గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీవీ కార్యాలయంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ సోమవారం ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే పోలీసులు ర్యాలీని అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Published Mon, Jul 11 2016 11:16 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement