గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామంలో గొడవలు జరిగాయి. ఈరోజు మళ్లీ సాయంత్రం సమయంలో మంటలు చెలరేగాయి. దుండగులు ఎవరైనా ఉన్నారేమోనని, పొలాల్లో దాక్కున్నారేమోనని రైతులు వెతుకుతున్నారు. రాయపూడికి చెందిన రైతులు కూడా ఇక్కడకు చేరుకున్నారు. తమ ప్రాంతంలో మళ్లీ మంటలు వస్తాయేమోనన్న ఆందోళనలో రైతులు కనిపిస్తున్నారు. పొద్దున్న సంఘటన జరిగి.. దానిపై తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నా, మళ్లీ సాయంత్రం మంటలు చెలరేగాయి. రాజధాని కోసం గజం భూమి కూడా ఇవ్వబోమని చెప్పిన ప్రాంతంలోనే ఈ తరహా దాష్టీకాలు జరుగుతున్నాయి.