O. Panneerselvam
-
Tamil Nadu: పన్నీరు సెల్వంకు మరో షాక్
అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వంకు మరో షాక్ తగిలింది. ఆధిపత్య పోరులో తనకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని భావించిన ఆయనకు నిరాశే మిగిలింది. ఓపీఎస్‌కు హ్యాండిచ్చే విధంగా ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలలో తాము జోక్యం చేసుకోబోమని, ఇది వారి వ్యక్తిగతం అని అమిత్ షా స్పష్టం చేయడం పన్నీరు శిబిరాన్ని కలవరంలో పడేసింది. సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, న్యాయ పోరాటం, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పళణి స్వామి పూర్తిగా తన గుప్పెట్లోకి తె చ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టి ఢి ల్లీ వెళ్లిన ఆయన అక్కడి పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. అదే సమయంలో కేంద్రం తనకు అనుకూలంగా ఉంటుందని, వారి ద్వారా పళని స్వామికి చెక్ పెట్టవచ్చనున్న ధీమాతో ఆ పార్టీ సమన్వయ కమిటీ పన్నీరు సెల్వం ఉంటూ వస్తున్నారు. చర్చకు ముగింపు.. ఢిల్లీ పర్యటన సందర్భంగా పళని స్వామికి అమిత్ షా హిత బోధ చేసినట్టు పన్నీరు సెల్వంతో పాటుగా మిగిలిన వారిని కలుపుకుని వెళ్లాలని క్లాస్ తీసుకున్నట్లుగా కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై పెద్దఎత్తు చర్చలు సాగడంతో పన్నీరు శిబిరంలో ఆనందడోలికల్లో తేలింది. కేంద్రం ద్వారా మళ్లీ అన్నాడీఎంకేను కై వసం చేసుకోవచ్చనే ధీమాతో తన బలాన్ని చాటే ప్రయత్నాలను పన్నీరు వేగవంతం చేశారు. అలాగే కేంద్రం ద్వారా పళణి స్వామితో రాయబారాలు జరపడం లేదా, కోర్టు తుది తీర్పు వ్యవహారంలో కేంద్రాన్ని ఆశ్రయించడం వంటి ఎత్తుగడలతో పన్నీరు ముందుకెళ్లారు. అయితే ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. పన్నీరు శిబిరానికి పెద్ద షాక్ ఇచ్చే విధంగా , తాజాగా జరుగుతున్న చర్చకు ముగింపు పలికే రీతిలో బెంగళూరులో అమిత్ షా ఓ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. జోక్యం చేసుకోం.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడీఎంకే అంతర్గాత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అది వారి అంతర్గత వ్యవహారం, ఇందులో ఒకరిపై ఒత్తిడి తీసుకు రావాల్సినంత అవసరం తమకు లేదన్నారు. వారి మధ్య సమస్యలు, వివాదాలను వాళ్లే పరిష్కరించుకోవాలే గానీ మధ్యవర్తులు ఉండ కూడదని వ్యాఖ్యానించారు. ఓ పార్టీ వ్యవహారంలో జోక్యం చేసుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. పన్నీరు సెల్వం వ్యవహారంలో అన్నాడీఎంకేనే నిర్ణయం తీసుకోవాలి. తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఆయన చర్చకు ముగింపు పలికారు. ఈ వ్యాఖ్యలు పన్నీరు సెల్వం శిబిరాన్ని షాక్‌కు గురి చేసింది. అదే సమయంలో పళని స్వామి శిబిరంలో జోష్‌ను నింపింది. వందే భారత్‌లో పళణి అమిత్ షా వ్యాఖ్యలు ఉదయాన్నే పళణి శిబిరంలో జోష్‌ను నింపాయి. ఇదే ఊపులో పళణి స్వామి ఆనందంగా వందే భారత్ రైలులో ప్రయాణించారు. సేలం నుంచి ఆయన వందే భారత్ రైలులో పర్యటించారు. ఈ సమయంలో ఆయనతో అనేక మంది ప్రయాణికులు సెల్పీలు దిగడం విశేషం. -
Tamil Nadu: ‘పళని’ దూకుడుకు కళ్లెం..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి దూకుడుకు సుప్రీంకోర్టు శుక్రవారం కళ్లెం వేసింది. ప్రధాన కార్యదర్శి ఎన్నికలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ దసరా సెలవుల అనంతరం కొనసాగించేందుకు నిర్ణయించారు. అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదాలు కోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో తొలుత అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. అలాగే జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా మరో తీర్పు రావడంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పగ్గాలు స్వీకరించారు. ఈ హోదాతో పార్టీపై పట్టు సాధించే పనిలో పడ్డారు. సమావేశాలు, సభలు అంటూ విస్తృతంగా దూకుడు పెంచారు. త్వరలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఇందులో భాగంగా పార్టీ సర్వసభ్య సమావేశం సభ్యులతో ముందుగానే తనకు మద్దతు తెలిపే విధంగా సంతకాలతో కూడిన ప్రమాణ పత్రాలను సేకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూలై 11న జరిగిన సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ వేశారు. నిబంధనలు ఉల్లంఘించారని వాదనలు పన్నీరుసెల్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం వచ్చింది. దసరా సెలవుల అనంతరం ఈ పిటిషన్‌ను విచారించేందుకు తొలుత న్యాయమూర్తి నిర్ణయించినా, పన్నీరు సెల్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు ఉంచారు. అన్నాడీఎంకేలో నిబంధనలకు అనుగుణంగా పన్నీరుసెల్వం నడుచుకున్నా, పళని స్వామి తరపున వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం మొదలెట్టారని వివరించారు. పార్టీ పరంగా సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళని స్వామి సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే, పన్నీరును పార్టీ నుంచి బయటకు పంపించినట్లు ప్రకటించి, వ్యక్తిగతంగా పళని స్వామి నిర్ణయాలు తీసుకుని, పార్టీ నిబంధనలను తుంగలో తొక్కినట్టు వివరించారు. సర్వసభ్య సమావేశాన్ని ఆగమేఘాలపై నిర్వహించారని, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. పళనిస్వామి అన్నాడీఎంకే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీసుకున్న నిర్ణయాలన్ని రద్దు చేయాలని కోరారు. అరగంట పాటుగా వాదనలు సాగాయి. పళని శిబిరానికి షాక్ పళనిస్వామి తరఫు న్యాయవాదులు సైతం కోర్టు ముందు వాదనలు ఉంచినా చివరకు ఈ కేసుతో పాటు అన్నాడీఎంకే వ్యవహారాలకు సంబంధించిన అన్ని కేసులను ఒకే గొడుగు కిందకు తెచ్చి దసరా సెలవుల అనంతరం విచారణ కొనసాగించేందుకు న్యాయమూర్తి నిర్ణయించారు. అదే సమయంలో ప్రధాన కార్యదర్శి పదవికి ఎలాంటి ఎన్నికలు నిర్వహించేందుకు వీలు లేదని పేర్కొంటూ స్టే విధించారు. దసరా సెలవుల అనంతరం విచారణ కొనసాగింపు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో పళని స్వామి శిబిరానికి షాక్ తప్పలేదు. దసరా సెలవుల అనంతరం జరిగే విచారణ, వెలువడే ఉత్తర్వుల మేరకు ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. పళని స్వామి మద్దతు నేత, ఎంపీ సీవీ షన్ముగం కోర్టు ఆవరణలో మీడియా మాట్లాడారు. తాము ప్రధాన కార్యదర్శి ఎన్నికకు ఇంత వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని, అయితే కోర్టుకు పన్నీరు తరఫున తప్పుడు సమాచారం ఇచ్చి స్టే పొందారని పేర్కొన్నారు. చట్టాన్ని తాము గౌరవిస్తామని, ఆ మేరకు వెలువడే ఉత్తర్వుల ఆధారంగా ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులు తనకు అనుకూలంగా రావడంతో ఇదే అదనుగా పార్టీ కేడర్‌ను తన వైపుకు తిప్పుకునే విధంగా దక్షిణ తమిళనాడులో పర్యటనలకు పన్నీరు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవడం గమనార్హం. -
అన్నాడీఎంకే ఆఫీస్‌లోకి వెళ్లేందుకు పన్నీరు ప్రయత్నాలు.. మళ్లీ టెన్షన్
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే కార్యాలయంలోకి అడుగు పెట్టేందుకు పన్నీరు సెల్వం ప్రయత్నాలు చేశారు. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఆయన మద్దతుదారులు చొచ్చుకెళ్లవచ్చన్న సమాచాంతో భద్రతను పెంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మ శశికళతో పన్నీరు మద్దతుదారుడు వైద్యలింగం శుక్రవారం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకేలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి కోర్టు ఆమోద ముద్ర వేయడంతో పళనిస్వామి పార్టీ వ్యవహారాల్లో దూకుడు పెంచారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా గురువారం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో అడుగు పెట్టారు. పార్టీ నేతలతో సమావేశాలు, బలోపేతం, సర్వ సభ్య సమావేశంతో పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శి పదవి చేజిక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెట్టారు. పళనిస్వామికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక బా«ధ్యతలతో తిరుమల శ్రీవారి దర్శనానికి పళనిస్వామి బయలుదేరి వెళ్లారు. అదే సమయంలో తానేమి తక్కువ తిన్నానా..? అన్నట్టు పన్నీరు సెల్వం సైతం పావులు కదుపుతున్నారు. చిన్నమ్మతో భేటీ. అన్నాడీఎంకే వివాదాల నేపథ్యంలో చిన్నమ్మ శశికళ సైతం రాజకీయంగా దూకుడు పెంచారు. శుక్రవారం తంజావూరులో ఆమె పర్యటించారు. ఆమెను పన్నీరు సెల్వం మద్దతుదారుడు, ఎమ్మెల్యే వైద్యలింగం కలిశారు. ఆమెతో భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఇప్పటికే చిన్నమ్మను కలిసేందుకు పన్నీరు సైతం ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఐకమత్యంగా ఉందామని చిన్నమ్మ పిలుపునిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత నెలకొంది. నేను సైతం.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాలో పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టేందుకు పన్నీరు సెల్వం సిద్ధమవుతున్నారు. గతంలో చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో ఈసారి ముందుగానే పోలీసు భద్రత కోరే పనిలో పడ్డారు. తమకు భద్రత కల్పించాలని పన్నీరుసెల్వం మద్దతు నేత జేసీడీ ప్రభాకరన్ చెన్నై పోలీసులకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన విజ్ఞప్తిని పోలీసులు తోసిపుచ్చారు. అన్నాడీఎంకే కార్యాలయం వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా, అక్కడే తేల్చుకోవాలని సూచించారు. పోలీసుల అనుమతి నిరాకరణతో పార్టీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు పన్నీరు మద్దతుదారులు ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. ఆ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పన్నీరు సెల్వం శ్రీవిల్లిపుత్తూరు అండాల్ అమ్మవారిని, వనపేచ్చి అమ్మన్ ఆలయాల్లో పూజలు నిర్వహించడం గమనార్హం. -
మరో కొత్త వివాదం.. అన్నాడీఎంకే ఖజానాపై ‘వారిద్దరి’ కన్ను
ఇన్నాళ్లూ పార్టీపై పట్టుకోసం పోరాడిన ఈపీఎస్, ఓపీఎస్ మధ్య తాజాగా మరో కొత్త వివాదం మొదలైంది. అన్నాడీఎంకే బ్యాంక్ ఖాతాల నిర్వహణ బాధ్యత నాదంటే.. నాదంటూ వారిద్దరూ లేఖల యుద్ధానికి దిగారు. పరిస్థితి ముదిరితే ఖాతాలను స్తంభింపజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలపై తనదే పెత్తనమని ఎడపాడి పళనిస్వామి, కాదు..కాదు కోశాధికారిగా తానే అధికారిక వ్యక్తినని పన్నీర్‌సెల్వం కొత్తగా మరో కుమ్ములాట మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సమస్య సద్దుమణిగే వరకు ఇద్దరికి అవకాశం లేకుండా సీలువేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఖాతాల్లోని రూ.300 కోట్లు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. చదవండి: అవసరమా! ఆ సింహాలు క్రూరంగా, కోపంగా కనిపించాలా? అంతకంతకూ ముదురుతున్న వివాదాలు అంతఃకలహాలతో అన్నాడీఎంకే అట్టుడికి పోతోంది. ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి పళనిస్వామి ఎంపిక, పన్నీర్‌సెల్వం శాశ్వత బహిష్కరణ జరిగిపోయింది. కోశాధికారి పదవి నుంచి ఓపీఎస్‌ను తప్పించినట్లు బ్యాంకు అధికారులకు ఈపీఎస్ ఓ లేఖ పంపారు. అయితే తన అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరిపేందుకు వీలులేదని, హద్దుమీరితో తగిన చర్యలు తప్పవని పన్నీరు సెల్వం మరో లేఖలో హెచ్చరించారు. ఇక కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్‌ను నియమించాం, ఆయన అనుమతి లేకుండా లావాదేవీలు జరుపరాదని కరూరు వైశ్య బ్యాంకు, ఇండియన్ బ్యాంకుకు, చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఈపీఎస్ మంగళవారం మరో లేఖ రాశా రు. ఈరెండు బ్యాంకుల్లో అన్నాడీఎంకేకు సుమారు రూ.300 కోట్లు ఉండటంతో ఈపీఎస్, ఓపీఎస్లు తహతహలాడుతున్నారు. ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక బ్యాంకు అధికారులు తలలుపట్టుకున్నారు. రూ.300 కోట్లు పక్కదారి పట్టకుండా పార్టీ బ్యాంకు ఖాతాలకు తాత్కాలికంగా సీలు వేయడమే మేలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. సీఈసీకి పోటాపోటీ పిటిషన్లు ఈనెల 11న సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలపై ఈపీఎస్, ఓపీఎస్ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) కార్యాలయంలో పోటాపోటీగా పిటిషన్లు వేశారు. ఇటీవలి సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు, ఆమోదయోగ్యం కాని ఆ పిటి షన్లపై స్టే విధించాలని సీఈసీకి సమర్పించిన పిటిషన్లో ఓపీఎస్ పేర్కొన్నారు. బైలా ప్రకారమే పార్టీ వ్యవహారాల్లో సవరణలు చేశామని ఎడపాడి పేర్కొంటూ సీఈసీకి ఆధారాలు సమర్పించారు. మలి అడుగు ఎలా..? ఆశించినట్లుగానే ఎడపాడి పళనిస్వామికి ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. పన్నీర్‌సెల్వంను బహిష్కరించడం కూడా జరిగిపోయింది. అయితే పార్టీపై పూర్తిస్థాయి పట్టుసాధించడం కోసం చేపట్టాల్సిన చర్యలపై చట్ట నిపుణులతో ఈపీఎస్ మంగళవారం సమాలోచనలు జరిపారు. పన్నీర్‌సెల్వం బహిష్కరణకు గురైనందున ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత పదవి వెంటనే చేజారిపోతుందా..? అని కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర అంశాలు ఇక అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద సోమ వారం అరాచకాలకు పాల్పడిన, కార్యాలయంలోకి జొరబడిన 400 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కార్యాలయ ప్రాంగణంలోని ఎంజీ రామ చంద్రన్, జయలలిత విగ్రహాలకు రోజూ పూలమాలలు వేయడం ఎంతోకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అయితే పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేయడంతో వారి విగ్రహాల్లో ఎండిపోయిన రోజాపూల మాలలను చూసి పారీ్టశ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకేలోని రెండువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడంతో ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు. పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేయడంతో ఎడపాడి తన ఇంటిని తాత్కాలిక కార్యాలయంగా మార్చారు. ఆఫీసుకు వేసిన సీలును తొలగించేలా ఆదేశించాలని కోరుతూ ఎడపాడి మద్ద తుదారు తరపున న్యాయవాది విజయ్ నారాయణన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. -
బహిష్కరణ వేటుపై కోర్టుకు ఓపీఎస్!.. ఈపీఎస్ సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకే బహిష్కరణ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. కోటిన్నర క్యాడర్ ఎన్నుకున్న తనను ఎలా తప్పిస్తారని? ఆ అధికారం ఒక్క పళనిస్వామికో, ఇతర నేతలకో అస్సలు లేదని వ్యాఖ్యానించారు. తన బహిష్కరణకు అసంబద్ధంగా పేర్కొన్న ఓపీఎస్.. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదని, బహిష్కరణ నిర్ణయంపై చట్ట ప్రకారం కోర్టుకు వెళ్తానని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఓపీఎస్‌కు షాకిస్తూ పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. దీంతో ప్రెసిడియమ్ చైర్మన్ తమిళ్మహాన్ హ్సుస్సేన్ అధ్యక్షతన వనగారమ్లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనే ఇంటీరియమ్ జనరల్ సెక్రెటరీగా పళనిస్వామిని ఎన్నుకుంటూ.. అలాగే పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటించింది అన్నాడీఎంకే. డీఎంకేతో కుమ్మక్కయ్యాడు అన్నాడీంకే జనరల్ సెక్రెటరీ(ఇంటీరియమ్) హోదాలో ఈ పళనిస్వామి.. పన్నీర్‌సెల్వంపై విమర్శలు ఎక్కుపెట్టాడు. అధికార పక్షం డీఎంకేలో పన్నీర్‌సెల్వం కుమ్మక్కు అయ్యాడంటూ సంచలన ఆరోపణలే చేశారు ఓపీఎస్. ఓపీఎస్ హింసాకాండకు పాల్పడ్డాడు. అన్నాడీఎంకే కార్యాలయం నుంచి పార్టీకి సంబంధించిన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఎన్నిసార్లు అభ్యర్థించినా.. పోలీస్ భద్రత కల్పించలేదు. శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇంత కన్నా నిదర్శనం ఇంకేంటి?. .. పార్టీకి ఒక్కరే నేత ఉండాలని సీనియర్లు చెప్పిన సూచనను సైతం ఓపీఎస్ పెడచెవినపెట్టాడు. నేను మీలో ఒక్కడినే(పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి..). ఈ పార్టీనే నా జీవితం. పార్టీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా.. పని చేశా. ఇద్దరి నాయకత్వంలో పని తీరు ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ ఒక దుష్టశక్తితో పోల్చారు. డీఎంకే ప్రభుత్వం అంటే.. కమీషన్లు, అవినీతికి కేరాఫ్. అలాంటి పార్టీ ప్రభుత్వంపై ఓపీఎస్ కొడుకు ఓపీ రవీంద్రన్ లోక్ సభ సభ్యుడిగా ఉండి మరీ.. ప్రశంసలు గుప్పిస్తున్నాడు. అలాగే ఓపీఎస్ ఒక్కడే పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ నిర్వహించొద్దంటూ వాదించాడు.. కోర్టుకెక్కాడు అంటూ పళని స్వామి విమర్శలు గుప్పించారు. -
నీకు ఎలాంటి అధికారం లేదు: పళనిస్వామి బహిరంగ ప్రకటన
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గపోరు ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. పన్నీర్ సెల్వంపై బహిరంగంగా తొలిసారి వ్యతిరేక కామెంట్లు చేశారు మాజీ సీఎం పళనిస్వామి. ఈ మేరకు పన్నీర్‌సెల్వంకు ఇక మీదట పార్టీ కో-ఆర్డినేటర్ కాదంటూ ఈపీఎస్ ఓ లేఖ రాశారు. ఇకపై ఓ.పన్నీర్‌సెల్వం.. అన్నాడీఎంకే పార్టీ కో-ఆర్డినేటర్ కాదని, ఇద్దరి ఆమోదం తర్వాత ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ భేటీ(జూన్ 23న) రసాభాసకు కారణం పన్నీర్ సెల్వమేనని పళని స్వామి ఆరోపించారు. 2021, డిసెంబర్ 1న పార్టీ రూపొందించిన ప్రత్యేక చట్టాలను పన్నీర్‌సెల్వం ఉల్లంఘించారని, జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా పోలీసులను.. కోర్టును ఆశ్రయించారని, భేటీలో గందరగోళంతో పాటు కీలక తీర్మానాల ఆమోదానికి కొందరు కార్యకర్తల ద్వారా అడ్డుతగిలారని.. కాబట్టి పన్నీర్‌సెల్వం ఇకపై అన్నాడీఎంకే పార్టీ కో ఆర్డినేటర్ కొనసాగే అర్హత లేదని పళనిస్వామి ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. స్థానిక ఎన్నికలకు సంబంధించి.. అభ్యర్థుల పేర్లతో ఓపీఎస్ పంపిన లేఖను సైతం పళనిస్వామి పక్కనపెట్టారు. గడువు ముగిశాక పంపిన పేర్లను పరిశీలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు పళనిస్వామి. ఇదిలా ఉంటే.. పళనిస్వామి పంపిన లేఖలో తనను తాను పార్టీ హెడ్‌క్వార్టర్స్ సెక్రటరీగా పేర్కొనగా.. ఓపీఎస్‌ను కోశాధికారిగా(ట్రెజరర్) ప్రస్తావించారు. కిందటి ఏడాది ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలో పన్నీర్ సెల్వంను కో-ఆర్డినేటర్‌గా, పళనిస్వామిని జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎనుకున్నారు. అయితే పళనిస్వామి పార్టీ అధికారం అంతా ఒకరి చేతుల్లోనే ఉండాలని వాదిస్తుండగా, పన్నీర్‌సెల్వం మాత్రం పాత విధానం కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాడు. -
అర్ధరాత్రి హైడ్రామా.. పన్నీర్ సెల్వంకు భారీ ఊరట
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరు పంచాయితీ మరోసారి న్యాయస్థానాన్ని చేరింది. అయితేసారి జరిగిన అర్ధరాత్రి హైడ్రామాలో పళనిస్వామికి ఝలక్ తగిలింది. అధికారం ఒక్కరి చేతుల్లోనే ఉండాలన్న తీర్మానంపై చర్చ మాత్రమే జరగొచ్చని అయితే.. ఆ తీర్మానంపై ఆమోదించడం లాంటి నిర్ణయం తీసుకోకూడదని డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో పన్నీర్‌సెల్వం వర్గానికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. జూన్ 23న(ఇవాళ) అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీ వెంకటాచలపతి ప్యాలెస్‌లో నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో.. సమావేశంలోనే అధికారం ఒక్కరి చేతిలోనే ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS) తీర్మానం చేయాలనుకున్నాడు. అయితే.. మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం ఆ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరపకుండా నిలువరించాలని పోలీసులకు ఫిర్యాదుతో పాటు కోర్టుకు చేరింది ఈ వర్గపోరు పంచాయితీ. అయితే.. మద్రాస్ హైకోర్టు భేటీని, తీర్మానాలు చేయకుండా ఆపేలా పార్టీని ఆదేశించలేమని, అది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది పన్నీర్ సెల్వం వర్గం. జనరల్ కౌన్సిల్ సభ్యుడు షణ్ముగం అభ్యర్థనతో అర్ధరాత్రిపూట మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తి ఎం దురై స్వామి ఇంట్లో వాదనలు నడిచాయి. ఈ విచారణకు జస్టిస్ సుందర్ మోహన్ సైతం హాజరయ్యారు. వాదనల అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ.. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై మాత్రం అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇతర వ్యవహారాలపై చర్చ మాత్రమే జరగాలని పేర్కొంది. దీంతో ఇవాళ భేటీ జరుగుతుండగా.. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలన్న పళనిస్వామి తీర్మానానికి ఆమోదం లభించడం కుదరదనే చెప్పాలి. Chennai, Tamil Nadu | AIADMK workers, leaders gather at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram for party's General Council meeting to be held today. pic.twitter.com/9lnaL8OJvD — ANI (@ANI) June 23, 2022 చదవండి: ‘డమ్మీ రాష్ట్రపతి’గా ద్రౌపది ముర్ము.. తీవ్ర ఆరోపణలు -
శేఖర్‌రెడ్డి డైరీలో పన్నీర్‌సెల్వం పేరు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇసుక కాంట్రాక్టర్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి చెందిన డైరీలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా పలువురు మంత్రుల పేర్లు ఉన్న సంగతి శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గతేడాది నవంబర్‌లో తమిళనాడులో శేఖర్‌రెడ్డి, అతని భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీశాఖ చేసిన దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం, స్థిర, చరాస్తుల పత్రాలు బయటపడ్డాయి. వీటితో పాటు ఓ డైరీని కూడా అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అన్నాడీఎంకే ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులతో శేఖర్‌రెడ్డికి అంతర్గత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆనాటి వివరాలను నిర్ధారిస్తున్నట్లుగా పలు అంశాలను ఒక ప్రైవేటు ఆంగ్ల టీవీ చానల్ శుక్రవారం ప్రసారం చేసింది. డైరీలోని కొన్ని పేజీలు తమచేతికి వచ్చాయని చెప్పింది. వారు తెలిపిన వివరాల ప్రకారం ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు విజయభాస్కర్, ఎంసీ.సంపత్, తంగమణి, ఆర్పీ ఉదయకుమార్, దిండుగల్లు శ్రీనివాసన్, ఎంఆర్ విజయభాస్కర్, కేసీ కరుప్పన్నన్‌ల పేర్లు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు శేఖర్‌రెడ్డి డైరీ ద్వారా వెలుగుచూసిన వివరాలపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. -
మనసులు మాత్రం!
సాక్షి, చెన్నై : ‘విలీన ప్రక్రియ జరిగి కాలం గడుస్తున్నా.. మనసులు మాత్రం..!’ అంటూ పన్నీరు మద్దతు ఎంపీ మైత్రేయన్ వ్యాఖ్యలు అన్నాడీఎంకే సర్కారులో మంగళవారం హాట్ టాపిక్‌గా మారింది. పన్నీరు మదిలో మాట ఇదేనా..! తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మైత్రేయన్ అసంతృప్తి గళాన్ని వినిపించే పనిలో పడ్డారా..? అన్న చర్చ ఊపందుకుంది. చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా తిరుగు బావుటా ఎగురవేసిన మాజీ సీఎం పన్నీరు సెల్వం తనబలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించి చతికిలపడ్డారు. ఎట్టకేలకు చిన్నమ్మ జైలుకు వెళ్లడం, సీఎం పళనిస్వామి బలం పెరగడం వెరసి విలీన బాటసాగింది. పళని, పన్నీరులు ఏకం అయ్యారు. సీఎంగా పళని, డిప్యూటీ సీఎంగా పన్నీరుల పయనం ప్రస్తుతం సాగుతోంది. అయితే, పన్నీరు శిబిరం మాత్రం అసంతృప్తితోనే ఉందని చెప్పవచ్చు. ఆయన మద్దతు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు పార్టీ పరంగా గానీ, ప్రభుత్వ పరంగా గానీ న్యాయం జరిగి ఉంటే ఒట్టు. అదే సమయంలో పన్నీరు అధికారాల్ని పీకి, కేవలం పదవిని మాత్రం కట్టబెట్టి ఉన్నారన్న ఆరోపణలున్నాయి. సీఎం పళనిస్వామి బలం మాత్రం రోజురోజుకు ఢిల్లీ స్థాయిలో పెరుగుతున్నా, పన్నీరు మాత్రం పతనం అవుతున్నారన్న ఆందోళన మద్దతు దారుల్లో ఉందని చెప్పవచ్చు. నమ్మి వచ్చిన వారికి న్యాయం చేయలేని పరిస్థితిలో డిప్యూటీ అన్న పదవిని అలంకార ప్రాయంగా పన్నీరు కల్గి ఉండడం ఆయన మద్దతుదారుల్లో అసంతృప్తిని రగుల్చుతోంది. ఇప్పటికే కొన్నిచోట్ల ఆయన మద్దతుదారులు సీఎం కార్యక్రమాన్ని బహిష్కరించే పనిలో పడ్డారు. మైత్రేయన్ ట్వీట్‌పై చర్చ సీఎం, డిప్యూటీలు ఒకే వేదిక మీద కనిపిస్తున్నా, మద్దతుదారులు మాత్రం వేర్వేరుగా పయనం సాగిస్తుండడంతో ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనన్న చర్చ సాగుతోంది. ఈనేపథ్యంలో పన్నీరుకు అత్యంత సన్నిహితుడిగా, శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు సాగిన క్రమంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ మైత్రేయన్ మంగళవారం చేసిన ట్విట్ చర్చకు దారితీసింది. ఇరు శిబిరాలు విలీనమై మూడు నెలలు ముగిసి, నాలుగో నేల మంగళవారంతో అడుగు పెట్టినట్టు గుర్తుచేశారు. ‘విలీన ప్రక్రియ జరిగి కాలం గడుస్తున్నా.. అంటూ, మనస్సులు..? మాత్రం..!’ అన్న ప్రశ్నార్థకం, ఆశ్చర్యకర అర్థాలతో చర్చకు తెరలేపడం గమనార్హం. పన్నీరు మదిలో మాటను ఆయన బయట పెట్టారా..? లేదా, సాగుతున్న పరిణామాల నేపథ్యంలో అసంతృప్తిని వెల్లగక్కే విధంగా స్పందించారా..? అన్నచర్చ బయలు దేరింది. అసలే దినకరన్ రూపంలో అన్నాడీఎంకేలో పరిస్థితులు గందరగోళంగా సాగుతుంటే, మైత్రేయన్ వ్యాఖ్యలు కేడర్‌ను మరింత విస్మయంలోకి నెట్టాయి. అదే సమయంలో అమ్మ జయలలితకు వెన్నంటి నీడలా ఉన్న జయ టీవీ మీద ఐటీ దాడుల్ని కేడర్ మరవక ముందే, తాజాగా, ఆ చానల్లో డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్‌తో ప్రత్యేక ఇంటర్వూ్య సాగడాన్ని అన్నాడీఎంకే కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. -
కల్యాణ వైభోగమే!
జీవితంలో వివాహం మధుర ఘట్టం. అటువంటి వివాహ బంధపు దివ్యానుభూతిని దివ్యాంగులకు కల్పిస్తూ చెన్నై, గీతాభవన్ ట్రస్ట్ నిరుపమాన సేవలందిస్తోంది. ఏటా కొంతమంది దివ్యాంగులను, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఎంపిక చేసి సామూహిక వివాహాలు జరిపిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. గత ఏడేళ్లలో 349 వివాహాలను జరిపించింది. టీ.నగర్: గీతాభవన్ హాల్లో సోమవారం సామూహిక వివాహాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి వి.సరోజ, రాష్ట్ర తమిళ భాషాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రి కె.పాండ్యరాజన్, దివ్యాంగుల సంక్షేమశాఖ, రాష్ట్ర కమిషనర్ వి.అరుణ్‌రాయ్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి నూతన దంపతులకు ఆశీస్సులందించారు. ఇందులో మాజీ రాష్ట్రపతి మనవరాలు పద్మా వెంకటరామన్, లతా పాండ్యరాజన్, సింహచంద్రన్ పాల్గొన్నారు. ఇందులో ఓ.పన్నీర్ సెల్వంను అశోక్‌కుమార్ గోయెల్ శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మంత్రి వి.సరోజ వధూవరులను ఉద్ధేశించి ప్రసంగించారు. ఏడేళ్లలో 349 వివాహాలు: మేనేజింగ్ ట్రస్టీ అశోక్‌కుమార్ గోయల్ తన స్వాగతోపన్యాసంలో ఎనిమిదేళ్ల క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ పేద ప్రజలకు వివాహాలు జరిపించాల్సిందిగా కోరిందని, దీంతో 2010లో 34 వివాహాలు జరిపించామన్నారు. అందులో ఐదుగురు వధూవరులు దివ్యాంగులని అన్నారు. అప్పట్లో దివ్యాంగుల ముఖాల్లో సంతోషాన్ని చూసిన తాము దివ్యానుభూతికి గురయ్యామన్నారు. అనంతరం తాము ఇతర నిర్వాహకులతో చర్చించి ఏటా ఈ తరహా వివాహాలు జరిపేందుకు నిర్ణయించామన్నారు. ఇందుకు తమిళనాడు దివ్యాంగుల సంక్షేమ శాఖ పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గత ఏడేళ్లలో 349 వివాహాలు జరిపించామని, ప్రస్తుతం 61జంటలకు వివాహాలు జరుపుతున్నట్టు తెలిపారు. మంత్రుల సమక్షంలో వేదపండితులు అశ్వనీశాస్త్రి మంత్రోచ్ఛరణల మధ్య హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహంతో జంటలు ఏకమయ్యాయి. నూతన దంపతులు గీతాభవన్ ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వివాహ జంటలతో డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వివాహ సామగ్రి ఉచితం: వివాహం చేసుకోదలచిన జంటలకు బంగారు మంగళసూత్రం, వెండి కాలిమెట్టెలు, ఫ్యాన్సీ జ్యువెలరీ, ముహూర్త వస్త్రాలు, పూజ, వంట పాత్రలు, గృహోపకరణాలు, రెండు నెలలపాటు కిరాణా వస్తువులు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ముందుగా గాయత్రీ శంకరన్ ప్రార్థనా గీతాన్ని శ్రావ్యంగా ఆలపించారు. -
GK వాసన్‌తో పన్నీరు సెల్వం భేటీ
-
70 రోజుల్లో తమిళనాడుకు ముగ్గురు సీఎంలు!
చెన్నై : తమిళనాడు రాజకీయాలపై ఓ వైపు ఎంతో ఉత్కంఠగా సాగుతున్న సమయంలో సోషల్ మీడియాలో ఓ జోక్ విపరీతంగా సర్క్యూలేట్ అయింది. తమిళనాడు సీఎం పేరుపై విద్యార్థులకు అడిగే ప్రశ్నాపత్రంలో క్వార్టర్లీ, ఆఫ్ ఇయర్లి, యాన్యువల్ ఎగ్జామ్స్ లో విద్యార్థులు ఒక్కో పేరును రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఆ జోక్. క్వార్టర్లీ, ఆఫ్ ఇయర్లి, యాన్యువల్ ఏమో గాని, 70 రోజుల్లోనే తమిళనాడుకు ముగ్గురు సీఎంలు మారారు. అమ్మ మరణించేంత వరకు అంటే 2016 డిసెంబర్ 11 వరకు జయలలితనే సీఎం కాగా, ఆ రోజు అర్థరాత్రినే పన్నీర్ సెల్వం తమిళనాడు కొత్త సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ చేసిన ఎత్తులో పన్నీర్ సెల్వం 2017 ఫిబ్రవరి 5న రాజీనామా చేశారు. కానీ వెంటనే శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు ఉద్యమం లేవనెత్తే సరికి, తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కానీ ఎప్పుడో 20 ఏళ్ల కిందటి ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా సుప్రీంకోర్టు తేల్చడంతో ఇక తమిళపీఠం పన్నీర్‌కే అనుకున్నారు. పన్నీర్‌పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన శశికళ వర్గం, ఓ కొత్త అభ్యర్థిని అధికారపార్టీలో రాష్ట్ర రహదారులు, ఓడరేవుల శాఖమంత్రిగా ఉన్న పళనిస్వామిని రంగంలోకి దింపింది. శాసనసభా పక్ష నేతగా కూడా ఆయనే ఎన్నుకుంది. మెజార్జీ సభ్యులు తమకే ఉన్నట్టు శశికళ వర్గం పేర్కొంది. తనకు 124 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఉందని గవర్నర్‌కు పళనిస్వామి ఓ లేఖ అందించడంతో, ఇక ఆయనకే ప్రభుత్వం ఏర్పాటుచేసుకునేందుకు విద్యాసాగర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తమిళనాడుకు కొత్త సీఎంగా పళనిస్వామి నేటి సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పళనిస్వామిని 15 రోజుల్లో మెజార్టి నిరూపించుకునేందుకు గవర్నర్ అవకాశమిచ్చారు. ఒకవేళ 15 రోజుల్లో జరిగే బలనిరూపణలో పళనిస్వామి తన మెజార్టి నిరూపించుకోలేకపోతే, మళ్లీ తమిళనాడుకు సీఎం మారే అవకాశాలుంటాయి. ప్రస్తుతమైతే, రెండు నెలల వ్యవధిలో తమిళనాడుకు మూడో సీఎంగా పళనిస్వామి ప్రమాణం చేయబోతున్నారు. -
గవర్నర్‌పై యుద్ధానికి సిద్ధమైన శశికళ
-
ఇక పోరాటమే!
గవర్నర్ తీరుపై యుద్ధానికి సిద్ధమైన శశికళ - పార్టీని చీల్చడానికే గవర్నర్ జాప్యం చేస్తున్నారని ఆరోపణ - గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ఘాటైన లేఖ - రాష్ట్రపతి ఎదుట పరేడ్ లేదా అమ్మ సమాధి వద్ద ఆమరణ దీక్ష! - రాజ్‌భవన్‌కు భద్రత పటిష్టం చేసిన పోలీసు బలగాలు - గవర్నర్‌తో సుబ్రమణ్యస్వామి ఆకస్మిక భేటీ - రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల అప్రమత్తం - చెన్నైలో అడుగడుగునా పోలీసుల తనిఖీలు - ఎమ్మెల్యేలతో శశికళ సమావేశం... 30 మంది ఎమ్మెల్యేలు ఏపీకి తరలింపు - శిబిరం నుంచి ఐదుగురు మంత్రుల జంప్ - ప్రధాని డైరెక్షన్‌తో రాజ్‌భవన్ లీకులిచ్చిందని ఆగ్రహం - పార్టీని చీల్చడానికే గవర్నర్ జాప్యం చేస్తున్నారని ఆరోపణ చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి తమిళనాడులో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఢిల్లీ వేదికగా బలం నిరూపించుకునేందుకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. తమిళనాడు గవర్నర్ వ్యూహాత్మకంగా జాప్యం చేస్తున్నారన్న విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు హెచ్చరికతో కూడిన లేఖ పంపి, ఎమ్మెల్యేలతో రావడానికి సమయం ఇవ్వాలని కోరారు. సమయం ఇవ్వకపోతే తానే రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకేను చీల్చడానికే గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు. శశికళ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం వారందరినీ వెంట బెట్టుకుని రాజ్‌భవన్‌కు వస్తారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. రాజ్‌భవన్‌తో పాటు ఆ చుట్టుపక్కల భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింప చేసింది. ఈ వరుస పరిణామాలతో శశికళ ప్రత్యక్ష పోరాటానికే సిద్ధమయ్యారని స్పష్టంకావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చెన్నై నగరంలో అదనపు పోలీసు బలగాలను మోహరించి అణువణువు తనిఖీలు ప్రారంభించారు. శశికళకు మద్దతు ఇస్తున్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆకస్మికంగా గవర్నర్‌తో భేటీ అయ్యారు. శశికళ మీద ఉన్న అక్రమాస్తుల కేసు విషయం, రాజ్యాంగం ప్రకారం ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిన అంశాల గురించి ఆయన గవర్నర్‌తో చర్చించినట్లు లీకులు వచ్చాయి. ఈ వివాదంలో స్వతంత్రంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని, ప్రజాస్యామ్యాన్ని కాపాడాలని సలహా ఇచ్చారని తెలిసింది. ఆయన మెయిన్‌గేట్ నుంచి రాజ్‌భవన్‌లోకి వెళ్లి భేటీ అనంతరం వెనుక గేటు నుంచి వెళ్లిపోయారు. రాజ్‌భవన్ నుంచే లీకులు అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళకు శిక్ష విధిస్తే ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హురాలవుతారని, దీనివల్ల మళ్లీ సంక్షోభం ఏర్పడుతుందనే ఆలోచనతో గవర్నర్ ఆమెను సీఎం చేయడాని ఇష్టపడడంలేదని శుక్రవారం టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయమే శనివారం అనేక పత్రికల్లో కథనాలుగా ప్రచురితమైంది. కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని రాజ్‌భవన్ ద్వారా లీక్ చేయించి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు తన నుంచి వెళ్లిపోయేలా కుట్ర చేసిందని శశికళ బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. తన శిబిరంలో నుంచి ఒక్కొక్కరుగా వెళుతుండడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆలస్యం అయ్యే కొద్దీ బలాబలాల్లో మార్పులు వస్తాయనే ఆందోళనతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం మీదే దృష్టి పెట్టారు. శనివారం మధ్యాహ్నం నేరుగా ఎమ్మెల్యేల శిబిరానికి వెళ్లి మూడు గంటలపాటు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మనమంతా సమిష్టిగా ఉంటే మరో రెండు, మూడు రోజులకైనా తనను సీఎం చేయక తప్పదని వారికి ధైర్యం నూరిపోసినట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రంలోగా గవర్నర్ నుంచి పిలుపురాకపోతే సోమవారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ఎదుట ఎమ్మెల్యేల పరేడ్ నిర్వహించాలనీ, ఢిల్లీ వేదికగానే ఆందోళనకు దిగేలా ఏర్పాట్లు చేయాలని శశికళ నిర్ణయించుకున్నారు. తనకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న ఎంపీలను ఈ ఏర్పాట్ల కోసం పురమాయించారు. అయితే ఢిల్లీలో కాకుండా మెరీనాబీచ్ జయలలిత సమాధి వద్ద ఆమరణదీక్షకు దిగాలని కొందరు ఎమ్మెల్యేలు ఆమెకు సూచించారు. ఐదుగురు మంత్రుల జంప్! శిబిరంలో ఎమ్మెల్యేలతో శశికళ సమావేశం ముగియగానే అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే జారుకున్నట్టు తేలింది. అలాగే, శిబిరం వద్ద ఉండాల్సిన మరో ముగ్గురు మంత్రుల జాడ కానరాలేదు. ఇందులో అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్, పాడి, డెయిరీ శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ, విద్యుత్‌శాఖ మంత్రి తంగమణి, పురపాలక శాఖ మంత్రి ఎపీ వేలుమణి, గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి బెంజిమిన్, మాజీ మంత్రి, కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. వీరంతా ఆదివారం పన్నీరు శిబిరంలో ప్రత్యక్షమవుతారేమో అన్న ఆందోళన శశికళ శిబిరంలో నెలకొంది. పన్నీర్‌సెల్వం దూకుడు పెంచడంతో శశికళ తన శిబిరంలోని సుమారు 30 మంది ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
పన్నీర్ 95.. శశికళ 5!
చెన్నై: తమిళనాడు రాజకీయాలపై రాష్ట్ర ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ లో సీఎంగా పన్నీర్ సెల్వం కొనసాగాలా.. మార్పు జరగాలా అని పోల్ సర్వే నిర్వహించారు. పన్నీర్ సెల్వానికే పట్టం కట్టాలని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడుకు నాయకత్వం వహించడానికి పన్నీర్ సెల్వం కొనసాగాలని 'సీఎంవో తమిళనాడు' వేదికగా జరిగిన ట్విట్టర్ ఖాతాలో 95 శాతం నెటిజన్లు తమ మద్ధతు తెలుపుతూ ఓటేశారు. కేవలం 5శాతం మంది మాత్రమే పన్నీర్ కు వ్యతిరేకంగా పోల్ సర్వేలో ఓటేశారు. అంటే ఐదు శాతం మంది మాత్రమే శశికళ సీఎం కావాలని కోరుకుంటున్నారు. మొత్తంగా 52,876 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించి ఈ సర్వేలో పొల్గొన్నారు. . అనూహ్య మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాలు చివరికి గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావును చేరాయి. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం, రాత్రి ఏడున్నర సమయంలో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ వీకే శశికళ గవర్నర్ ను కలిసిన విషయం తెలిసిందే. బల నిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని పన్నీర్ కోరగా.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్ధతు తనకే ఉందని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని శశికోళ కోరారు. అయితే విద్యాసాగర్ రావు మాత్రం తన నిర్ణయాన్ని వెల్లడించకుండా, కేంద్రానికి నివేదిక పంపారు. పన్నీర్ సెల్వంతో పాటు శశికళ కూడా తానే సీఎం అవుతామని ధీమాగా ఉండటం గమనార్హం. People's survey. Should hon CM continue the post to lead TamilNadu? — திரு O. Pannerselvam (@CMOTamilNadu) 7 February 2017 -
మోదీజీ సహాయం చేయండి: పన్నీర్ సెల్వం లేఖ
చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం లేఖ రాశారు. శ్రీలంకలో బంధీలుగా ఉన్న తమిళనాడు మత్స్యకారులను విడిపించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తమిళనాడు తీర ప్రాంతం లంకకు దగ్గరగా ఉండటంతో తమ జలాల పరిధిలోకి వచ్చారని ఆరోపిస్తూ చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను లంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకుని వారి పడవలను సీజ్ చేస్తున్నట్లు సీఎం పన్నీర్ సెల్వం ప్రధానికి విన్నవించారు. మరోవైపు వార్దా తుపాను ఉత్తర తమిళనాడు తీరంలో చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాలయాలన్నింటికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మూడు జిల్లాల్లో ప్రైవేట్ ఆఫీసులకు సెలవు ప్రకటించాలని పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం తీరం దాటే అవకాశం ఉండటంతో ఉత్తర తమిళనాడు జిల్లాల్లోని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. -
తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం
-
సీఎంగా పన్నీర్ సెల్వం
సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రమాణ స్వీకారం.. శశికళకు పార్టీ నాయకత్వ బాధ్యతలు చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళనాడు ముఖ్యమంత్రి గా పన్నీర్‌సెల్వం నియమితులయ్యారు. అలాగే పార్టీ నాయకత్వ బాధ్యతలు జయలలిత నెచ్చెలి శశికళకు అప్పగించాలని అన్నాడీఎంకే ఉన్నత స్థారుు సమావేశం సూత్ర ప్రాయంగా నిర్ణరుుంచింది. దీనిపై పార్టీలో కొంతమేరకు అసంతృప్తి వ్యక్తం అరుునప్పటికీ చివరికి ఇదే ఖరారైనట్లు అన్నా డీఎంకే వర్గాలు చెబుతున్నారుు. జయలలిత తదనంతరం ప్రభుత్వ, పార్టీ రథసారధులను ఎంపిక చేసుకోవడానికి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు సోమవారం ఉదయం అపోలో ఆసుపత్రిలో సమావేశమయ్యారు. దీనికి ముందు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు విడిగా శశికళను కలిశారు. ఆ తర్వాత పన్నీర్ సెల్వంతో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు శశికళను కలసి భవిష్యత్ ఏర్పాట్ల గురించి చర్చించారు. రాత్రి 7 గంటలకు అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయంలో ప్రిసైడింగ్ చైర్మన్ మధుసూధన్ అధ్యక్షతన లెజిస్లేచర్ పార్టీ సమావేశమైంది. పన్నీర్‌ను సీఎం చేయడానికి అనుకూలంగా మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన విషయం ఇక్కడ చర్చకు వచ్చింది. శశికళ కూడా పన్నీర్ వైపే ఉన్నారని ఆమె మద్దతుదారులైన శాసనసభ్యులు వెల్లడించారు. పన్నీర్‌ను సీఎం చేసి శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే విషయమై చర్చ జరిగింది. ప్రతిసారి పన్నీర్‌కే అవకాశం ఎందుకు ఇవ్వాలని మంత్రి ఎడపాడి పళనిస్వామి, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీతో పాటు మరికొందరు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని తెలిసింది. శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రతిపాదనను సైతం సుమారు 45 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని, పార్టీని బతికించుకోవాలంటే ఇంతకు మించి మార్గం లేదని మరికొందరు తమ అభిప్రాయం వెల్లడించారు. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఇవ్వరాదనే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. కాగా పన్నీర్ సెల్వం 2001లో ఆపద్ధర్మ సీఎంగా, 2015లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు, 2016 సెప్టెంబర్ 22 నుంచి ఆపద్ధర్మ సీఎంగా పని చేశారు. -
ప్రత్యేక అధికారులు!
సాక్షి, చెన్నై : స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం నేతృత్వంలో సాగిన ఈ భేటీలో ఇందుకు తగ్గ ప్రత్యేక చర్చ సాగింది. అలాగే, కావేరి చర్చ, స్థల రిజిస్ట్రేషన్లు, ఈశాన్య రుతు పవనాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తగ్గట్టుగా ముందు జాగ్రత్తలకు సిద్ధం అవుతూ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీ తదుపరి మంత్రులందరూ తమ తమ శాఖల సమీక్షల్లో బిజీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జె.జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృష్ట్యా, ఆమె పరిధిలో ఉన్న శాఖలన్నీ ఆర్థిక మంత్రి ఓ.పన్నీరు సెల్వం గుప్పెట్లోకి చేరిన విషయం తెలిసిందే. ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు ఇందుకు తగ్గ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు సమస్యలు, డిమాండ్లు చుట్టుముట్టి ఉండడంతో వాటిని ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రం సిద్ధం చేసుకొనేందుకు పన్నీరు నిర్ణయించారు. ఇందు కోసం కేబినెట్ భేటీకి పిలుపు నిచ్చారు. బుధవారం సచివాలయంలో పన్నీరు సెల్వం నేతృత్వంలో ప్రప్రథమంగా భేటీ సాగింది. ఇందులో మంత్రులందరూ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, సలహాదారు షీలా బాలకృష్ణన్‌లు కూడా హాజరయ్యారు. ప్రధానంగా స్థానిక ఎన్నికల రద్దు అంశంపై ప్రత్యేక చర్చ సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎన్నికల రద్దు స్టే ఎత్తివేతకు కోర్టు నిరాకరించడం, అందుకు తగ్గ పిటిషన్ నాలుగు వారాలకు వాయిదా పడి ఉన్నందున, ఆయా సంస్థలకు ప్రత్యేక అధికారుల నియామకం అనివార్యమైంది. ప్రస్తుత స్థానిక ప్రతినిధుల పదవీ కాలం ఈనెల 24తో ముగియనుంది. దీనికి సంబంధించి సాగిన చర్చలో ప్రత్యేక అధికారుల నియామకాలకు తగ్గట్టు అత్యవసర చట్టం తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ఇక, రాష్ట్రంలో రగులుతున్న కావేరి రచ్చను చల్లార్చేందుకు తగ్గట్టుగా, కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా ప్రత్యేక కార్యచరణకు నిర్ణయించినట్టు సమాచారం. కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీకి పట్టుబడుతూ ప్రతి పక్షాలన్నీ ఉద్యమిస్తున్న సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణాల దృష్ట్యా కీలక నిర్ణయంతో కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు తగ్గ వ్యూహ రచన ఈ భేటిలో సాగింది. అలాగే, ఇంటి స్థలాల విక్రయం కోర్టు ఉత్తర్వుల మేరకు ఆగడంతో అందుకు తగ్గ ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషనకు నిర్ణయించి ఉన్నారు. అలాగే, కోర్టు ముందు ఉంచాల్సిన వాదన గురించి సమీక్షించినట్టు తెలిసింది. ఇక, మరి కొద్ది రోజుల్లో ఈశాన్య రుతు పవనాల ప్రవేశంతో వర్షాలు ఆశాజనకంగా ఉండబోతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలపై సమాలోచించారు. పాలనా పరమైన వ్యవహారాలపై వేగం పెంచేందుకు తగ్గ నిర్ణయాలు తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. గంట పాటుగా సాగిన ఈ భేటీ అనంతరం మంత్రులు తమ ఛాంబర్లకు పరుగులు తీశారు. తమ శాఖల పరిధిలో అధికారులతో సమాలోచనల్లో బిజీ కావడం ఆలోచించ దగిన విషయం. అయితే ఇప్పటివరకు సీఎం జయలలిత కేబినెట్ సమావేశం నిర్వహించిన పక్షంలో, ఆ వివరాలను సమాచార శాఖ ప్రకటన రూపంలో విడుదల చేసేది. అయితే, కేబినెట్ వివరాలన్నీ గోప్యంగా ఉంచడం గమనార్హం. రాష్ర్ట ఇన్చార్జ్ గవర్నర్ విద్యా సాగర్ రావుతో చర్చించినానంతరం కాబోలు, బుధవారం సాయంత్రం స్థానిక సంస్థలపై తీసుకున్న నిర్ణయానికి తగ్గ ఉత్తర్వుల్ని ప్రకటించారు. ఈ మేరకు స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమించారు. స్థానిక సంస్థల పర్యవేక్షణ ఆయా మండలాల వారిగా ప్రత్యేక అధికారుల ద్వారా సాగనుం ది. ఇలా ఉండగా, మంత్రి వర్గంలో చర్చకు ముందే, ప్రత్యేక అధికారుల ని యామకానికి ప్రత్యేక చట్టం, ఉత్తర్వులు సిద్ధమైనట్టు సమాచారం. తాజా గా ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఈ విషయం తేటతెల్లం అవుతోండడం గమనార్హం.