గ్రూపు-2 పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ | no late entry for group-2 exam, says parvathy subramanian | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 10 2016 7:48 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

రాష్ట్రంలో 1,032 పోస్టుల భర్తీకి ఈనెల 11, 13 తేదీల్లో గ్రూపు-2 రాత పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. 7.83 లక్షల మంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా 1,916 కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు పూర్తిచే సినట్లు వెల్లడించారు. ఈనెల 7 వరకు 6.32 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు తలెత్తితే హెల్ప్‌డెస్క్‌లో (040-24655555, 040-24696666, 7288896611) సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను తమ వెబ్‌సైట్ ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement