తమిళనాడు ముఖ్యమంత్రి గా పన్నీర్‌సెల్వం నియమితులయ్యారు. అలాగే పార్టీ నాయకత్వ బాధ్యతలు జయలలిత నెచ్చెలి శశికళకు అప్పగించాలని అన్నాడీఎంకే ఉన్నత స్థారుు సమావేశం సూత్ర ప్రాయంగా నిర్ణరుుంచింది. దీనిపై పార్టీలో కొంతమేరకు అసంతృప్తి వ్యక్తం అరుునప్పటికీ చివరికి ఇదే ఖరారైనట్లు అన్నా డీఎంకే వర్గాలు చెబుతున్నారుు. జయలలిత తదనంతరం ప్రభుత్వ, పార్టీ రథసారధులను ఎంపిక చేసుకోవడానికి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు సోమవారం ఉదయం అపోలో ఆసుపత్రిలో సమావేశమయ్యారు. దీనికి ముందు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు విడిగా శశికళను కలిశారు. ఆ తర్వాత పన్నీర్ సెల్వంతో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు శశికళను కలసి భవిష్యత్ ఏర్పాట్ల గురించి చర్చించారు.
Published Tue, Dec 6 2016 7:40 AM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM
Advertisement
Advertisement
Advertisement