పశ్చిమబెంగాల్ సచివాలయం కేంద్రంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికి దాదాపు 10 గంటలకు పైగా లోపలే ఉండి గడియ పెట్టుకున్నారు. బయటకు రావడానికి ఏమాత్రం అంగీకరించడం లేదు. రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తే తప్ప తాను బయటకు వచ్చేది లేదని పట్టుబట్టారు. అయితే భారత సైన్యం మాత్రం ఆమె వాదనను కొట్టిపారేసింది. సైన్యం పశ్చిబెంగాల్‌లో కవాతు ఏమీ చేయడంలేదని, ఇది సర్వసాధారణంగా అన్నిచోట్లా తాము చేసే డ్రిల్లేనని చెప్పింది.