రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. బుధవారం కాపు జేఏసీ నేతలతో సమావేశమై ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. డిసెంబర్ 6 వరకు పాదయాత్ర వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. త్వరలో మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రెండు నెలల్లో మంజునాథ నివేదిక వస్తుందని సీఎం చంద్రబాబు చెప్పినందున, ప్రభుత్వానికి రెండు నెలల గడువు ఇస్తున్నామన్నారు. అంబేద్కర్ వర్థంతి డిసెంబర్ 6లోపు రిజర్వేషన్ అమలు చేయకుంటే ముఖ్యమంత్రికి తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.
Published Wed, Aug 30 2017 7:02 PM | Last Updated on Wed, Mar 20 2024 11:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement