గత ఎనిమిది రోజులుగా తమ డిమాండ్ సాధన కోసం విధులు బహిష్కరించిన మున్సిపల్ కార్మికుల సమ్మెను తెలంగాణ ప్రభుత్వం విరమింపచేసే ప్రయంత్రంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం కార్మికుల డిమాండ్లపై నిర్ణయం తీసుకోన్నట్లు సమాచారం. జీతాల పెంపుతో పాటు ఇతర డిమాండ్లపై కేసీఆర్ సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మిక సంఘాలు తమ అంతర్గత రాజకీయాలను పక్కనపెట్టి సహకరించాలని ప్రభుత్వం కోరనుంది. మరోవైపు కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె రెండోవారానికి చేరుకోవడంతో రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరం చెత్తమయంగా మారింది. పలు కూడళ్లు, రహదారులు చెత్తకుప్పలతో దుర్గంధభరితంగా మారాయి
Published Mon, Jul 13 2015 10:35 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement