kashmir visit
-
'రాళ్లు విసరొద్దు.. గన్స్ పేలొద్దు'
-
కశ్మీరీలతో ఉద్విగ్న బంధం
రాజ్‌నాథ్ ఆకాంక్ష పాక్ పద్ధతి మార్చుకోవాలని ధ్వజం శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ ప్రజలతో కేంద్రం ఉద్విగ్న సంబంధాలను కోరుకుంటోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్లో పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకురావడానికి సహకరించాలని కశ్మీరీలను కోరారు. ఘర్షణల నేపథ్యంలో శ్రీనగర్, అనంతనాగ్‌లలో రెండు రోజులపాటు రాజ్‌నాథ్ పర్యటించారు. సీఎం మెహబూబా ముఫ్తీ, విపక్ష నేషనల్ కాన్ఫరెన్స్‌తో చర్చించారు. అనంతరం రాజ్‌నాథ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న పాక్ తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. సాధ్యమైనంత వరకు పెల్లెట్ గన్స్‌ను వాడకుండానే ఆందోళనకారులను నియంత్రించాలని భద్రతా దళాలను ఆదేశించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. కశ్మీర్ యువత ఆయుధాలు చేతబట్టేలా పాక్ పురిగొల్పుతోందని, దీన్ని విడనాడాలని సీఎం మెహబూబాఅన్నారు. కశ్మీర్ ఘర్షణల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు -
'రాళ్లు విసరొద్దు.. గన్స్ పేలొద్దు'
శ్రీనగర్: దయచేసి యువకులు ఎవరూ బలగాలపై రాళ్ల దాడి చేసే ప్రయత్నం చేయొద్దని కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అదే సమయంలో పోలీసు బలగాలు అల్లర్లు నియంత్రించే సమయంలో పెల్లెట్ గన్లు ఉపయోగించరాదని చెప్పారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన ఆయన కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులకు ప్రధాన కారణం పాకిస్థాన్ అని, ఈ విషయంలో తాము ఒక గట్టి నిర్ణయానికి వచ్చామని చెప్పారు. కశ్మీర్ లో ఎప్పటి మాదిరిగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. 'కశ్మీర్ లో పరిస్థితిపట్ల మూడో వర్గానికి(పాకిస్థాన్) ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. ఏదైనా సమస్య ఉంటే మనమంతా కూర్చుని చర్చించుకుందాం' అని రాజ్ నాథ్ అన్నారు. పాకిస్థాన్ ప్రలోభాలకు కశ్మీర్ యువతి గురికావొద్దని, అనవసరం ఉగ్రవాద భావజాలం మాయలో పడొద్దని హెచ్చరించారు. ఇప్పటికే తాను ముఖ్యమంత్రి మహబూబా మఫ్తీతో మాట్లాడానని, ఆమె గాయపడి వైద్య ఖర్చులు భరించలేని వారికి ప్రభుత్వం తరుపున ఉచిత చికిత్స అందించే ఏర్పాట్లుకూడా చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఎయిమ్స్ లో వైద్యం చేయిస్తామని ఆయన అన్నారు. -
డేగ కన్ను.. షార్ప్ షూటర్స్.. షట్ డౌన్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అన్ని రకాల భద్రతా బలగాల బూట్ల చప్పుళ్లు వినిపిస్తున్నాయి.. ప్రధాని నరేంద్రమోదీ శనివారం జమ్మూకశ్మీర్ లోయలో పర్యటించి ఓ ర్యాలీలో పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసు బలగాలు కేంద్ర బలగాలు, మిలటరీ పకడ్బందీ రక్షణ చర్యల్లో మునిగిపోయింది. ప్రధాని పర్యటన ప్రశాంతంగా సాగేందుకు అనుగుణంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. పలు చోట్ల ఆంక్షలు విధించింది. ముఖ్యంగా తిరుగుబాటుదారులు ఉన్న ప్రాంతాలపై డేగ కన్ను ఉంచింది. నిరసనలు ఎదురవకుండా, నల్ల జెండాలవంటి ప్రదర్శనవంటి కార్యక్రమాలకు అవకాశం లేకుండా శరవేగంగా చర్యలు పూర్తి చేసింది. దీంతోపాటు ప్రధాని షేర్ ఈ కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్న సభలో ప్రధాని పాల్గొననున్న నేపథ్యంలో ఆ వైపు వచ్చే రహదారులన్నింటిపై గట్టి నిఘా ఏర్పాటుచేసి ఆంక్షలు విధించింది. అనుమానిత వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేలా సీసీటీవీల ఏర్పాటుతోపాటు మొత్తం మూడు కిలోమీటర్ల దూరంమేరకు ఉన్న ఎత్తయిన భవంతులపై షార్ప్ షూటర్స్ ను కూడా సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే వందలమందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు ఇతర వ్యాపార సంస్థలు మూసి వేశారు. మూడు రోజులుగా తక్కువమంది ప్రజలు మాత్రమే సభ నిర్వహించే ప్రాంతాల్లో తిరిగేందుకు అనుమతిస్తుండగా శనివారం పూర్తిగా ఆ ప్రాంతంలో నిషేధం విధించారు.