kurnool collector
-
‘డయేరియా’ బాధ్యులపై సస్పెన్షన్ వేటు
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు, ఆదోనిలోని అరుంజ్యోతి నగర్లో తాగునీరు కలుషితమవుతున్నా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి డయేరియా ప్రబలడానికి కారణమైన నలుగురు ఉద్యోగులను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ శనివారం సస్పెండ్ చేశారు. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాణ్యం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బి.పవన్‌కుమార్, గోరుకల్లు పంచాయతీ సెక్రటరీ జి.విజయభాస్కర్, ఆదోని మునిసిపాలిటీ వాటర్ సప్లై ఏఈ టి.రాజశేఖరరెడ్డి, వాటర్ సప్లై టర్న్ కాక్ ఎం.ఈరన్నలను సస్పెండ్ చేశారు. అలాగే పాణ్యం ఈవోఆర్డీ కె.భాస్కరరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఎన్.ఉమాకాంత్‌రెడ్డి, ఆదోని మునిసిపాలిటీ వాటర్ సప్లై డీఈవో జి.సురేష్, వాటర్ సప్లై ఈఈ ఎ.సత్యనారాయణలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విచారణ కమిటీల నియామకం డయేరియా ప్రబలడానికి కారణాల అన్వేషణ, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ విచారణ కమిటీలను నియమించారు. ఆదోనిలోని అరుంజ్యోతి నగర్లో విచారణ కోసం ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి నేతృత్వంలో అనంతపురం జిల్లా పబ్లిక్ హెల్త్ ఎస్ఈ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ ఎస్ఈ సురేంద్రబాబుతో కమిటీ వేశారు. గోరుకల్లులో విచారణ కోసం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి నేతృత్వంలో కర్నూలు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విద్యాసాగర్, డీపీవో కేఎల్ ప్రభాకరరావు సభ్యులుగా కమిటీని నియమించారు. -
ఆ వార్తలు అవాస్తవం: కలెక్టర్ వీరపాండియన్
సాక్షి, కర్నూల్: జిల్లా జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ కొట్టిపారేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హస్పీటల్లో అన్ని వైద్య సదుపాయలు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని స్పష్టం చేశారు. ఎటువంటి ఆక్సీజన్, బెడ్స్ కొరత వంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. జీజీహెచ్‌లో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందుతున్నారంటూ వస్తున్న మీడియా కథనాలు అవాస్తమని వెల్లడించారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా పుకార్లు పుట్టిస్తే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పుకార్లను నమ్మి ప్రజాలేవరూ ఆందోళన చెందవద్దని, జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ముందు జాగ్రత్తగా ప్రభుత్వం కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో 11.5 కేఎల్డీ కెపాసిటీతో పెద్ద ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసి పైప్ ద్వారా పేషేంట్స్ ఆక్సీజన్ సరఫరా చేస్తుందని తెలిపారు. (చదవండి: ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ) ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న 11.5 కె.ఎల్.డి పెద్ద ఆక్సీజన్ ట్యాంక్ కు అదనంగా ఇంకా పాజిటివ్ కేసులు పెరిగినా ఇబ్బంది కలగకుండా మరో 10 కేఎల్డీ కెపాసిటీతో అదనంగా కొత్త ఆక్సీజన్ ట్యాంక్ నిర్మాణపు పనులు పూర్తి దశలో ఉన్నాయన్నారు. నాగపూర్‌లో ఉన్న డైరెక్టర్ జెనరల్ (హైఎక్స్‌ప్లోజివ్స్) నుండి అనుమతి వచ్చిన వెంటనే అదనపు 10 కేఎల్డీ ఆక్సీజన్ ట్యాంక్‌ను ఉపయోగించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కోవిడ్ పేషేంట్స్ ఆక్సీజన్ అందక మృతి చెందుతున్నారు అనేది వాస్తవం కాదు కర్నూలు జిజిహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ప్రస్తుతం 450 బెడ్స్‌కు ఆక్సీజన్ సరఫరా సౌకర్యం ఉంది. అదనంగా మరో 1131 బెడ్స్ కు ఆక్సీజన్ సరఫరా కోసం చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ ఉన్న పాజిటివ్ కేసులకు గాను డైలీ 120 మందికి మాత్రమే ఆక్సీజన్ అవసరం ఉందని డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఆస్పత్రిలో సరిపడా ఆక్సీజన్, బెడ్స్ ఉన్నాయన్నారు. (చదవండి: మరో 26 మంది కరోనాను గెలిచారు..) నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గతంలో 20 బెడ్స్‌కు ఆక్సీజన్ సరఫరా ఉండగా.. అదనంగా మరో 160 బెడ్స్‌కు ఆక్సీజన్ సరఫరా సదుపాయం కల్పించామని చెప్పారు. ఆదోని ప్రభుత్వ జనరల్ ఏరియా ఆస్పత్రిలో గతంలో ఆక్సీజన్ సరఫరా ఉన్న బెడ్స్ జీరో ఉండగా ప్రస్తుతం 100 బెడ్స్‌కు కొత్తగా ఆక్సీజన్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో 1581 బెడ్స్‌కు, నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 161 బెడ్స్‌తో పాటు, ఆదోని ప్రభుత్వ ఏరియా జనరల్ ఆస్పత్రిలో 100 బెడ్స్‌కు కలిపి మొత్తం 1841 బెడ్స్‌కు ఆక్సీజన్ సదుపాయం ప్రభుత్వం తరఫున కల్పించామన్నారు. కాబట్టి కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో గాని, జిల్లాలో గాని కోవిడ్ పేషేంట్స్‌కు ఆక్సీజన్, బెడ్స్ కొరత లేదని స్పష్టం చేశారు. కావునా ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, పుకార్లను నమ్మోద్దని ఆయన సూచించారు. పుకార్లు పుట్టించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చారించారు. -
నా భర్తను అతను దారుణంగా మోసం చేశారు
సాక్షి, కర్నూలు : నగరంలోని ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీలో భాగస్వామ్యం మీద 18 సంవత్సరాలుగా పని చేస్తున్న తన భర్త సీవీఆర్ మోహన్‌రెడ్డిని అరుణాచలంరెడ్డి అక్రమంగా తొలగించారని ఆయన భార్య జయమ్మ జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీని 2000 సంవత్సరంలో అరుణాచలంరెడ్డి, సీవీఆర్‌మోహన్‌రెడ్డి, షేక్ షంషుద్దీన్, ప్రసాదు, చంద్రశేఖర్ కలిసి ప్రారంభించారన్నారు. తన భర్తను సొసైటీకి డైరక్టర్‌గా నియమించారన్నారు. ఆయన నేతృత్వంలో అనతికాలంలోనే ప్రతిభ కోచింగ్ సెంటర్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంస్థగా పేరుగాంచిందన్నారు. దీంతో ఇదే పేరు మీద కర్నూలు, పత్తికొండలలో పాఠశాలల, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, డీఈడీ, బీఈడీ కళాశాలలను స్థాపించి విజయవంతంగా నడిపారని, ప్రస్తుతం వాటికి సంబంధించిన ఆస్తులు కోట్లకు చేరాయన్నారు. ఆ ఆస్తులన్నింటినీ అరుణాచలంరెడ్డి గతేడాది కుటుంబ సభ్యుల పేరిట రాయించుకున్నారని ఆరోపించారు. సొసైటీలో భాగస్వామి అయిన తన భర్తను పట్టించుకోకపోగా రూ.80 లక్షలు అప్పులు మోపారన్నారు. దీనిపై ప్రశి్నస్తే కొట్టేందుకు వస్తున్నారని, మీరు స్పందించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. లేకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమవుతుందన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. కర్నూలు ఆర్డీఓ వెంకటేశ్‌ను విచారణకు ఆదేశించారు. -
పరీక్షలకు హాజరు కాని టీచర్ల సస్పెండ్
సాక్షి, కర్నూల్ : రాష్ట్రంలో నిర్వహించిన గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీకి డూమ్మా కొట్టిన నలుగురు ఎస్జీటీ టీచర్లు నస్రీన్ సుల్తానా, షహనా బేగం, పుష్పలత, అన్నపూర్ణమ్మలను జిల్లా కలెక్టర్ జి. వీర పాండియన్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఆర్డర్లను వెంటనే సర్వ్ చేయాలని కర్నూలు మునిసిపల్ కమీషనర్, డీఈవోలను ఆదేశించారు. మంగళవారం కర్నూలులోని మాంటిస్సోరి, సిస్టర్ స్టాన్సీలా పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల నుండి నిర్వహించిన వీఆర్వో గ్రేడ్ 2, గ్రామ సర్వేయర్ గ్రేడ్ 3 పోస్టుల పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 23 కేంద్రాల్లో మొత్తం అభ్యర్థులు 13778 మందికి గాను 10727 (78 శాతం) మంది హాజరయ్యారు. 3051 మంది గైర్హాజరయ్యారు. కాగా, జిల్లా కమాండ్ కంట్రోల్ రూం నుండి మానిటర్ చేస్తున్న కలెక్టర్.. ఇన్విజిలేషన్ విధుల్లో ఉన్న టీచర్లు పరీక్ష రోజున ఉదయం 7 గంటలకు తప్పనిసరిగా చీఫ్ సూపర్ ఇంటెండెట్‌కు రిపోర్ట్ చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అర్ధరాత్రి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పాణ్యం : మండల కేంద్రమైన పాణ్యంలోని గిరిజన సంక్షేమ గురుకుల (బాలుర)పాఠశాలను సోమవారం అర్ధరాత్రి కలెక్టర్ వీరపాండియన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కలెక్టర్ పాఠశాలకు వచ్చేసరికి ప్రధాన గేట్లు తాళం వేసి ఉన్నారు. ఎంత పిలిచినా సిబ్బంది ఎవరూ బయటకు రాలేదు. దీంతో అరగంట పైగానే కలెక్టర్ గేటు బయటే నిల్చున్నారు. చేసేదేమీ లేక కలెక్టర్ గన్‌మెన్, అటెండర్ గోడలు దూకి తాళాలను పగులగొట్టారు. రెండో ప్రధాన గేటు తాళాన్ని కూడా పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కలెక్టర్ లోపలికి వెళ్లగా కేవలం అందులో విద్యార్థులు మాత్రమే ఉండంతో వారిని నిద్రలేపారు. పాఠశాలలో పని చేస్తున్న వార్డెన్, వాచ్మెన్, అటెండర్, ప్రిన్సిపాల్ ఇతర సిబ్బంది ఎక్కడ ఉన్నారని ఆరా తీసి వారికి ఫోన్ చేశారు. హుటాహుటిన ప్రిన్సిపాల్ మేరిసలోమితోపాటు ఇతర సిబ్బంది కలెక్టర్ ముందుకు వచ్చారు. ఎందుకు తాళం తీయలేదని, పాఠశాలలో నైట్ వాచ్మెన్, ఇతర సిబ్బంది ఎక్కడున్నారని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో తక్షణమే వారిని విధులనుంచి తొలగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రిన్సిపాల్ సలోమిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
కర్నూలు(అగ్రికల్చర్): ‘జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు పోతు న్నా పట్టించుకోరు.. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోరు.. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా?’ అంటూ నేషనల్ హైవే అధికారులపై కలెక్టర్ వీరపాండియన్ నిప్పులు చెరిగారు. హైవేలపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్.. రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు తీసుకున్న చర్యలపై వివరాలు కోరగా సంబంధిత హైవే అథారిటీ అధికారులు రాలేదని వెల్లడి కావడంతో కలెక్టర్ మండిపడ్డారు. ఎన్‌హెచ్ –44, 40 పీడీలు రవీంద్ర రావు, చంద్రశేఖర్‌రెడ్డి గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి భద్రత కమిటీ సమావేశం ఉన్నపుడే మీకు ఇతర సమావేశాలుంటాయా? ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అంటూ విరుచుకుపడ్డారు. ప్రతి మీటింగ్‌కూ ఇలాగే చేస్తున్నారని పేర్కొన్న కలెక్టర్.. గతంలో వీరు ఏఏ సమావేశాలకు హాజరు కాలేదో వివరాలివ్వాలని రవాణా అధికారులను ఆదేశించారు. ‘ప్రమాదాలు జరుగుతు న్నా సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నివారణ చర్యలు తీసుకోవాలని రహదారి భద్రత కమిటీ ఆదేశించినప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది’ అంటూ ధ్వజమెత్తారు. ఇకపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోతే వారిపైనే క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశా రు. ఎన్‌హెచ్– 40, 44 అభివృద్ధి, మరమ్మతు పనులకు ఇసుక, విద్యుత్ సరఫరా నిలిపేయాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారుల స్థానంలో వచ్చిన కిందిస్థాయి అధికారులను బయటకు వెళ్లాలని ఆదేశించారు. ‘ఇటీవలే వెల్దుర్తి వద్ద ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇలాంటి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యా యి. చర్చించి చర్యలు తీసుకుందామంటే నిర్లక్ష్యం పేరుకుపోయింది’ అంటూ మండిపడ్డారు. వారు వచ్చిన తర్వాతే సమావేశం నిర్వహిస్తామంటూ అర్ధాంతరంగా ముగించారు. ఎస్పీ పక్కీరప్ప, ఇన్చార్జ్ డీటీసీ కృష్ణారావు, ఆర్డీఓ పాల్గొన్నారు. -
రాయడం రాదు..నువ్వు జిల్లా అధికారివా?
