గజ్వేల్ మండలం కోమటిబండలో మోడీ సభకు సర్వం సిద్ధమైంది. జాతీయ స్థాయిలో చర్చనీయంశమయ్యేవిధంగా భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత... ప్రధాని తొలి పర్యటన కావడం ఈ సభకు మరో విశేషం. 1998లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ప్రారంభించిన మంచినీటి పథకాన్ని అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ‘మిషన్ భగీరథ’గా పరిచయం చేస్తున్న ప్రతిష్టాత్మక మంచినీటి పథకానికి ఈ సభ వేదికవుతోంది.