
సాక్షి, విశాఖపట్నం : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నందుకు తొమ్మిది మంది ఉపాధ్యాయులపై విద్యాశాఖ వేటు వేసే యోచనలో ఉంది. ఇటీవల సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ తొమ్మిది మంది ఉపాధ్యాయులు వైఎస్ జగన్‌ను కలిసి వినతి పత్రం అందించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తొమ్మిదిమంది ఉపాధ్యాయులు ఆదివారం పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో ఆ ఉపాధ్యాయులపై విద్యాశాఖ కక్షగట్టినట్టు తెలుస్తోంది. వారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ వారిని సస్పెండ్ చేసే యోచనలో విద్యాశాఖ ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు వైఎస్ జగన్‌ను కలిసిన ఉపాధ్యాయుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment