పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఇటీవల కాలంలో మీడియాలో అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మీడియా వార్తలకు బలం చేకూరేలా పవన్ ఈ గతవారం ఓ ప్రకటన చేయడంతో మరింత జోష్ పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నారంటూ, లోకసత్తా పార్టీ తరపున మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. పవన్ లో రాజకీయ ఆసక్తి ఉందని గ్రహించిన లోకసత్తా పార్టీ ప్రకటన రూపంలో ఆహ్వానాన్ని కూడా పంపింది. అయితే పవన్ కళ్యాణ్ మౌనం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అయితే మార్చి రెండవ వారంలో తన మనసులోని మాటను బయటపెడుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టు మీడియాలో కథనాలు జోరందుకున్నాయి. పవన్ కళ్యాణ్ పెట్టే పార్టీ పేరు పవన్ రిపబ్లికన్ పార్టీ (పీఆర్పీ), యువరాజ్యం పేర్లను పరిశీలనలోకి వచ్చినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చిరంజీవి స్తాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కాంగ్రెస్ వాళ్ల పంచలు ఊడగొట్టాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలన రేపాయి. ఆతర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంపై పవన్ కళ్యాణ్ గుర్రుగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
Published Tue, Mar 4 2014 4:43 PM | Last Updated on Fri, Mar 22 2024 10:39 AM
Advertisement
Advertisement
Advertisement