
కశ్మీరీలతో ఉద్విగ్న బంధం
రాజ్‌నాథ్ ఆకాంక్ష పాక్ పద్ధతి మార్చుకోవాలని ధ్వజం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ ప్రజలతో కేంద్రం ఉద్విగ్న సంబంధాలను కోరుకుంటోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్‌లో పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకురావడానికి సహకరించాలని కశ్మీరీలను కోరారు. ఘర్షణల నేపథ్యంలో శ్రీనగర్, అనంతనాగ్‌లలో రెండు రోజులపాటు రాజ్‌నాథ్ పర్యటించారు. సీఎం మెహబూబా ముఫ్తీ, విపక్ష నేషనల్ కాన్ఫరెన్స్‌తో చర్చించారు. అనంతరం రాజ్‌నాథ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న పాక్ తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. సాధ్యమైనంత వరకు పెల్లెట్ గన్స్‌ను వాడకుండానే ఆందోళనకారులను నియంత్రించాలని భద్రతా దళాలను ఆదేశించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు.
కశ్మీర్ యువత ఆయుధాలు చేతబట్టేలా పాక్ పురిగొల్పుతోందని, దీన్ని విడనాడాలని సీఎం మెహబూబాఅన్నారు. కశ్మీర్ ఘర్షణల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు