నర్సాపూర్ రూరల్: ‘సార్లకు బిర్యానీ.. పిల్లలకు నీళ్ల చారు’అనే శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికా రులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు.. బాధ్యులైన నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రాజిరెడ్డి, మధ్యాహ్న భోజన పథకం ఇన్‌చార్జి హరికృష్ణ శర్మను సస్పెండ్ చేశారు.
ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు నర్సాపూర్ ఎంఈఓ జెమినీకుమారి తెలి పారు. అంతకుముందు ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి ఆదేశం మేరకు సంగారెడ్డి డీఈఓ, మెదక్ జిల్లా ఇన్‌చార్జి విజయకుమారి నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విచారణ జరిపారు. విద్యార్థులతోపాటు, వంట కార్మికులు, ఉపాధ్యాయులు, ప్రధానో పాధ్యాయుడు, విద్యా కమిటి చైర్మన్ లను విచారించారు. పూర్తి నివేదికను ఉన్న తాధికారులకు సమర్పించారు. అనంతరం వారిద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది.
న్యాయమూర్తి పవన్‌కుమార్ విచారణ
‘సాక్షి’కథనాన్ని చూసిన స్థానిక జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి పవన్‌కుమార్ సైతం స్పందించారు. తన క్వార్టర్ పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. విద్యార్థులను అడిగి వివ రా లు తెలుసుకున్నారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందడం లేదని తెలిసింది. కలెక్టర్ భారతీహోళికేరి కూడా వివరాలను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment