బాలింతలు సరైన వైద్యం అందక మరణిస్తుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మండిపడ్డారు. మంగళవారం పాతబస్తీలోని పెట్ల బురుజు ఆసుపత్రిని ఆమె సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఆస్పత్రిలో మౌలిక వసతులు దుర్భరంగా ఉన్నాయన్నారు. సర్కార్ చెబుతున్న దానికి ఆసుపత్రులలో వసతులకు పొంతన లేదన్నారు. మూడేళ్ల నుంచి స్టాఫ్‌ను నియమించక పోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతుందన్నారు. బ్లడ్ బ్యాంక్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. 600 మంది రోగులు వచ్చే ఆసుపత్రికి 6 మంది డాక్టర్లా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.