లలిత్ మోదీ వ్యవహారంపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరు కావాలని కోరుతున్నామని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రేడియోలోనూ, టీవీలోనూ, పత్రికల్లోనూ కాదని, సభలో ప్రధాని మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం లోక్ సభలో లలిత్ మోదీ అంశంపై చర్చ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ మోదీ సభా నాయకుడు, చర్యలు తీసుకోవాల్సింది ఆయనే, అందుకే ప్రధాని చర్చ సమయంలో ఉండాలని కోరుతున్నామన్నారు.