దయచేసి యువకులు ఎవరూ బలగాలపై రాళ్ల దాడి చేసే ప్రయత్నం చేయొద్దని కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అదే సమయంలో పోలీసు బలగాలు అల్లర్లు నియంత్రించే సమయంలో పెల్లెట్ గన్లు ఉపయోగించరాదని చెప్పారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన ఆయన కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులకు ప్రధాన కారణం పాకిస్థాన్ అని, ఈ విషయంలో తాము ఒక గట్టి నిర్ణయానికి వచ్చామని చెప్పారు.