పంజాబ్‌లో ఘోరం జరిగింది. సంగ్రూర్ సమీపంలోని లోంగోవాల్ పట్టణంలో గల ప్రధాన మార్కెట్లో పట్టపగలు ఓ ఫైనాన్స్ వ్యాపారిని కాల్చి చంపిన గ్యాంగ్‌స్టర్లు.. అతడి శవం వద్ద డాన్సులు చేసి, వీడియో కూడా తీసుకున్నారు. దల్వీందర్ సింగ్ అలియాస్ బబ్లీ రణ్‌ధవా నేతృత్వంలోని ఐదుగురు గ్యాంగ్‌స్టర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. దల్వీందర్ ఇటీవలే వేరే కేసులో బెయిల్ పొంది జైలు నుంచి విడుదలయ్యాడు. హర్‌దేవ్ సింగ్ అనే ఫైనాన్స్ వ్యాపారి దల్వీందర్‌కు రూ. 5 లక్షలు అప్పు ఇచ్చాడు. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. హర్‌దేవ్ తలలోకి ఐదు బుల్లెట్లు కాల్చడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత అతడి శవం వద్ద డాన్సులు చేస్తూ వాళ్లు సంబరాలు చేసుకున్నారు. పోలీసులు దమ్ముంటే తనను పట్టుకోవాలని సవాలు కూడా చేశాడు. దాంతో ఆ ప్రాంతంలో అంతా వణికి పోయారు. దుకాణాల షట్టర్లు మూసేసుకున్నారు. వీళ్లంటే పోలీసులకు కూడా భయమేనని, ఇక వాళ్లు తమకు రక్షణ ఎక్కడ కల్పిస్తారని దుకాణదారులు అడుగుతున్నారు.
Published Fri, Feb 17 2017 9:18 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement