Bhaskar Bhushan
-
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు
సాక్షి, నెల్లూరు: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వహించి మెరుగైన శాంతిభద్రతలను అందిస్తానని జిల్లా నూతన ఎస్పీ భాస్కర్‌భూషణ్ వెల్లడించారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఆదివారం ఉదయం 7.45 గంటలకు నూతన పోలీసు కార్యాలయంలోని తన చాంబర్లో భాస్కర్‌భూషణ్ జిల్లా 43వ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువచేసి పోలీసుశాఖపై విశ్వాసాన్ని పెంపొందిస్తామన్నారు. పోలీసు ఉన్నది ప్రజలకోసమేననే భావన కలి్పంచేలా విధులు నిర్వహించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పెద్దపీట వేస్తామన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీనవర్గాల వారి రక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రికవరీలపై ప్రత్యేక దృష్టిసారిస్తామని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక శక్తుల పీచమణుస్తామన్నారు. ప్రధానంగా క్రికెట్‌బెట్టింగ్, మైనింగ్, ఎర్రచందనం మాఫియాలపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచి పూర్తిస్థాయిలో కట్టడిచేస్తామన్నారు. చట్టాన్ని ఉపేక్షించేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పోలీసుశాఖకు మూల స్తంభాలైన ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్‌యాక్ట్ అనే మూడు అంశాలకు కట్టుబడి జిల్లా పోలీసు యంత్రాంగం విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాలకు లోబడి సిబ్బంది అందరూవిధులు నిర్వహిచాలన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి తనవంతు కృషిచేస్తామని చెప్పారు. తొలుత ఆయన సిబ్బందినుంచి గౌరవవందనం స్వీకరించారు. పండితులు పూర్ణకుంభంతో ఎస్పీకి స్వాగతం పలికారు. 2009 ఐపీఎస్ బ్యాచ్ భాస్కర్‌భూషణ్ బిహార్ రాష్ట్రం ధర్మాంగ జిల్లా క్యూటీకు చెందినవారు. ఆయన ప్రా«థమిక విద్యాభ్యాసం రాంచీలో సాగింది. ఖరగ్‌పూర్ ఐఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. చెన్నై, సింగపూర్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు సివిల్స్ రాసి 2009లో ఐపీఎస్ అధికారిగా పోలీసుశాఖలో ప్రవేశించారు. కరీంనగర్లో శిక్షణ పొందిన ఆయన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏఎస్పీగా, అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఓఎస్డీగా విధులు నిర్వహించారు. 2015 నుంచి 17వరకు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేశారు. అనంతరం ఇంటెలిజెన్స్ ఎస్పీగా, డీజీ కార్యాలయంలో ఐఏజీ అడ్మిన్‌గా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన పోలీసు బదిలీల్లో నెల్లూరు ఎస్పీగా నియమితులయ్యారు. పనిచేసిన ప్రతిచోట సమర్థవంతమైన అధికారిగా పేరుగడించారు. సిబ్బంది శుభాకాంక్షలు నూతన ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు ఏఎస్పీ క్రైమ్స్ పి.మనోహర్‌రావు, ఏఆర్ ఏఎస్పీ వీరభద్రుడు, ఎస్బీ, నెల్లూరు నగర, రూరల్, ఏఆర్, హోమ్గార్డ్స్ డీఎస్పీలు ఎన్.కోటారెడ్డి, జే శ్రీనివాసులరెడ్డి, కేవీ రాఘవరెడ్డి, రవీంద్రరెడ్డి, డి. శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు మధుబాబు, వేమారెడ్డి, రాములునాయక్, మిద్దెనాగేశ్వరమ్మ, టీవీ సుబ్బారావు, వైవీ సోమయ్య, బి. శ్రీనివాసరెడ్డి, ఆర్ఐలు మౌలుద్దీన్, వెంకటరమణ, ఎంటీవో గోపినాథ్, ఎస్బీ ఎస్సై సాయి శుభాకాంక్షలు తెలిపారు. -
సత్వర పరిష్కారంతోనే న్యాయం
ఏలూరు అర్బన్ : పెండింగ్‌లో ఉన్న కేసులను సాధ్యమైనం త తొందరగా పరిష్కరించడం వల్ల నిజమైన బా ధితులకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ అధికారులకు సూచిం చారు. శనివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నరసాపురం, కొవ్వూరు డీఎస్పీలతో ఆయన జి ల్లాస్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా డివిజన్ల పరిధిలోని స్టేషన్లలో నమోదైన నేరాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, ఆస్తి రికవ రీ, పెండింగ్‌లో ఉన్న కేసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్ తదితర అంశాలపై డీఎస్పీల వివరణ తీసుకున్నారు. దర్యాప్తు వేగవంతం కాకుంటే న్యాయం ఆలస్యమవుతుందని, అది బాధితులకు అన్యాయమే అవుతుందన్నారు. అధికారులు నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చే యడం కంటే అసలు నేరాలే జరగకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలా చేయడం వల్ల ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మ కం పెరుగుతుందన్నారు. ఇళ్ల దొంగతనాల్లో చోరులు అపహరించిన సొత్తు రికవరీ తక్కువగా ఉంటోందని.. ప్రస్తుతం రికవరీ శాతం 50 శాతం కంటే తక్కువగా ఉందని, దీనిని కనీసం 80 శా తానికి పెంచాలని ఆదేశించారు. బాధితులు స్టేషన్‌కు వచ్చిన సందర్భాల్లో తక్షణం కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు కూడా ప్రారంభించాలన్నారు. అదేవిధంగా న్యాయస్థానాల్లో పెండింగ్ ట్రైల్ కేసుల్లో సాక్షులను కోర్టులో హాజరుపరిచి తీర్పులు వేగంగా వెలువడేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా రూపుదిద్దుకుంటోన్న ఆధునిక నేర పరిశోధన విధానాలను దర్యాప్తులో అమలుచేయాలని సూచిం చారు. జిల్లా అదనపు ఎస్పీ వలిశల రత్న, సబ్‌డివిజన్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు, సీఐలు, అధికారులు హాజరయ్యారు. -
ధిక్కరిస్తున్నారేం!
జిల్లా ఎస్పీ, నరసాపురం ఎమ్మెల్యేకు జిల్లా అదనపు జడ్జి నుంచి షోకాజ్ నోటీసులు జూలై 1న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు నరసాపురం : అనుచరులతో కోర్టు ఆవరణలోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అతని సోదరుడు పటేల్నాయుడు, వారి అనుచరులపై చార్జిషీట్ నమోదు చేయడంలో చోటుచేసుకున్న జాప్యంపై నరసాపురం అదనపు జిల్లా జడ్జి పి.కళ్యాణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 1న నరసాపురం ఏడీజే కోర్టుకు స్వయంగా హాజరై, వివరణ ఇవ్వాలని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, నరసాపురం సీఐ పి.రామచంద్రరావు, టౌన్ ఎస్సై బి.యుగంధర్కిరణ్కు ఆదేశాలిచ్చారు. ఇదే కేసులో.. కోర్టు విలువలను గౌరవించకుండా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతోపాటు ఆయన సోదరుడు పటేల్ నాయుడుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘2015 ఆగస్ట్ 15న ఎమ్మెల్యే అతని అనుచరులతో వచ్చి కోర్టు ఆవరణలో నాతో గొడవకు దిగారు. జాతీయ జెండాను కాళ్లకిందవేసి తొక్కారు. వందమందికి పైగా న్యాయవాదులు ప్రదర్శనగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి 22 నెలలు గడుస్తున్నా కనీసం చార్జిషీట్ వేయలేదు. జిల్లా అదనపు కోర్టు గత ఏడాది సెప్టెంబర్ 15న ఇచ్చిన తీర్పులో ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి, గొడవకు కారణమైన ఎమ్మెల్యే మాధవనాయుడు, అతని అనుచరులపై చార్జిషీట్ ఫైల్ చేయాలని ఆదేశించింది. 2015 ఏప్రిల్ 15న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎమ్మెల్యేకు రూ.1000 జరిమానా విధించింది. ఈ కేసులో నాతో సహా, 20మంది సాక్షులను విచారించి కూడా, ఇప్పటివరకూ ఎందుకు చార్జిషీట్ నమోదు చేయలేదు’ అని జడ్జి కళ్యాణరావు ప్రశ్నించారు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒక న్యాయస్థానానికి, జడ్జికి సంబంధించిన విషయంలోనూ పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజకీయ పలుకుబడితో ఈ క్రిమినల్ కేసునుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని జడ్జి మండిపడ్డారు. పోలీసుల తీరు, ఎమ్మెల్యే వ్యవహార శైలివల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం కలిగే అవకాశం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విభాగాలు రాజ్యాంగపరంగా వాటి విధులను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైన సందర్బాల్లో న్యాయవ్యవస్థ తానంతట తాను జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని కంటెంట్ ఆఫ్ కోర్టు రూల్స్ 9(4) కింద షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు జడ్జి పేర్కొన్నారు. ఎమ్మెల్యే అధికారాన్ని ఉపయోగించి, పోలీసుల సహకారంతో ఈ కేసును మిస్టేక్ ఆఫ్ యాక్ట్‌గా రిఫర్ చేయించేందుకు ప్రయత్నించడం దారుణమని షోకాజ్ నోటీసులో జడ్జి ఆవేదన వెలిబుచ్చారు. ఇదిలావుంటే ఈ వ్యవహారానికి సంబంధించి జడ్జి కళ్యాణరావు ఇటీవల సుప్రీంకోర్టుకు, ప్రధానమంత్రికి, హైకోర్టుకు, మానవ హక్కుల సంఘానికి లేఖలు రాసిన విషయం విదితమే. -
సిరంజీ సైకోను పట్టిస్తే 50వేలు..
-
' సైకోలు ఎంతమందనేది నిర్థారణ కాలేదు'
-
' సైకోలు ఎంతమందనేది నిర్థారణ కాలేదు'
ఏలూరు : మహిళలపై సైకో చేస్తున్న ఇంజక్షన్ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ స్పష్టం చేశారు. గురువారం ఏలూరులో ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ...ఈ కేసును నర్సాపురం డీఎస్పీ సౌమ్యలతకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మహిళలపై దాడులు చేస్తున్నది సైకోగా భావిస్తున్నామన్నారు. ఈ ఇంజక్షన్ సైకోలు ఎంతమంది ఉన్నారనేది ఇంతా ఓ నిర్ధారణ కాలేదని తెలిపారు. ఇంజక్షన్ సైకో దాడులను అరికట్టేందుకు 25 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అలాగే 45 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆగంతకుడు ఇంజక్షన్ సూది మాత్రమే వాడుతున్నాడన్నారు. ఇంజక్షన్‌లో ఎలాంటి హానికరమైనవి లేవని ల్యాబ్ టెస్ట్‌లో రుజువైందని భాస్కర్ భూషణ్ చెప్పారు. -
ర్యాగింగ్‌ను సహించం
బెల్లంపల్లి : వారందరూ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. సుదూర ప్రాంతాల నుంచి నిత్యం బస్సులు, ఆటోల్లో బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అలా వచ్చి వెళ్లే క్రమంలో బాలికలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థిని, విద్యార్థులు ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ వంటి ఆకృత్యాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇలా విద్యార్థిని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసుశాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసే ప్రయత్నం చేసింది సాక్షి. శాంతిభద్రత పరిరక్షణలో ఎంతో బిజీగా ఉండే బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ భాస్కర్ భూషణ్ వీఐపీ రిపోర్టర్‌గా మారి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులతో అడిషనల్ ఎస్పీ సంభాషణ ఇలా సాగింది.. అడిషనల్ ఎస్పీ : హాయ్ గల్స్, హౌఆర్యూ.. విద్యార్థినులు : (బెంచీపై నుంచి లేచి నిలబడి) హాయ్ సార్.. అడిషనల్ ఎస్పీ : నేను భాస్కర్‌భూషణ్, అడిషనల్ ఎస్పీ విద్యార్థినులు : ఓకే సార్.. గుర్తు పట్టాం అడిషనల్ ఎస్పీ : ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను. చెప్పండి(అంటూనే ఓ విద్యార్థినిని పలకరించారు.) అడిషనల్ ఎస్పీ : నీ పేరేంటమ్మా...? విద్యార్థిని : సార్.. నా పేరు అనుష అడిషనల్ ఎస్పీ : ఏం చదువుతున్నావు..? అనూష : ఏఈఐ ఫైనల్ ఇయర్ అడిషనల్ ఎస్పీ : ఓకే.. మీ కాలేజీలో ఈవ్‌టీజింగ్ ఏమైనా జరుగుతోందా? అనూష : అలాంటిదేమీ లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : భయపడకు, అలా జరిగితే నిర్భయంగా చెప్పు.(పక్కనే ఉన్న మరో విద్యార్థిని కల్పించుకొని మాట్లాడారు) విద్యార్థిని : లేదు సార్.. మేము బాగానే ఉంటున్నాం. అడిషనల్ ఎస్పీ : మీ పేరేంటీ?వనజ : సార్ నా పేరు వనజ అడిషనల్ ఎస్పీ : ఏం చదువుతున్నావు. మీదెక్కడా? వనజ : నేను కూడా ఏఈఐ ఫైనల్ ఇయర్, మాది జైపూర్ సార్ అడిషనల్ ఎస్పీ : ఓకే.. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వనజ : ఫార్మర్స్(రైతులు) సార్ అడిషనల్ ఎస్పీ : ఓకే మిమ్మల్నీ ఎవరైనా ఈవ్‌టీజ్ చేస్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు.. వనజ : అది.. సార్.. అడిషనల్ ఎస్పీ : ఏం పరవాలేదు ధైర్యంగా చెప్పమ్మా.. వనజ : సార్.. అమ్మాయిలను టీజ్ చేసే వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. అడిషనల్ ఎస్పీ : ఓకే.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వనజ : ఇకముందు మరే అమ్మాయిని టీజ్ చేయకుండా ఫనిష్మెంట్ ఇవ్వాలి. బట్ అతడి స్టడీ మాత్రం స్పాయిల్ కాకుండా చూడాలి సార్. అడిషనల్ ఎస్పీ : గుడ్... బాగా చెప్పావమ్మా.(మరో అమ్మాయితో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ) అడిషనల్ ఎస్పీ : మీ పేరేంటమ్మా? విద్యార్థిని : సార్, నా పేరు సుప్రియ అడిషనల్ ఎస్పీ : ఎక్కడ నుంచి వస్తావు సుప్రియ : సార్, మాది రామకృష్ణాపూర్ అడిషనల్ ఎస్పీ : కాలేజీకి ఎలా వస్తావు.. సుప్రియ : బస్సులో వస్తాను సార్ అడిషనల్ ఎస్పీ : బస్సు ప్రయాణంలో ఏమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా.. సుప్రియ : పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు సార్. అడిషనల్ ఎస్పీ : బస్సులో గల్స్ కూర్చునేందుకు సీటు ఇస్తారా? సుప్రియ : ఒక్కోసారి కష్టంగానే ప్రయాణం చేస్తుంటాం సార్.. (మరో అమ్మాయితో మాట్లాడుతూ) అడిషనల్ ఎస్పీ : మీ పేరేంటీ విద్యార్థిని : నా పేరు హారతి సార్ అడిషనల్ ఎస్పీ : నువ్వెక్కడి నుంచి కాలేజీకి వస్తావు హారతి : మందమర్రి నుంచి సార్ అడిషనల్ ఎస్పీ : నీవు కూడా బస్సులోనే వస్తావా హారతి : అవును సార్.. అడిషనల్ ఎస్పీ : ఓకే.. బస్సు ప్రయాణంలో ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది?(మరో విద్యార్థిని కల్పించుకొని మాట్లాడారు.) విద్యార్థిని : సార్ హైదరాబాద్‌లో మాదిరిగా ఇక్కడ కూడా బస్సుల్లో ఉమెన్స్‌కు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలి. అడిషనల్ ఎస్పీ : ఓకే... మీ పేరు? విద్యార్థిని : సార్ నా పేరు సుష్మిత అడిషనల్ ఎస్పీ : ఈ విషయం ఆర్టీసీ అధికారుల దృష్టికి మీరెప్పుడైనా తీసుకెళ్లారా? సుష్మిత, సుప్రియ, హారతి : లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : కనీసం మీ కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్స్‌కు చెప్పారా? సుష్మిత, సుప్రియ, హారతి : చెప్పలేదు సార్.. అడిషనల్ ఎస్పీ : మీరు పడుతున్న ప్రాబ్లమ్స్ ఆర్టీసీ అధికారులకు చెప్పండి. పరిశీలించి సాల్వ్ చేస్తారు. ఓకేనా.. సుష్మిత, సుప్రియ, హారతి : అలాగే సార్ అడిషనల్ ఎస్పీ : ఉమెన్స్ రక్షణకు ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి తెలుసా? హారతి : కొన్ని తెలుసు సార్.. అడిషనల్ ఎస్పీ : ఉమెన్స్‌ను వేధిస్తే నిర్భయ చట్టం, రక్షణకు షీ, అత్యవసరంగా 181 వంటి సదుపాయాలను పోలీసు శాఖ కల్పిస్తోంది. సుప్రియ : అవును సార్. వీటి గూర్చి ఇంకా చాలామందికి తెలియదు.. అడిషనల్ ఎస్పీ : ఇలాంటి విషయాలను గల్స్ తోటి వారికి చెప్పాలి. వారికి అవగాహన కల్పించాలి. హారతి : అలాగే చెబుతాం సార్ అడిషనల్ ఎస్పీ : గల్స్ను వేధించినట్లు తెలిస్తే సహించేది లేదు. చట్టపరంగా దోషులపై చర్య లు తీసుకుంటాం. బాయ్స్ బుద్ధిగా మెలగాలి.(అంటూ అక్కడి నుంచి అడిషనల్ ఎస్పీ వరండాలో ఉన్న విద్యార్థుల వైపు వెళ్లారు.) అడిషనల్ ఎస్పీ : (ఓ విద్యార్థి వద్దకు వెళ్లి) నీ పేరేంటీ? విద్యార్థి : నా పేరు నితిన్ అడిషనల్ ఎస్పీ : ఫ్రెషర్స్‌ను ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారా? నితిన్ : మా కాలేజీలో ర్యాగింగ్ జరగదు సార్.. అడిషనల్ ఎస్పీ : ఓకే.. ఇంత వరకు ఎవరిని ర్యాగింగ్ చేయలేదా? నితిన్ : లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : ఇంతకుముందు ర్యాగింగ్ జరిగినట్లు విన్నాను. నిజం కాదా? నితిన్ : సార్.. నాకైతే తెలియదు. అడిషనల్ ఎస్పీ : ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ నిషేధం కనుక అటువంటి చర్యలు కాలేజీలో జరిగితే సహించేది లేదు. ఆ దుశ్చర్యలకు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా కాలేజీ నుంచి తొలగించబడతారు. విద్యార్థులు (సామూహికంగా మాట్లాడుతూ) : అలాంటి చర్యలకు పాల్పడం సార్ అడిషనల్ ఎస్పీ : మీ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా? నితిన్ : ఉంది సార్ అడిషనల్ ఎస్పీ : వెరీగుడ్.. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటీ? నితిన్ : గౌట్జాబ్ సాధించాలనేది నా ఏయిమ్ సార్ అడిషనల్ ఎస్పీ : ఓకే... బెస్టాఫ్‌లక్.(మరో విద్యార్థిని పలకరించారు.) మీ పేరేంటీ? విద్యార్థి : శ్రీకాంత్ సార్ అడిషనల్ ఎస్పీ : మీ కాలేజీలో ప్లేస్మెంట్ ఉందా? శ్రీకాంత్ : లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : ఎందుకు జరగడం లేదు...? శ్రీకాంత్ : ఏమో సార్.. నాకు తెలియదు. అడిషనల్ ఎస్పీ : మైనింగ్ బ్రాంచి ఉంది కదా? సింగరేణిలో హండ్రెడ్ పర్సెంట్ మైనింగ్ ఉద్యోగాలు వస్తాయి కదా? శ్రీకాంత్ : అవును సార్... మైనింగ్‌కు మంచి డిమాండ్ ఉంది. (ఆతర్వాత అడిషనల్ ఎస్పీ పక్కనే ఉన్న అమ్మాయిల వద్దకు వెళ్లి పలకరించారు.) అడిషనల్ ఎస్పీ : మీరు బాగా చదువుకుంటున్నారా? విద్యార్థినులు : బాగా చదువుకుంటున్నాం సార్. అడిషనల్ ఎస్పీ : వెరీగుడ్.. మీతో బాయ్స్ ఎలా వ్యవహరిస్తున్నారు? సల్మాతబస్సుమ్ : (అనే విద్యార్థిని మాట్లాడుతూ) ఫ్రెండ్లీగా ఉంటారు సార్.. అడిషనల్ ఎస్పీ : ఏం ప్రాబ్లమ్స్ చేయట్లేదు కదా? సల్మాతబస్సుమ్ : అలాంటిదేమి లేదు సార్.. అడిషనల్ ఎస్పీ : అన్ని సబ్జెక్టుల లెక్చరర్స్ ఉన్నారా? సల్మాతబస్సుమ్ : అందరు ఉన్నారు సార్. అడిషనల్ ఎస్పీ : క్లాస్ బాగా చెబుతారా? సల్మాతబస్సుమ్ : బాగా చెబుతారు సార్.(మరో విద్యార్థినితో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ) అడిషనల్ ఎస్పీ : నీ పేరేంటీ? విద్యార్థిని : నా పేరు స్వప్న సార్.. అడిషనల్ ఎస్పీ : రోజు కాలేజీకి ఎలా వస్తావు? స్వప్న : ఆటోలో వస్తాను సార్.. అడిషనల్ ఎస్పీ : ఆటో డ్రైవర్లు ఏమైన ప్రాబ్లమ్స్ చేస్తున్నారా? స్వప్న : లేదు సార్. అడిషనల్ ఎస్పీ : ఓకే.. గల్స్ ధైర్యంగా కాలేజీకి రావాలి. ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే మా దృష్టికి తీసుకురండి.. తగిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థినులు : ఓకే.... థ్యాంక్యూ సార్... (వెంటనే అడిషనల్ ఎస్పీ పక్కనే ఉన్న లెక్చరర్స్ వద్దకు వచ్చి మాట్లాడారు.) అడిషనల్ ఎస్పీ : గల్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత మీపైన(లెక్చరర్స్) ఉంది. రాకపోకలు చేసే క్రమంలో కలుగుతున్న ఇబ్బం దులు, కాలేజీలో గల్స్ పడే ప్రాబ్లమ్స్‌ను అడి గి తెలుసుకొని పరిష్కరించండి. మా దృష్టికి తీసుకువస్తే మేము కూడా సహకరిస్తాం. లెక్చరర్స్ : తప్పకుండా సార్. మీరు సూచించిన మాదిరిగానే గల్స్పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం.