Gramajyoti
-
పల్లెల బడ్జెట్ ప్రకటించిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీల వార్షిక ఆర్థిక ప్రణాళికలను ప్రభుత్వం వినూత్నంగా తయారు చేసింది. గ్రామాల వారీగా రాబోయే నాలుగేళ్ల బడ్జెట్‌ను ప్రకటించింది. గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా ఒక్కో పంచాయతీలో గుర్తించిన పనులకు ఈ ఏడాది ఎంత మొత్తం కేటాయించాలి...? వరుసగా 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు రాబోయే నాలుగేళ్లలో ఏటా ఎంత మొత్తం నిధులు అంచనాగా అవసరమవుతాయి..? అనే లెక్కలను ప్రభుత్వం అంచనా వేసుకుంది. గ్రామాల వారీగా రూపొందించిన ప్రణాళికల ఆధారంగా పంచాయతీల బడ్జెట్‌ను ప్రకటించింది. గ్రామ పంచాయతీల వారీగా సంబంధిత కేటాయింపుల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచింది. ఏయే పద్దుల నుంచి ఈ నిధులను సమకూర్చనుందో.. అందులో సవివరంగా వెల్లడించింది. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలోని కెరిమెరి మండలంలోని అంతాపూర్ గ్రామ పంచాయతీలో 2,274 మంది జనాభా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.92.72 లక్షలు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 97.91 లక్షలు, 2017-18లో రూ.1.02 కోట్లు, 2018-19లో రూ.1.08 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. నాలుగేళ్లలో మొత్తం రూ.4.01 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. పదమూడు, పద్నాలుగో ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, తలసరి గ్రాంటు, సీనరేజీ, వృత్తి పన్ను, సొంత పన్నులు, ఉపాధి హామీ, స్టేట్ ప్లానింగ్ గ్రాంట్లు.. ఏయే పద్దు కింద ఎంతెంత మొత్తం కేటాయిస్తుందో ముందుగానే ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 8,695 గ్రామ పంచాయతీలున్నాయి. విడివిడిగా అన్ని గ్రామాలకు సంబంధించిన వార్షిక బడ్జెట్ అంచనాలను రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ఇదే తీరుగా వెల్లడించింది. ఆగస్టు 17న రాష్ట్రప్రభుత్వం వినూత్నంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందనే ఆశయంతో అడుగు ముందుకేసింది. పల్లెపల్లెనా గ్రామ సభలు నిర్వహించి అక్కడి ప్రజల అవసరాలను తెలుసుకుంది. అత్యవసరమైన మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా కొన్ని పనులకు పెద్దపీట వేసింది. వాటికయ్యే అంచనా వ్యయం ఆధారంగా ఈ బడ్జెట్ రూపొందించింది. పక్కాగా రాష్ట్ర ప్రణాళిక గ్రామజ్యోతిలో గుర్తించిన పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. మొత్తం తొమ్మిది పద్దుల నుంచి సమకూరే నిధులన్నీ క్రోడీకరించింది. వీటితో మొత్తం రూ. 21104.44 కోట్లు సమకూరుతాయి. నిర్ణీత గ్రామ ప్రణాళికల్లో ఎంచుకున్న పనులకు వీటిని ఖర్చు చేయాలని నిశ్చయించింది. ఈ నిధులు సరిపోకపోతే.. ఏటేటా రాష్ట్ర బడ్జెట్టులో నిధులు కేటాయించాలని నిర్ణయించింది. గ్రామజ్యోతికి పెద్దపీట రాబోయే నాలుగేళ్లలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ కార్యక్రమం ద్వారా రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందులో భాగంగానే ఇంటింటా మరుగుదొడ్ల కార్యక్రమం, చెత్త సేకరణపై మొదటగా దృష్టి సారించింది. గ్రామజ్యోతిలో గుర్తించిన డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు పారిశుద్ధ్య నిర్వహణకు వీలుగా గ్రామాల్లో చెత్త సేకరణకు ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గ్రామజ్యోతి ప్రణాళికలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టమవుతోంది. -
‘ఎర్రవల్లి’పై సీఎం ఆరా
జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ గురువారం రాత్రి తన ఫాంహౌస్‌కు వస్తూనే ఎర్రవల్లి పనులపై ఆరా తీసినట్టు తెలిసింది. గ్రామజ్యోతిలో భాగంగా ఆయన తన గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామంలో రెండ్రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న పనులపై ఆయన ఆరా తీశారని సమాచారం. కాగా, గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో సీఎం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆదివారం వరకు ఇక్కడే ఉంటారని తెలిసింది. -
సమస్యల చీకట్లను తొలగించేందుకే ‘గ్రామజ్యోతి’
అజీజ్‌నగర్‌లో గ్రామజ్యోతి ప్రారంభ సభలో మంత్రి కేటీఆర్ మొయినాబాద్ రూరల్: సమస్యల చీకట్లను తొలగించి గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ధి చేసేందుకే గ్రామజ్యోతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో సోమవారం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన గ్రామసభలో మాట్లాడుతూ గ్రామజ్యోతిలో ప్రజలే నిర్ణేతలని, సమస్యలను ప్రజలు గుర్తిస్తే వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించే బాధ్యతను పంచాయతీలు, ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కొన్నిపార్టీలు గ్రామజ్యోతిపై రాద్ధాంతం చేస్తున్నాయని, ‘మన ఊరు- మన ప్రణాళిక’ను తీసేయలేదని, దానికి కొనసాగింపే గ్రామజ్యోతి అని స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి బేసిన్‌నుంచి నీళ్లు రావడం కష్టమనే ఉద్దేశంతోనే ‘పాలమూరు- రంగారెడ్డి పథకంతో కృష్ణాబేసిన్ ద్వారా నీళ్లు తెచ్చి జిల్లా ప్రజల కాళ్లుకడుగుతామని కేటీఆర్ చెప్పారు. రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీ ఆమ్రపాలి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, అజీజ్‌నగర్ సర్పంచ్ మంగరాములు, అధికారులు పాల్గొన్నారు. ‘ప్రాణహిత’ డిజైన్ మార్చవద్దంటూ ఆందోళన గ్రామజ్యోతి కార్యక్రమ ప్రారంభోత్సవంలో కేటీఆర్ మాట్లాడుతుండగా.. ఎన్ఎస్యూఐ చెందిన యువకులు ‘ప్రాణహిత-చేవెళ్ల’ డిజైన్ మార్చవద్దని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో స్పందించిన మంత్రి ‘డిజైన్ ఎవరు మార్చారు.. ఆ విషయాన్ని ప్రభుత్వం చూసుకుటుంది.. మంచి కార్యక్రమాలలో ఇలాంటివి చేయవద్దు’ అని వారించే ప్రయత్నం చేశారు. -
కేసీఆర్ ఆరోసారి
-
‘గ్రామజ్యోతి’ వెలగాలి
-
‘గ్రామజ్యోతి’ వెలగాలి
ఈ యజ్ఞంలో అధికారులే కీలకం - మండలానికో ‘ఛేంజ్ ఏజెంట్’ కావాలి - 15న లాంఛనంగా ప్రారంభం 17 నుంచి యాక్షన్‌ప్లాన్ షురూ కావాలి - కలెక్టర్, ఎస్పీ, జేసీతో సీఎం కేసీఆర్ - సమీక్షలో అంకాపూర్ పేరు ప్రస్తావన - పుష్కరాలు బాగా నిర్వహించారని కితాబు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆగస్టు 15న ప్రారంభించే ‘గ్రామజ్యోతి’ పల్లెల సమగ్రాభివృద్ధికి వేదిక కావాలని, ఇందుకోసం జిల్లాస్థాయి అధికారులు అంకితభావంతో పని చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం విజయవంతంలో అధికారులే కీలకం కావాలన్నారు. ప్రతీ గ్రామంలో ప్రజల భాగస్వామ్యం ఉండే లా చూడాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో గ్రామజ్యోతిపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమా వేశానికి జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, జడ్పీ సీ ఈఓ మోహన్‌లాల్, డీపీఓ కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఎవరి ఇంటి అభివృద్ది కోసం వాళ్లు ప్రణాళికలు సిద్దం చేసుకున్నటు,్ల ఎవరి ఊరి అభివృద్ధికి వారే ప్రణాళికలు సిద్ధం చేసుకునే విధంగా ప్రజలను సమాయత్తం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. గ్రామజ్యోతి అంటే గ్రామాలకు నిధులు కేటాయించడం కాదు, అందులో ప్రతీ పౌరుడిని భాగస్వామిని చేయడమేనన్నారు. మొదటి దశలో ప్రజలంతా కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో గ్రామాలు ఉండే విధంగా ప్రజలు సంఘటిత శక్తితో పనిచేయాలని కోరారు. గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. ఏ గ్రామానికి ఏ సదుపాయం కావాలో దాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తి తేవాలి పంచాయతీరాజ్ ఉద్యమస్ఫూర్తిని మళ్లీ తీసుకు రావాలని అధికారులను కేసీఆర్ కోరారు. ప్రజలను భాగస్వాములను చేసి దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా మార్పులు సాధించాలన్నారు. అవసరాన్ని బట్టి ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ కార్యక్రమాలు నడపాలన్నారు. ప్రజల సంఘటిత శక్తిలోని బలమేంటో గుర్తించాల న్నారు. ఏ ఊరుకు ఆ పూరు ప్రణాళిక సిద్దం చేసుకునేలా ప్రజలకు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అంకాపూర్ పేరును ప్రస్తావించిన సీఎం కేసీ ఆర్.. అన్ని జిల్లాల అధికారులు అన్ని గ్రామాలను అంకాపూర్‌లా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభించే గ్రామజ్యోతిలో భాగంగా అధికారులు 17 నుంచి యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. 17 నుంచి 24 వరకు ప్రతీగ్రామంలో పారిశ్యుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, చెత్త, దుర్గంధం లేని గ్రామాలను చూడాలన్నారు. జిల్లాలో ఉండే అధికారులు మండలానికొకరు ఛేంజ్ ఏజెంట్స్‌గా వ్యవహరించాలని కోరారు.