సాక్షి, కర్నూలు : జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన జిల్లా గిరిజన సంక్షేమాధికారి ధనుంజయ, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడును ప్రభుత్వానికి సరెండర్ చేశారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ అయిన ధనుంజయ.. కోనేరు రంగారావు కమిటీ (కేఆర్ఆర్సీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. అలాగే ఈయన పూర్తి అదనపు బాధ్యతలతో గిరిజన సంక్షేమ అధికారిగానూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి గైర్హాజరయ్యారు. కలెక్టర్ రెండు రోజుల క్రితం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తనిఖీలు నిర్వహించారు. ఆళ్లగడ్డలో గురుకుల బాలికల కళాశాల ఉండగా.. బాలుర కళాశాల ఉన్నట్లు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. అక్కడికి తనిఖీకి వెళ్లిన కలెక్టర్.. బాలికలు ఉండటం చూసి కంగుతిన్నారు. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ధనుంజయపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జిల్లా అధికారిగా ఉన్న మీకు రాయడం రాదా? అసలు మీరు చదువుకున్నారా? బాలురు ఉంటే బాలికలని, బాలికలు ఉంటే బాలురని ఎలా రాస్తారు?’ అని మండిపడ్డారు. ఇలాంటి వారిని జిల్లాలో ఉంచుకోవడం దారుణమంటూ వెంటనే సరెండర్ చేస్తూ ఆదేశాలిచ్చారు. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ తిలక్ విద్యా సాగర్‌కు గిరిజన సంక్షేమ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు గైర్హాజరు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఎలా గైర్హాజరవుతారంటూ ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వానికి సరెండర్ చేసేలా ఆదేశాలిచ్చారు. పనిచేసే వాళ్లు మాత్రమే జిల్లాలో ఉంటారని, తన అనుమతి లేకుండా గైర్హాజరైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. -
వేంపెంటకు ‘నవ’ వసంతం
సాక్షి, పాములపాడు(కర్నూలు) : వేంపెంటకు నవ వసంతం వచ్చింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. గ్రామంలోని నిప్పుల వాగుపై ర్యాంక్ మినీ హైడ్రాలిక్ పవర్‌ప్లాంటు నిర్మాణం రద్దయ్యింది. నూతన ప్రభుత్వం చొరవ తీసుకుని పవర్‌ప్లాంటును రద్దు చేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా వారు చేస్తున్న నిరాహార దీక్షలను శుక్రవారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ పవర్‌ప్లాంటును రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే శుక్రవారం గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ప్లాంట్ రద్దు చేస్తున్నట్లు జీఓ పత్రం ఇవ్వాలని దీక్షలో కూర్చున్న మహిళలు కోరారు. కలెక్టర్ స్పందిస్తూ సీఎం స్థాయిలో చెప్పిన విషయాన్ని వెంటనే అమలు చేస్తామని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జీఓ ఇస్తామని తెలిపారు. దీంతో వారు దీక్షల విరమణకు అంగీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేంపెంట వాసుల సుదీర్ఘ పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ మాట్లాడుతూ పవర్‌ప్లాంటు రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువడడంతో గ్రామస్తుల మోములో చిరునవ్వు చూస్తున్నానన్నారు. గ్రామ శ్రేయస్సు కోసం చేసిన పోరాటం వృథా కాలేదన్నారు. అలాగే జగనన్న ఇచ్చిన మాటను నిలుపుకున్నారన్నారు. ఆయన మాటే జీఓ అన్నారు. ప్రజలు ఇదే స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. తాను ప్రతి సంక్షేమ పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని తెలిపారు. గ్రామంలో శ్మశాన వాటిక, రహదారి, గతంలో పవర్‌ప్లాంటు కోసం నిర్వహించిన బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులు, 1,567 రోజులుగా దీక్షలో కూర్చున్న వారికి ఆర్థిక సహకారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హర్షం వ్యక్తం చేసిన వేంపెంట వాసులు పవర్‌ప్లాంటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో వేంపెంట గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్, స్థానిక ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌కు, సహకరించిన ప్రజా సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బహదూర్, సామేలు, డాక్టర్ శరత్, ఆనందరావు, శ్రీనివాసులు మాట్లాడుతూ పవర్‌ప్లాంటు నిర్వాహకులు మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మాజీ న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఇన్నాళ్లూ అధికారులు సైతం వారికి వత్తాసు పలికారన్నారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకంతోనే గాంధేయ మార్గంలో పోరాటం కొనసాగించామన్నారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న కష్టాలు, మానసిక వేదన గురించి వివరించారు. కలెక్టర్, ఎమ్మెల్యేకు సత్కారం కలెక్టర్, ఎమ్మెల్యేను గ్రామస్తులు దుశ్శాలువా, పూల మాలలతో సత్కరించారు. గ్రామ శ్రేయస్సు కోసం పోరాటంలో పాలుపంచుకున్న టీడీపీ నాయకుడు రామన్నగౌడును కూడా సత్కరించారు. అలాగే కలెక్టర్, ఎమ్మెల్యే దీక్షలో కూర్చున్న సామ్రాజ్యమ్మ, భారతి, పెద్ద రూతమ్మ, దుర్గా సుశీలమ్మ, తిక్కమ్మ, చెన్నక్క, శేషమ్మ, అన్నమ్మ, సంజమ్మలను దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్, తహసీల్దార్ శివయ్య, ఎంపీడీఓ దశరథరామయ్య, ఎంఈఓ బాలాజీ నాయక్, ఏఓ విష్ణువర్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీకి చెందిన సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు హరిసర్వోత్తమరావు, ప్రస్తుత అధ్యక్షుడు శివపుల్లారెడ్డి, నాయకులు రమణారెడ్డి, ఏసురత్నం, బాలీశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కృష్ణుడు యాదవ్, మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు కష్టార్జితం..బ్యాంకు పాలు!
సాక్షి, కర్నూలు : ఈ చిత్రంలో కనిపించే రైతు పేరు వెంకటేశ్వరెడ్డి. కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామం. 2016 రబీలో పండించిన శనగలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో 110 క్వింటాళ్లకు పైగా (178 బస్తాలు) దిగుబడిని అదే గ్రామంలోని జై కిసాన్ గోదాములో నిల్వ చేశాడు. ఈ శనగలపై కర్నూలు వెంకటరమణ కాలనీలోని కరూర్ వైశ్యాబ్యాంక్ శాఖ నుంచి 2017 ఏప్రిల్ 4న రూ.4.29 లక్షలు రుణం తీసుకున్నాడు. గిట్టుబాటు ధర రాకపోవడంతో అవి గోదాములోనే ఉండిపోయాయి. అప్పు కట్టలేదని రైతుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు లారీతో వచ్చి శనగ బస్తాలను ఎత్తుకెళ్లారు. తీసుకెళ్లవద్దని వెంకటేశ్వరరెడ్డి ప్రాధేయపడినా వారు వినుకోలేదు. గోదాముల్లోని రైతుల శనగలను తరలించడం, వేలం వేయడం చేయరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇది వరకే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అయినా, కరూర్ వైశ్యాబ్యాంకు అధికారులు దౌర్జన్యంగా శనగలు ఎత్తుకెళ్లడంతో బాధిత రైతు సోమవారం కలెక్టర్ జి.వీరపాండియన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఎల్డీఎంను పిలిచి సదరు బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
24 గంటలే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని 24 లక్షల మంది ఓటర్ల మనోగతంతో పాటు దాదాపు నెలన్నరగా తమ రాజకీయ భవితవ్యం ఏమిటని ఎదురుచూస్తున్న వివిధ పార్టీల నేతల ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమయ్యే కౌంటింగ్‌లో అసలు ప్రక్రియ 8.30 గంటలకు మొదలవుతుంది. ప్రతి రౌండులో పది టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఫలితం రావడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత.. ప్రతి నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ల చొప్పున లెక్కింపు నిర్వహిస్తామన్నారు. ఒక్కో వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు 45 నిమిషాల నుంచి గంట వరకూ పడుతుందన్నారు. పోలింగు ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న (క్లోజ్ రిజల్ట్ క్లియర్– సీఆర్సీ) ఓటింగు యంత్రాల లెక్కింపు మాత్రం చివర్లో చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మంగళవారమే ఆదేశాలు అందాయని ఆయన వెల్లడించారు. మెజార్టీ మరీ ఎక్కువగా ఉంటే వీటి లెక్కింపు కూడా జరిగే అవకాశం లేదన్నారు. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, ఏయే సిబ్బందికి ఏ టేబుల్ వద్ద విధులు కేటాయిస్తారనే విషయం మాత్రం కౌంటింగ్ రోజు అంటే 23వ తేదీ ఉదయం 5 గంటలకు తేలుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఇలా... ఓట్ల లెక్కింపు ప్రక్రియ 23వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ అరగంటలో ఆ ఓట్ల లెక్కింపు పూర్తయినా, కాకపోయినా 8.30 గంటలకు ఓటింగు యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కో రౌండుకు సంబంధించిన ఫలితాన్ని ఏజెంట్లకు చూపించి.. వారి ఆమోదం తర్వాత అధికారికంగా ఆర్వో ప్రకటిస్తారు. ఒక్కో రౌండు ఓట్ల లెక్కింపునకు 15 నుంచి 20 నిమిషాల వరకు సమయం తీసుకుంటుంది. జిల్లాలో తక్కువ పోలింగు బూత్‌లు ఉన్న శ్రీశైలం నియోజకవర్గ ఫలితం మొదట వెలువడనుంది. ఇక అధిక బూత్‌లు ఉన్న పాణ్యం నియోజకవర్గ ఫలితం చివర్లో వెలువడనుంది. ఈ ఫలితాలను మాత్రం ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదేసి చొప్పున వీవీ ప్యాట్లను తీసి.. లెక్కించిన తర్వాతే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఒక్కో వీవీ ప్యాట్‌ను లెక్కించేందుకు 45 నిమిషాల నుంచి గంట వరకూ పడుతుందని జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. అధికారికంగా తుది ఫలితం వెలువరించేందుకు సాయంత్రం ఆరు గంటలు కావొచ్చు. 3 వేల మంది సిబ్బంది జిల్లాలో ఎన్నికల కౌంటింగ్‌కు రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్నూలు పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ నందికొట్కూరు రోడ్డులోని పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీలో, నంద్యాల పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ నంద్యాల రోడ్డులోని రాయలసీమ యూనివర్సిటీలో జరగనుంది. సూక్ష్మ పరిశీలకులుగా 596 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లుగా 491, కౌంటింగ్ సూపర్వైజర్లుగా 770 మందిని నియమించారు. వీరితో పాటు ఓట్ల లెక్కింపు సిబ్బంది, సహాయ సిబ్బంది అంతా కలిపి మూడు వేల మంది వరకూ కౌంటింగ్ ప్రక్రియలో పాలుపంచుకుంటారని జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. పోలీసు భద్రత విషయానికి వస్తే మూడంచెలు ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రం నుంచి కిలోమీటరు వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. భద్రతాపరంగా వివిధ స్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది 1,200 మంది వరకూ ఉంటారన్నారు. -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
సాక్షి, కర్నూలు: ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. ఓట్ల లెక్కింపుపై సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కర్నూలు పార్లమెంటుకు చెందిన వారికి పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీలో, నంద్యాల పార్లమెంటుకు చెందిన వారికి జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపుపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు ఈ నెల 23వ తేదీ తమకు కేటాయించిన కేంద్రాలకు ఉదయం ఐదు గంటలకే చేరుకోవాలని సూచించారు. ఏ టేబుల్‌కు ఎవ్వరనేది అక్కడ ర్యాండమైజేషన్ ద్వారా కేటాయిస్తామన్నారు. స్ట్రాంగ్ రూముల నుంచి తెచ్చిన కంట్రోల్ యూనిట్ల సీల్‌ను పరిశీలించి.. కేటాయించిన టేబుల్‌పై ఉంచాలన్నారు. కంట్రోల్ యూనిట్లో ఉండే రిజల్ట్ బటన్ నొక్కితే అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లు డిస్ప్లే అవుతాయన్నారు. టోటల్ బటన్ ప్రెస్ చేసి 17సీతో సరిపోయిందా.. లేదా అని 17ఏతో సరిచూసుకోవాలన్నారు. ఒకవేళ రిజల్ట్ బటన్ నొక్కితే ఇన్వ్యాలిడ్ అని వస్తే పోలింగ్ ముగిసిన తర్వాత క్లోజ్డ్ బటన్ నొక్కిండరని అర్థమని, ఇటువంటి వాటిని వెంటనే ఆర్వో దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఆర్వో, పరిశీలకుడు కలసి తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రతి రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే అభ్యర్థుల ఏజెంట్లతో సంతకాలు తీసుకోవాలని సూచించారు. రౌండ్ల వారీగా ఫలితాలను న్యూ సువిధ యాప్‌లో అప్లోడ్ చేసిన తర్వాతనే ప్రకటించాలన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్లకు వచ్చిన వివిధ సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. కర్నూలు పార్లమెంట్ పరిశీలకుడు కేఆర్ మజుందార్, ఏఆర్వో ప్రశాంతి,డీఆర్వో వెంకటేశం, ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఓట్ల లెక్కింపు
సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 23న పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. రాజకీయ పార్టీలు ఈ నెల 19 తేదీ సాయంత్రంలోగా కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి అర్హత కలిగిన వారి పేర్లు ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఓట్ల లెకింపుపై గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి నియోజకవర్గానికి 20 టేబుళ్లు వినియోగిస్తున్నామని, ఇందులో పార్లమెంట్‌కు 10, అసెంబ్లీకి 10 ప్రకారం ఉంటాయన్నారు. వీటికి అదనంగా ఆర్వో టేబుల్ ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌కు 10 మంది, అసెంబ్లీకి 10 మంది ఏజెంట్లను నియమించుకునేందుకు ఈ నెల 19వ తేదీలోపు పేర్లు ఇవ్వాలని రాజకీయ పార్టీలకు సూచించారు. పార్లమెంట్‌కు మాత్రం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు అదనంగా నలుగురు ఏజెంట్లను పెట్టుకోవాలన్నారు. ఎలాంటి క్రిమినల్ కేసులు లేని వారినే ఏజెంట్లుగా నియమించుకోవాలని సూచించారు. గంట ముందే గంట ముందే కౌంటింగ్ కేంద్రానికి ఏజెంట్లు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు నేరుగా కౌంటింగ్ కేంద్రానికి రావచ్చని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, అగ్గిపెట్టెలను అనుమతించబోమని స్పష్టం చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీ, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ ఏజెంట్లు వ్యవహరించాల్సి ఉందన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓటర్ల ఈటీపీబీఎస్ల లెక్కింపు జరుగుతుందని, తర్వాత కంట్రోల్ యూనిట్‌లోని ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. కంట్రోల్ యూనిట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత వీవీప్యాట్ల స్లిప్‌లను లెక్కించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. రౌండ్ల వారీగా ఫలితాలు.. రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 20,545 మంది ఉద్యోగులు ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 19,404 మందికి జారీ చేశామని చెప్పారు. ఇప్పటి వరకు పార్లమెంట్‌కు 10,897 మంది, అసెంబ్లీకి 12,518 మంది ఓట్లు వేసి తిరిగి పంపారని పేర్కొన్నారు. మిగిలిన వారు పంపడానికి 23వ తేదీ ఉదయం 7 గంటల వరకు సమయం ఉందన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్లకు, సిబ్బందికి టీ, మంచి నీళ్లు, స్నాక్స్ ఇస్తామని, భోజన సదుపాయం ఉండదని చెప్పారు. సమావేశంలో డీఆర్వో వెంకటేశం, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ ప్రతినిధి సత్రం రామకృష్ణుడు, కర్నూలు పార్లమెంట్ సీపీఎం అభ్యర్ధి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ర్యాండమైజేషన్ ద్వారా కౌంటింగ్ సిబ్బంది ఎంపిక పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అవసరమైన సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ ఎంపిక చేశారు. సూక్ష్మ పరిశీలకులుగా 596 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లుగా 431 మంది, కౌంటింగ్ సూపర్ వైజర్లుగా 770 మందిని ఎంపిక చేశారు. సూపర్వైజర్లుగా గెజిటెడ్ అధికారులే ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు మాత్రం కౌంటింగ్ సూపర్వైజర్లతో పాటు అసిస్టెంట్లు కూడా గెజిటెడ్ అధికారులనే ఎంపిక చేయడం విశేషం. రెండో ర్యాండమైజేషన్ ద్వారా సూక్ష్మ పరిశీలకులు, ఓట్ల లెక్కింపు సిబ్బందిని నియోజక వర్గాలకు కేటాయిస్తారు. మూడో ర్యాండమైజేషన్ ద్వారా నియోజక వర్గాలకు కేటాయించిన సిబ్బందిని టేబుళ్లకు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. -
తెలంగాణను పొగుడుతావా?
దళితుడిపై కర్నూలు కలెక్టర్ సీరియస్ డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రస్తావనపై మండిపాటు కర్నూలు(అర్బన్): పక్క రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతుంటే మన రాష్ట్రంలో ఒక్క ఇల్లూ కట్టడంలేదన్న దళితుడిపై కలెక్టర్ విరుచుకు పడ్డారు. ‘‘మనకు అన్యాయం చేసిన తెలంగాణను పొగుడుతావా? తెలుగు గడ్డ మీద అక్కడి(తెలంగాణ) ప్రస్తావన తీసుకొస్తావా? ఆంధ్రా, రాయలసీమ రక్తం నాలో ఉంది. ఈ వేదిక మీద ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని కర్నూలు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. బుధవారం కర్నూలులో బాబూ జగ్జీవన్‌రామ్ 110వ జయంతి ఉత్సవాల్లో దళిత నేత సీహెచ్ మద్దయ్య మాట్లాడారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నారని, మన రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క ఇళ్లూ నిర్మించలేదని చెబుతుండగా, కలెక్టర్ జోక్యం చేసుకుని విరుచుకుపడ్డారు. ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు దళిత నేతలు మద్దయ్యకు సంఘీభావం ప్రకటించారు. సభలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా కలెక్టర్ డౌన్‌డౌన్ అంటూ నినదించారు. ఆయన పచ్చ చొక్కా వేసుకున్న నాయకుడిలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో కలెక్టర్ వెంటనే మైక్ కట్ చేయించారు. మైక్ ఇవ్వకపోవడంపై మారెప్ప ఫైర్ సభ ముగుస్తున్న సమయంలో మాట్లాడాల్సిన నేతల్లో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి మాత్రమే మిగిలారు. ఈ సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి కేఈకి కలెక్టర్ మైక్ ఇవ్వడం పట్ల మారెప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ.. సే సారీ ’ అంటూ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. సారీ చెప్పాల్సిన అవసరం లేదని కలెక్టర్ సమాధానం ఇవ్వడంతో కొంతసేపు మాటామాటా పెరిగింది. ‘నేను సమైక్యాంధ్రలో ఐదేళ్లు మంత్రిగా పనిచేశా. నాకు మైక్ ఇవ్వకపోవడం ఏమిటి’’ అని నిలదీశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది.