మహిళలపై సైకో చేస్తున్న ఇంజక్షన్ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ స్పష్టం చేశారు. గురువారం ఏలూరులో ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ...ఈ కేసును నర్సాపురం డీఎస్పీ సౌమ్యలతకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మహిళలపై దాడులు చేస్తున్నది సైకోగా భావిస్తున్నామన్నారు.