baby missing
-
ఏ తల్లి కన్న బిడ్డనో.. దర్యాప్తునకు రైల్వేపోలీస్ ప్రత్యేక బృందం!
కామారెడ్డి క్రైం: ఏ తల్లి కన్న బిడ్డనో.. ఏడాదిన్నర వయస్సులో కన్నవారికి దూరమై వారం రోజులుగా ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో ఉంది. కన్నవారి కోసం పరితపిస్తూ దీనంగా చూస్తోంది. గత గురువారం కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఓ చిన్నారిని గుర్తు తెలియని మహిళ వదిలేసి వెళ్లిన విషయం తెలిసిందే. తోటి ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ చిన్నారి నిజామాబాద్ బాలల సంరక్షణ విభాగం వద్ద ఉంది. అయితే ఆ పాప ఎవరు.. ఆమెను ఎవరు వదిలి వెళ్లారు.. ఎందుకు వదిలేశారు అనే విషయాలు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ఆమెను ఎక్కడి నుంచి, ఎవరు తీసుకుని వచ్చారు అనే విషయాలను తెలుసుకోవడానికి కామారెడ్డి రైల్వే పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. అకోలా రైలు కామారెడ్డికి రాగానే సదరు చిన్నారి రైలులోని మెట్లకు దగ్గరగా కూర్చుని ఏడుస్తుందని కొందరు చెప్పగా, ఓ వృద్ధురాలు రైలు దిగి పాపను ప్లాట్‌ఫాంపై వదిలి వెళ్లిందని మరి కొందరు చెప్పుకొచ్చారు. వాస్తవం ఏమిటనే దానిపై స్పష్టత రాలేదు. రైల్వే స్టేషన్‌లోని టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర మాత్రమే సీసీ కెమెరా ఉంది. ప్లాట్‌ఫాం పై జరిగే దృశ్యాలు అందులో కనబడవు. దీంతో పాపను కన్న తల్లే వదిలించుకుందా, లేక మరెవరైనా కావాలనే వదిలి వెళ్లారా అనేది తెలియలేదు. మహారాష్ట్రకు చెందిన చిన్నారి మాదిరిగా అనిపించడం తప్ప ఎలాంటి వివరాలు లేవు. కేసు నమోదు చేసి విచారణ బాలల సంరక్షణ ఉల్లంఘన, ఐపీసీ సెక్షన్ 317 కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. రైల్వే స్టేషన్‌కు ఎవరైనా తీసుకువచ్చారా అనే కోణంలో మొదట విచారించారు. అందుకు ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని మంగళవారం కామారెడ్డిలోని అన్ని కూడళ్లు, రైల్వే స్టేషన్ దారి గుండా ఉండే సీసీ కెమెరాలను అన్నింటినీ పరిశీలించారు. ఎలాంటి ఆధారం దొరకలేదు. దీంతో చిన్నారి రైలులోనే కామారెడ్డికి చేరినట్లు నిర్ధారణకు వచ్చారు. తదుపరి విచారణ నిమిత్తం రైల్వే పోలీసులు అకోలా నుంచి కామారెడ్డి వరకు ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు, వాటి పరిసర ప్రాంతాల్లో ఉండే సీసీ ఫుటేజీలను పరిశీలించే పనిలో ఉన్నారు. ఇందు కోసం అకోలా, నాందేడ్, ముత్కేడ్, ఉమ్రి, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్ రైల్వే స్టేషన్లలో సీసీ ఫుటేజీల పరిశీలన, విచారణ జరపాల్సి ఉంది. బుధవారం నుంచి ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ఆయా స్టేషన్లలో విచారణ జరుపనున్నట్లు తెలిసింది. ఎలాగైనా కేసును చేధించి సదరు చిన్నారిని కన్నవారి చెంతకు చేర్చాలనీ, వాస్తవాలను వెలికి తీయాలని కామారెడ్డి రైల్వే పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. -
HYD: నిలోఫర్ ఆసుపత్రిలో దారుణం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో నుంచి ఆరు నెలల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో, ఘటన ఆసుపత్రిలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. నిలోఫర్ ఆసుపత్రిలో ఆరు నెలల బిడ్డ అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు ఆసుపత్రి నుంచి ఎత్తుకెళ్లారు. అయితే, బిడ్డ తల్లి భోజనం కోసం వెళ్లగా చిన్నారిని దుండగులు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో బాధితురాలు నాంపల్లి పోలీసు స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. నిలోఫర్ ఆసుపత్రి ట్రీట్మెంట్ వార్డులో సీసీ కెమెరా లేకపోవడంతో దర్యాప్తు చేయడం పోలీసులకు సమస్యగా మారింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం -
కన్నపేగు పోరాటం.. ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని..
కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ సంఘటన ఈ సోమవారం నాడు చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. జరగాల్సిన కార్యక్రమం యథావిధిగా నడుస్తోంది. మీడియా అటెన్షన్ కూడా ఈ విషయం మీదనే కేంద్రీకృతమై ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన కేసు అది. అనుపమ అనే ఓ తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటం. కన్నపేగు చేస్తున్న పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైంది. పోలీసులు బిడ్డను వెతికి రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇక అనుపమ చేతిలో పెట్టడమే తరువాయి. బిడ్డను చూపించండి! ఆదివారం నాటి రాత్రి పోలీసులు బిడ్డతో కేరళ రాజధాని తిరువనంతపురం చేరారు. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశం మేరకు డీఎన్ఏ పరీక్ష కోసం సోమవారం నాడు బిడ్డ నుంచి నమూనా సేకరించారు. డీఎన్ఏ పరీక్ష తమ కళ్ల ముందే జరగాలని అనుపమ పట్టుపట్టింది. తన బిడ్డ నమూనాలను మార్చివేయరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించింది అనుపమ. ఒక్కసారి బిడ్డను కళ్లారా చూస్తానని ప్రాధేయపడింది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో అంతా సవ్యంగా జరుగుతుందనే నమ్మకం కలగడం లేదని ఆమె పడుతున్న ఆవేదన, ఆందోళన అందరికీ అర్థమవుతోంది. నమూనా సేకరణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసినట్లు చెబుతూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. అనుపమ, ఆమె ప్రేమికుడు, బిడ్డ నమూనాలు స్థానిక రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చేరినట్లు ఆ రాష్ట్రంలోని కౌముది మీడియా తెలిపింది. నమూనాలు సరిపోలినట్లు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత న్యాయపరమైన నిబంధనలు పూర్తి చేసి బిడ్డకు అనుపమకు ఇస్తారు. అప్పటివరకు బిడ్డను జిల్లా చైల్డ్ ప్రొటెషన్ ఆఫీసర్ సంరక్షణలో ఉంచుతారు. ఆ బిడ్డ ఈ బిడ్డేనా! జరుగుతున్న పరిణామాలు అనుపమకు సంతోషాన్నిస్తున్నట్లే కనిపిస్తున్నట్లు స్థానిక మీడియా చెప్తోంది. అలాగే పోలీసులు తీసుకువచ్చిన బిడ్డ అనుపమకు పుట్టిన బిడ్డ అనడానికి తార్కికపరమైన ఆధారాలు అందుతున్నాయి. బిడ్డ మాయమైన తర్వాత ఒకటి– రెండు రోజుల తేడాలో ఆ రాష్ట్రంలో అమ్మ తొట్టిల్ (ఉయ్యాల) పథకంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉయ్యాలలోకి ఇద్దరు బిడ్డలు వచ్చారు. వారిలో ఒక బిడ్డకు గత నెలలో పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఓ బిడ్డను దత్తత ఇచ్చినట్లు తెలిసింది. ఆ బిడ్డ కోసం గాలించి ఆదివారం నాడు విజయవంతంగా ఛేదించారు. కన్నపేగు పోరాటం వృథా కాదని, ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటోంది. అనుపమ ఒడికి చేరే క్షణం కోసం ఎదురు చూస్తోంది. ఇదీ జరిగింది! అనుపమ గత ఏడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు తల్లయింది. ఆమె కేరళ సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి. అనుపమ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి స్వయానా కూతురినే మోసం చేశాడు. ఆమె కన్నబిడ్డను ఆమె నుంచి వేరు చేశాడు. ‘బిడ్డను రహస్య ప్రదేశంలో సంరక్షిస్తున్నట్లు’ కొద్ది నెలల పాటు ఆమెను మభ్యపెట్టాడు. తాను మోసపోయానని తెలిసిన తర్వాత ఆమె ఇంటి నుంచి పారిపోయి, ప్రేమికుడితో కలసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. ఆమె తండ్రి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తి, కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రజాప్రతినిధి కూడా కావడంతో పోలీసులు మొదట్లో ఆమె కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి మీనమేషాలు లెక్కపెట్టారు. ఆమె పోలీసులు, శిశు సంక్షేమశాఖతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కలిసి తన బిడ్డను తనకు ఇప్పించమని వేడుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. అనుపమ తండ్రి చేసిన ఘోరం రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారి తీసింది. మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ నెల 18వ తేదీన వెలువడిన ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కదలిక వచ్చింది. సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన పోలీసులు బిడ్డను సొంత రాష్ట్రానికి తీసుకువెళ్లారు. బిడ్డ రాష్ట్రానికి చేరిన వార్త సోమవారంనాడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. -
ఇంద్రకీలాద్రిపై ఉత్కంఠ రేపిన చిన్నారి మిస్సింగ్
సాక్షి, విజయవాడ/నరసరావుపేట టౌన్: ఇంద్రకీలాద్రిపై చిన్నారి మిస్సింగ్ ఉదంతం 12 గంటల పాటు ఉత్కంఠ రేపింది. చివరకు చిన్నారి ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం అరసబలగాకు చెందిన పైడిరాజు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నవ్యశ్రీ (4)కాగా రెండో కుమార్తె నెలల పిల్ల. నవ్యశ్రీ విజయవాడ చిట్టినగర్‌లోని తాతయ్య కోరగంజి కృష్ణ ఇంట్లో ఉంటోంది. పైడిరాజు దంపతులు, కృష్ణ దంపతులు ఇటీవల తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడకు చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు కొండపైన మల్లికార్జున మహామండపం వద్దకు చేరుకున్నారు. సెల్ఫోన్లు భద్రపరుచుకునే కౌంటర్ వద్దకు వెళ్లిన సమయంలో కొద్ది నిమిషాలు నవ్యశ్రీని తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఆ తర్వాత పాప కనపడకపోవడంతో ఆ దంపతులు ఆందోళన చెందారు. ఆలయం వద్ద మైక్‌లో చెప్పించినా ఉపయోగం లేకపోవడంతో 10 గంటల ప్రాంతంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అర్జునవీధిలోని ఓ సీసీ కెమెరాను పరిశీలిస్తుండగా.. ఓ మహిళ చిన్నారిని తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఆమెతో పాటు మరో మహిళ, ఓవ్యక్తి కూడా ఉన్నారు. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలను పరిశీలించగా.. పాప పదో నంబర్ ప్లాట్‌ఫాంపై మహిళతో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో బయలుదేరిన రైళ్లు గుంటూరు వైపుగా వెళ్లడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. నరసరావుపేటలో పాప ఆచూకీ ఉదయం కనకదుర్గమ్మ ఆలయంలో తప్పిపోయిన బాలిక రాత్రి గుంటూరు జిల్లా నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. నరసరావుపేటకు చెందిన చల్లా సుబ్బలక్ష్మి పాపను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తాము ఆదివారం ఉదయం దుర్గమ్మ దర్శనానికి వెళ్లామని, తిరిగి వస్తుండగా పాప ఏడుస్తూ కనిపించిందని తెలిపారు. పాప వివరాలు చెప్పలేకపోయిందని, తమతో పాటే వచ్చేసిందని పేర్కొన్నారు. విజయవాడలో ఎవరికి అప్పగించాలో తెలియక నరసరావుపేట పోలీసులకు పాపను అప్పగించామని తెలిపారు. పాపను రాత్రి 10 తర్వాత పోలీసులు విజయవాడకు పంపారు. అమ్మదయతోనే తమ పాప దొరికిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటల సమయంలో పాప ఆచూకీ తెలిసిందన్నారు. బయటపడ్డ భద్రత డొల్లతనం దుర్గగుడిలో 79 కెమెరాలు ఉన్నాయి. అయినా పాప తప్పిపోయిన విషయం గుర్తించలేకపోయారు. అయితే మల్లికార్జున మహామండపం వద్ద ఉన్న కెమెరా వర్షానికి పాడైపోయిందని అధికారులు చెబుతున్నారు. ఘాట్‌రోడ్డు వద్ద, కొండపైన క్లోక్ రూమ్ వద్ద ఉన్న కెమెరాలు స్పష్టంగా కనపడటం లేదంటున్నారు. కీలకమైన ఈ ప్రాంతాల్లో కెమెరాలు పనిచేయకపోయినా అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ మూడు కెమెరాలే పనిచేయడంలేదని అధికారులు చెబుతున్నా.. వాస్తవంగా సగం కెమెరాలు పనికిరానివేనని సమాచారం. అమ్మవారి ప్రధాన ఆలయం, ఉపాలయాలు వద్ద కెమెరాలు తప్ప మిగిలినవేవీ పనిచేయడం లేదు. అయినా అధికారులు కానీ, పాలకమండలి కానీ పట్టించుకోవడంలేదు. సీసీ కెమెరాలు పనిచేస్తే దేవస్థానం ఉద్యోగుల అక్రమాలు బయటపడతాయని సిబ్బంది కూడా ఈ విషయంపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
బెజవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద కలకలం
-
శిశువు అదృశ్యం కేసులో కీలక ఆదారలు
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన
-
’నాబిడ్డను నాకు తెచ్చివ్వండి’
-
రెండ్రోజులైనా లభించని పసికందు ఆచూకీ
-
అనుమానాస్పద స్థితిలో చిన్నారి అదృశ్యం
పూడూరు : అనుమానాస్పద స్థితిలో ఏడాది వయసున్న ఓ చిన్నారి అదృశ్యమైన సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ నాగరాజు కథనం ప్రకారం.. పూడూరు మండల కేంద్రానికి చెందిన మాసగళ్ల శ్రీనివాస్, అనురాధ దంపతులు. వీరికి కుమార్తె పింకితో పాటు ఏడాది వయసున్న మరో కూతురు ఉంది. శుక్రవారం అనురాధ తన చిన్నకూతురుకు పాలుపడుతూ నిద్రకు ఉపక్రమించింది. కొద్దిసేపటి తర్వాత ఆమె నిద్రలేచి చూడగా చిన్నారి కనిపించలేదు. పాప కోసం కుటుంబీకులు వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సాయంత్రం శ్రీనివాస్ చన్గోముల్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
చిన్నారి అదృశ్యం
రెండు గంటల్లోపే తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ఖాజీపేట : ఖాజీపేటలో ఓ చిన్నారి అదృశ్యం కాగా పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు గంటల్లోపే చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఖాజీపేట బస్టాండు కూడలిలో నివాసముంటున్న సత్యమయ్య సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోపు వారి ఆరేళ్ల చిన్నారి అశ్విని కనిపించలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ రాజగోపాల్ సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం చేరవేశారు. కడప పాత బస్టాండులో చిన్నారి ఏడుస్తుండగా గమనించిన అక్కడి పోలీసులు పాపను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఖాజీపేట పోలీసులకు విషయం తెలపడంతో వీరు వెళ్లి చిన్నారిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. సత్యమయ్య కుటుంబ సభ్యులు బస్సు ఎక్కకముందే అటువైపు వచ్చిన బస్సులో చిన్నారి ఎక్కి కడపకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అదృశ్యమైన రెండు గంటల్లోపే పోలీసులు స్పందించి చిన్నారిని క్షేమంగా అప్పగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజగోపాల్ మాట్లాడుతూ రహదారి పక్కన నివాసముంటున్న వారు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
రెండురోజుల పసికందు అపహరణ
-
రెండురోజుల పసికందు అపహరణ
విశాఖ : విశాఖ కేజీహెచ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కేజీహెచ్‌లో రెండు రోజుల పసికందు అదృశ్యమైన సంఘటన కలకలం సృష్టిస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఓ మగ శిశువు అపహరణకు గురైంది. దాంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బంధువులపై వారు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కేజీహెచ్‌లో సీసీ కెమెరాలు కూడా పనిచేయక పోవడంతో శిశువును ఎవరు అపహరించారనే పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ఆసుపత్రి నుంచి అదృశ్యమైన పాప
-
ఆస్పత్రిలో అయిదు రోజుల పసికందు మాయం
హైదరాబాద్ : మరో పసికందు ఆసుపత్రి నుంచి మాయమైంది. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఫరాఖాన్ ఆసుపత్రి నుంచి అయిదు రోజుల శిశువు అదృశ్యమైంది. భోలక్‌పూర్ పద్మశాలి కాలనీలో నివసించే షేక్ సాదిఖ్, రెహానా దంపతులకు ఈ నెల 7న ఆడబిడ్డ పుట్టింది. అయితే తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి, తన చేతుల్లోంచి బలవంతంగా బిడ్డను లాక్కుని వెళ్లిపోయిందని రెహానా చెబుతోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల్లో నమోదు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.