కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన బిహార్‌లోని బెగుసరాయ్‌లో సిమారియా ఘాట్ వద్ద చోటు చేసుకుంది.