తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన సుధీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కృష్ణా జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్ 10న అతడు తిరుమల వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దేవుడి దర్శనం కోసం వచ్చినట్టు అప్పట్లో అతడు వెల్లడించాడు. తిరుమలలో అన్యమత ప్రచారం చేసినందుకు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అన్యమతానికి చెందిన ఆరుగురు సాక్షాత్తు శ్రీవారి ఆలయం వద్ద అన్యమత ప్రచారం చేసి, ప్రార్థనలు చేసి, తిరిగి వాటిని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Published Thu, Oct 30 2014 8:26 PM | Last Updated on Thu, Mar 21 2024 8:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement