సాఫ్ట్వేర్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం | fire accident in software office in banjara hills road number 12 | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 30 2016 10:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

బంజారాహిల్స్ రోడ్డు నెం -12 లోని బహుళ అంతస్తుల భవనంలో సాప్ట్వేర్ కార్యాలయంలో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లలో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలార్పుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు భవనం వద్దకు చేరుకున్నారు. బిల్డింగ్లో చిక్కుకున్న శ్రీవిద్య అనే అమ్మాయిని, మరో అబ్బాయిని పోలీసులు రక్షించారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనతో ఉన్న వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement