: గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు స్వామి నాయుడు, ఉపాధ్యాయుడు సూర్యనారాయణను తక్షణమే విధుల నుంచి తప్పించి విచారణకు ఆదేశించారు. విచారణ తర్వాత క్రిమినల్ కేసు నమోదుకు కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. చదవండి: (హైస్కూల్ టీచర్ నిర్వాకం... చర్యలు తీసుకోని పోలీసులు) -
చనిపోయిన టీచర్‌పై సస్పెన్షన్ వేటు!
పాట్నా: రెండేళ్ల క్రితం చనిపోయిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వం నాలుక్కరుచుకున్న ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత నెల 17న కాంట్రాక్టు ఉపాధ్యాయులు వారిని క్రమబద్దీకరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పరీక్షా పత్రాలు దిద్దేందుకు వెళ్లిన టీచర్లను అడ్డగించడమే కాక వారిపై దాడికి దిగారంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సదరు ఉపాధ్యాయులు ఎందుకొచ్చిన గొడవ అని విధులకు గైర్హాజరయ్యారు. దీంతో వారిపై బెగుసరై జిల్లా విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన టీచర్లను సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేశారు. అందులో రెండేళ్ల క్రితం మరణించిన ఉపాధ్యాయుడు రంజిత్ కుమార్ యాదవ్ పేరు ఉండటమే కాక అతను బెగుసరైలోని ఓ కేంద్రంలో ఆన్సర్ కాపీలను దిద్దాల్సి ఉందని పేర్కొనడం గమనార్హం. కాగా ఈ ఘటనపై బీహార్ విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమిత్ కుమార్ స్పందిస్తూ దీనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
పరీక్షలకు హాజరు కాని టీచర్ల సస్పెండ్
సాక్షి, కర్నూల్ : రాష్ట్రంలో నిర్వహించిన గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీకి డూమ్మా కొట్టిన నలుగురు ఎస్జీటీ టీచర్లు నస్రీన్ సుల్తానా, షహనా బేగం, పుష్పలత, అన్నపూర్ణమ్మలను జిల్లా కలెక్టర్ జి. వీర పాండియన్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఆర్డర్లను వెంటనే సర్వ్ చేయాలని కర్నూలు మునిసిపల్ కమీషనర్, డీఈవోలను ఆదేశించారు. మంగళవారం కర్నూలులోని మాంటిస్సోరి, సిస్టర్ స్టాన్సీలా పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల నుండి నిర్వహించిన వీఆర్వో గ్రేడ్ 2, గ్రామ సర్వేయర్ గ్రేడ్ 3 పోస్టుల పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 23 కేంద్రాల్లో మొత్తం అభ్యర్థులు 13778 మందికి గాను 10727 (78 శాతం) మంది హాజరయ్యారు. 3051 మంది గైర్హాజరయ్యారు. కాగా, జిల్లా కమాండ్ కంట్రోల్ రూం నుండి మానిటర్ చేస్తున్న కలెక్టర్.. ఇన్విజిలేషన్ విధుల్లో ఉన్న టీచర్లు పరీక్ష రోజున ఉదయం 7 గంటలకు తప్పనిసరిగా చీఫ్ సూపర్ ఇంటెండెట్‌కు రిపోర్ట్ చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
జగన్‌ను కలిశారని.. 9మంది ఉపాధ్యాయులపై వేటు!
సాక్షి, విశాఖపట్నం : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నందుకు తొమ్మిది మంది ఉపాధ్యాయులపై విద్యాశాఖ వేటు వేసే యోచనలో ఉంది. ఇటీవల సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ తొమ్మిది మంది ఉపాధ్యాయులు వైఎస్ జగన్‌ను కలిసి వినతి పత్రం అందించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తొమ్మిదిమంది ఉపాధ్యాయులు ఆదివారం పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో ఆ ఉపాధ్యాయులపై విద్యాశాఖ కక్షగట్టినట్టు తెలుస్తోంది. వారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ వారిని సస్పెండ్ చేసే యోచనలో విద్యాశాఖ ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు వైఎస్ జగన్‌ను కలిసిన ఉపాధ్యాయుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. -
ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
నర్సాపూర్ రూరల్: ‘సార్లకు బిర్యానీ.. పిల్లలకు నీళ్ల చారు’అనే శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికా రులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు.. బాధ్యులైన నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రాజిరెడ్డి, మధ్యాహ్న భోజన పథకం ఇన్చార్జి హరికృష్ణ శర్మను సస్పెండ్ చేశారు. ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు నర్సాపూర్ ఎంఈఓ జెమినీకుమారి తెలి పారు. అంతకుముందు ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి ఆదేశం మేరకు సంగారెడ్డి డీఈఓ, మెదక్ జిల్లా ఇన్చార్జి విజయకుమారి నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విచారణ జరిపారు. విద్యార్థులతోపాటు, వంట కార్మికులు, ఉపాధ్యాయులు, ప్రధానో పాధ్యాయుడు, విద్యా కమిటి చైర్మన్ లను విచారించారు. పూర్తి నివేదికను ఉన్న తాధికారులకు సమర్పించారు. అనంతరం వారిద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. న్యాయమూర్తి పవన్‌కుమార్ విచారణ ‘సాక్షి’కథనాన్ని చూసిన స్థానిక జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి పవన్‌కుమార్ సైతం స్పందించారు. తన క్వార్టర్ పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. విద్యార్థులను అడిగి వివ రా లు తెలుసుకున్నారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందడం లేదని తెలిసింది. కలెక్టర్ భారతీహోళికేరి కూడా వివరాలను సేకరించారు. -
చదివేది 5.. పేరు రాయరాదు..
-
చదివేది 5.. పేరు రాయరాదు..
♦ ఇదీ.. సర్కారు పాఠశాల విద్యార్థుల దుస్థితి ♦ ఉపాధ్యాయులపై కలెక్టర్ సీరియస్ ♦ ఐదుగురు టీచర్ల సస్పెన్షన్ మిడ్జిల్: ‘‘పిల్లలు.. మీ పేరు.. మీ తల్లిదండ్రుల పేర్లు రాయండి’’అని జిల్లా కలెక్టర్ అంటే.. తరగతిలోని ఏ ఒక్కరూ సరిగా రాయలేదు. దీంతో కలెక్టర్ అసలు స్కూల్లో పాఠాలు చెబుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వల్లభ్‌రావుపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మంగళవారం వల్లభ్రావునగర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐదో తరగతి గదిలో వెళ్లి విద్యార్థులతో ‘టీచర్లు ఎలా చదువు చెబుతున్నారు’అని ప్రశ్నించారు. ఏ ఒక్కరినుంచీ సమాధానం రాలేదు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురై.. ‘మీ పేర్లు, మీ తల్లిదండ్రుల పేర్లను రాయండి’అన్నారు. మొత్తం ఈ గదిలో 20 మంది విద్యార్థులుండగా ఏ ఒక్కరూ సరిగా పేరు రాయలేకపోయారు. దీంతో కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అక్కడే ఉన్న ఉపాధ్యాయులను మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించగా, కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారని సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ చదువు చెప్పకుండా నిరుపేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారంటూ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు ఉపాధ్యాయులు రాజలక్ష్మి, సతీష్‌కుమార్, శ్వేత, భానుప్రకాష్ , విదాయిత్ల్లాఖాన్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ అక్కడే ఉన్న డీఈవోను ఆదేశించారు. -
ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
అనంతపురం ఎడ్యుకేషన్/బత్తలపల్లి, న్యూస్‌లైన్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు క్రమశిక్షణ తప్పుతున్నారు. పాఠశాలలకు ఇష్టారాజ్యంగా వెళుతున్నారు. స్వయాన డీఈఓ మధుసూదన్ రావు ఆకస్మిక తనిఖీలో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో ఆయన ఐదుగురిని సస్పెండ్ చేశారు. డీఈఓ సోమవారం ఉదయం బత్తలపల్లి మండలం సంజీవపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఆయన సరిగ్గా ఉదయం 8.55 గంటలకు పాఠశాలకు చేరుకున్నారు. అప్పటికి ఒక్క ఉపాధ్యాయుడూ రాలేదు. నిబంధనల మేరకు 8.45 గంటలకే రావాలి. డీఈఓ తొమ్మిది వరకు ఎదురు చూసినా ఒక్కరూ రాలేదు. చేసేదిలేక ఆయనే పిల్లలతో ప్రార్థన చేయించారు. 9.20 గంటలకు ఒకరు, 9.26కు మరొకరు, 9.40కి ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 40 మంది విద్యార్థులున్నారు. ఖాసీం, నాగిరెడ్డి, మారుతీప్రసాద్, పావనరేఖ అనే నలుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఆ నలుగురినీ సస్పెండ్ చేశారు. అనంతరం డీఈఓ పక్కనే ఉన్న ఈదుల ముష్టూరు ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. హెచ్ఎం వెంకటయ్య ఆలస్యంగా ఉదయం 10.30కి రావడంతో ఆయ న్నూ సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. సంజీవపురం గ్రామం అనంతపురం-ధర్మవరం ప్రధాన రహదారి పక్కనే ఉంది. ఈ ఊరికి ప్రతి ఐదు నిమిషాలకో బస్సు ఉంది. ఇలాంటి పాఠశాలకే ఉపాధ్యాయులు సమయానికి వెళ్లడం లేదు. దీన్నిబట్టి రవాణా సౌకర్యాలు అంతగా లేని పాఠశాలలకు ఏమాత్రం వెళ్తుంటారో అర్థం చేసుకోవచ్చు. డీఈఓ ఇదే తరహాలో ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తే చాలామంది ఉపాధ్యాయులపై స స్పెన్షన్ వేటు పడే అవకాశముందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబు తున్నారు.