ఏపీకి చైనా పెట్టుబడులు | McKinsey to facilitate flow of Chinese investments into AP | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 20 2017 7:12 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఆంధ్రప్రదేశ్‌కు చైనా పెట్టుబడుల రాకను సులభతరం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని మెకెన్సీ గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ సంచాలకుడు జోనాథన్‌ ఓజల్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం చంద్రబాబు పలు సంస్థల ప్రతినిధులతో జరిపిన సమావేశాల వివరాల ను బుధవారం మీడియాకు విడుదల చేసింది. సీఎంతో జరిగిన సమావేశంలో గ్లోబల్‌ మెకెన్సీ సంచాలకుడు జోనాథన్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక వనరులు, పెట్టుబడులు సమకూర్చడంలో మెకెన్సీ గ్లోబల్‌ ముఖ్య భూమిక పోషించాలని సీఎం కోరారు. జేపీ మోర్గాన్‌ ఛేస్‌ వాణిజ్య వ్యూహ విభాగ అధిపతి మాక్స్‌ న్యూకిర్షెన్‌తో జరిగిన భేటీలో రాష్ట్రంలో ని సహజ వనరులు, పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు.ఆఫ్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ సపోర్టింగ్‌ షీట్లు తయారు చేసే టీజిన్‌ లిమిటెడ్‌ సంస్థ అధ్యక్షుడు జున్‌ సుజుకీతే సమావేశమై ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement