'నేను భారతీయుడిని' | hyderabad mp asaduddin owaisi press meet | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 11 2014 2:58 PM | Last Updated on Thu, Mar 21 2024 8:53 PM

మజ్లిస్ పార్టీ, ఆ పార్టీ అధినేతలు ఒవైసీ సోదరులపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ''నేను భారతీయుడిని. భారత రాజ్యాంగాన్ని నేను నమ్ముతాను. నన్ను జాతి వ్యతిరేకి అనే హక్కు ఎవరికీ లేదు'' అని స్పష్టం చేశారు. ఉద్ధవ్ థాకరే ముందుగా బీజేపీతో వ్యవహారం చక్కదిద్దుకొని, ఆ తరువాత తమ గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. మజ్లిస్ పార్టీని నిషేధించాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రణీతి షిండేకు నోటీసులు పంపినట్లు చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement