మళ్లీ వెయ్యి నోట్లు వచ్చేస్తాయి! | new 1000 rupee notes will be issued in few months, says shaktikanta das | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 10 2016 11:52 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

ప్రస్తుతం ప్రభుత్వం రద్దుచేసిన వెయ్యి రూపాయల నోట్లు త్వరలోనే మళ్లీ మార్కెట్లలోకి వస్తాయి. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతోపాటు ఎకనమిక్ ఎడిటర్స్ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ కొత్త విషయం వెల్లడించారు. దాంతోపాటు, ఇప్పటికే చలామణిలో ఉన్న అన్ని నోట్లూ మళ్లీ కొత్త డిజైన్లతో వస్తాయని కూడా తెలిపారు. ఇప్పుడు చలామణిలో ఉన్న 100, 50, 20, 10, 5, 2, 1 నోట్లు అన్నీ కూడా యథాతథంగా చెల్లుబాటు అవుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement