ఆసుపత్రి నుంచి అదృశ్యమైన పాప | Newborn baby goes missing from farah hospital in musheerabad | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 11 2013 11:25 AM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

మరో పసికందు ఆసుపత్రి నుంచి మాయమైంది. హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని ఫరాఖాన్‌ ఆసుపత్రి నుంచి అయిదు రోజుల శిశువు అదృశ్యమైంది. భోలక్‌పూర్‌ పద్మశాలి కాలనీలో నివసించే షేక్ సాదిఖ్‌, రెహానా దంపతులకు ఈ నెల 7న ఆడబిడ్డ పుట్టింది. అయితే తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి, తన చేతుల్లోంచి బలవంతంగా బిడ్డను లాక్కుని వెళ్లిపోయిందని రెహానా చెబుతోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల్లో నమోదు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement