ఆగస్టు 15న ప్రారంభించే ‘గ్రామజ్యోతి’ పల్లెల సమగ్రాభివృద్ధికి వేదిక కావాలని, ఇందుకోసం జిల్లాస్థాయి అధికారులు అంకితభావంతో పని చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం విజయవంతంలో అధికారులే కీలకం కావాలన్నారు. ప్రతీ గ్రామంలో ప్రజల భాగస్వామ్యం ఉండే లా చూడాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గ్రామజ్యోతిపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమా వేశానికి జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్‌పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, జడ్‌పీ సీ ఈఓ మోహన్‌లాల్, డీపీఓ కృష్ణమూర్తి హాజరయ్యారు.