సత్వర పరిష్కారంతోనే న్యాయం
సత్వర పరిష్కారంతోనే న్యాయం
Published Sun, May 28 2017 1:49 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM
ఏలూరు అర్బన్ : పెండింగ్‌లో ఉన్న కేసులను సాధ్యమైనం త తొందరగా పరిష్కరించడం వల్ల నిజమైన బా ధితులకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ అధికారులకు సూచిం చారు. శనివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నరసాపురం, కొవ్వూరు డీఎస్పీలతో ఆయన జి ల్లాస్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా డివిజన్ల పరిధిలోని స్టేషన్‌లలో నమోదైన నేరాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, ఆస్తి రికవ రీ, పెండింగ్‌లో ఉన్న కేసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్ తదితర అంశాలపై డీఎస్పీల వివరణ తీసుకున్నారు. దర్యాప్తు వేగవంతం కాకుంటే న్యాయం ఆలస్యమవుతుందని, అది బాధితులకు అన్యాయమే అవుతుందన్నారు. అధికారులు నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చే యడం కంటే అసలు నేరాలే జరగకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలా చేయడం వల్ల ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మ కం పెరుగుతుందన్నారు. ఇళ్ల దొంగతనాల్లో చోరులు అపహరించిన సొత్తు రికవరీ తక్కువగా ఉంటోందని.. ప్రస్తుతం రికవరీ శాతం 50 శాతం కంటే తక్కువగా ఉందని, దీనిని కనీసం 80 శా తానికి పెంచాలని ఆదేశించారు. బాధితులు స్టేషన్‌కు వచ్చిన సందర్భాల్లో తక్షణం కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు కూడా ప్రారంభించాలన్నారు. అదేవిధంగా న్యాయస్థానాల్లో పెండింగ్ ట్రైల్ కేసుల్లో సాక్షులను కోర్టులో హాజరుపరిచి తీర్పులు వేగంగా వెలువడేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా రూపుదిద్దుకుంటోన్న ఆధునిక నేర పరిశోధన విధానాలను దర్యాప్తులో అమలుచేయాలని సూచిం చారు. జిల్లా అదనపు ఎస్పీ వలిశల రత్న, సబ్‌డివిజన్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు, సీఐలు, అధికారులు హాజరయ్యారు.
Advertisement