15 లక్షల స్వైపింగ్ మిషన్లు కావాలి! | demonetizations effect swiping machines required | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 4 2016 7:21 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

రాష్ట్రంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా స్వైపింగ్ మిషన్లను (పాయింట్ ఆఫ్ సేల్) అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మిషన్లను తయారు చేసే ఈసీఐఎల్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోంది. లక్షలాది మిషన్లు అవసరమవటంతో.. భారీ ఎత్తున తయారీకి, సరఫరాకు ఉన్న మార్గాలపై చర్చలు జరుపుతోంది. రాష్ట్రంలోని బ్యాంకుల్లో ఈ మిషన్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంతో స్వైపింగ్ మిషన్ల డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం బడా మాల్స్, సూపర్ మార్కెట్లకు పరిమితమైన స్వైపింగ్ మిషన్లను కూరగాయలమ్మే చిన్న రైతుల వరకు కూడా తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement