
సాక్షి, కర్నూల్ : రాష్ట్రంలో నిర్వహించిన గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీకి డూమ్మా కొట్టిన నలుగురు ఎస్జీటీ టీచర్లు నస్రీన్ సుల్తానా, షహనా బేగం, పుష్పలత, అన్నపూర్ణమ్మలను జిల్లా కలెక్టర్ జి. వీర పాండియన్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఆర్డర్లను వెంటనే సర్వ్ చేయాలని కర్నూలు మునిసిపల్ కమీషనర్, డీఈవోలను ఆదేశించారు. మంగళవారం కర్నూలులోని మాంటిస్సోరి, సిస్టర్ స్టాన్సీలా పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల నుండి నిర్వహించిన వీఆర్వో గ్రేడ్ 2, గ్రామ సర్వేయర్ గ్రేడ్ 3 పోస్టుల పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 23 కేంద్రాల్లో మొత్తం అభ్యర్థులు 13778 మందికి గాను 10727 (78 శాతం) మంది హాజరయ్యారు. 3051 మంది గైర్హాజరయ్యారు. కాగా, జిల్లా కమాండ్ కంట్రోల్ రూం నుండి మానిటర్ చేస్తున్న కలెక్టర్.. ఇన్విజిలేషన్ విధుల్లో ఉన్న టీచర్లు పరీక్ష రోజున ఉదయం 7 గంటలకు తప్పనిసరిగా చీఫ్ సూపర్ ఇంటెండెట్‌కు రిపోర్ట్ చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment