komatibanda
-
కోమటిబండ అటవీ ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
-
కోమటిబండలో సీఎం కేసీఆర్ పర్యటన
సాక్షి, సిద్దిపేట: వర్గల్ మండలంలోని సింగాయపల్లి అటవీ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సింగారాయపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ ఫలితాలను జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీభూములు ఎడారిలా ఉండేదన్నారు. అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయగా పునరుద్ధరణ ఫలితాలు ఇపుడు కనిపిస్తున్నాయని సీఎం తెలిపారు. ఇపుడు ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నదని, వర్షపాతం కూడా పెరిగిందన్నారు. జ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని..రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం అమలుపైన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన కలెక్టర్లతో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు. అవినీతికి ఆస్కారం లేని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నదని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. పచ్చదనంతో కళకళలాడాలి.. అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం ముఖ్యమంత్రి కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో రెండు గంటలపాటు మిషన్ భగీరథపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం అమలు పైన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన కలెక్టర్లతో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు. అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని వివరించారు. హరితహారం, మిషన్ భగీరథ పథకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. -
సిద్ధమైన ‘మిషన్ భగీరథ’ నాలెడ్జి సెంటర్
సాక్షి, గజ్వేల్: ‘మిషన్ భగీరథ’ పథకానికి కేంద్ర బిందువుగా ఉన్న గజ్వేల్ ఇక నాలెడ్జి సెంటర్‌గా మారబోతోంది. 2016 ఆగస్టు 7న ప్రధాని చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగిన గజ్వేల్ మండలంలోని కోమటిబండ హెడ్‌రెగ్యులేటరీ వద్ద నాలెడ్జ్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ కేంద్రాన్ని సందర్శిస్తే చాలూ తెలంగాణ వ్యాప్తంగా గోదావరి, కృష్జా నదీ జలాలను శుద్ధి చేసి, గ్రావిటీ విధానంలో 26 సెగ్మెంట్ల పరిధిలోని అమలవుతున్న పథకం తీరు కళ్లకు కట్టినట్లు తెలిసే అవకాశమున్నది. ఇందుకు ఇక్కడ ఫోటో గ్యాలరీలు, ప్రొజెక్టర్ తదితర పరికరాలను ఏర్పాటు చేయబోతున్నారు. రూ.50లక్షల నిధులతో ఇప్పటికే నాలెడ్జి సెంటర్ భవన నిర్మాణం పనులు పూర్తి కావస్తున్నాయి. ఇప్పటికే నిత్యం సందర్శకుల తాకిడితో సందడిగా మారిన హెడ్ రెగ్యులేటరీ ప్రాంతం ఇక మరింత ప్రాచూర్యంలోకి రానుంది. త్వరలోనే ఈ కేంద్రాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి సంబంధిత అధికారులు సన్నహాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కేసీఆర్ మానేరు ద్వారా సిద్దిపేటకు వాటర్‌గ్రిడ్ తరహాలో అందించిన నీటిపథకం తీరును పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’కు శ్రీకారం చుట్టారు. 2016 ఆగస్టు 7న సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించి అతి తక్కువ కాలంలో ఇంతటి ప్రతిష్టాత్మక పథకాన్ని పూర్తి చేశారని దేశంలోనే చర్చనీయాంశంగా మారారు. పథకం నేపథ్యం ఇదీ దశాబ్ధాలుగా తాగునీటి తండ్లాటతో అల్లాడుతున్న గజ్వేల్‌లో కష్టాలు తీరుస్తానని చెప్పిన మాటకు కట్టుబడ్డారు. కొద్ది నెలల్లోనే గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ నల్లా నీరు అందిస్తానని ప్రకటించి. ఆ మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా 2015 జూన్ 2న గజ్వేల్ ‘మిషన్ భగీరథ’ (వాటర్ గ్రిడ్) పథకానికి (గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలు) రూ.1055కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలను తరలించే పైప్‌లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేసి ఈ ప్రాంతానికి అందిస్తున్నారు. ఇందులో భాగంగానే కొండపాకలోని హెచ్ఎండబ్ల్యూఎస్(హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్)ప్రాంగణం నుంచి, ప్రజ్ఞాపూర్ వద్ద పైప్‌లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేశారు. ప్రజ్ఞాపూర్ నుంచి పైప్‌లైన్‌ను ట్యాపింగ్ చేసి ఆ నీటిని ఎత్తైన ప్రదేశంలో ఉన్న గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలోని సంప్‌హౌస్‌కు తరలించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలోని 244 హాబిటేషన్లలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలీటీతోపాటు మరో 65 గ్రామాలకు గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని 14 మండలాల్లోగల 590 హాబిటేషన్లకు, 2 మున్సిపాలిటీలకు నీటిని అందిస్తున్నారు. ఈ పనులు 2016లో పూర్తి కావడంతో ఇదే తరహాలో రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాల్లో ఈ పనులను చేపట్టారు. మొత్తానికి పనులకు గజ్వేల్ సెగ్మెంట్ కేంద్రబిందువు. అన్ని సెగ్మెంట్ల సమాచారం కోమటిబండ గుట్టపై ఉన్న ‘మిషన్ భగీరథ’ హెడ్ రెగ్యులేటరీపై నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 2018 జనవరిలో హెడ్‌రెగ్యులేటరీని సందర్శించిన ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అప్పటి ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ ఇక్కడ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ సెగ్మెంట్ల సమాచారాన్ని అందించే విధంగా తీర్చి దిద్దాలని సీఎం ఆలోచనగా ఉందని చెప్పారు. దీంతో ‘మిషన్ భగీరథ’ ఈఎన్సీ వెంటనే సెంటర్ కోసం భవనం నిర్మాణం చేపట్టాలని రూ.50లక్షలు మంజూరు చేయడంతో పనులు పూర్తి కావస్తున్నాయి. ఈ కేంద్రంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు భాగాలుగా పథకం అమలవుతున్నతీరు, కృష్టా నదీ జలాలతో 11సెగ్మెంట్లు, గోదావరి జలాలతో మరో 15 సెగ్మెంట్లలో అమలవుతున్న తీరు వివరించే దిశలో ఆయిల్ పేయింటింగ్ ఫొటో గ్యాలరీతో ప్రొజెక్టర్ ఇతర పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులు కూర్చునేందుకు వీలుగా సీట్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సందర్శకుల తాకిడితో పర్యాటక ప్రదేశంగా మారిన కోమటిబండ గుట్ట, నాలెడ్జి సెంటర్ అందుబాటులోకి వస్తే.. మరింత ప్రాయూర్యంలోకి రానుంది. త్వరలోనే ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని మిషన్ భగీరథ అధికారులు ఆలోచనతో ఉన్నారు. గొప్ప కేంద్రంగా తీర్చిదిద్దుతాం గజ్వేల్ మిషన్ భగీరథ పథకానికి కేంద్ర బిందువు. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే పథకంపై పూర్తి అవగాహన కలగాలన్నది సీఎం లక్ష్యం. ముఖ్యమంత్రి ఆలోచనలకనుగుణంగా కోమటిబండ హెడ్ రెగ్యులరేటరీ వద్ద నాలెడ్జి సెంటర్‌ను నిర్మించాం. భవిష్యత్‌లో ఇది గొప్ప కేంద్రంగా మారనుంది. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ -
జలప్రదం
-
గుట్టపైకి గుంపులుగా..
వర్గల్/ములుగు/జగదేవ్‌పూర్: కోమటిబండ గుట్టపైన ఆదివారం ప్రధాని మిషన్ భగీరథ ప్రారంభోత్సవం జరిపి వెళ్లిన కొద్దిసేపటికే జనం గుంపులు గుంపులుగా గుట్టపైకి చేరుకున్నారు. సభలో సీఎం మాట్లాడుతుండగానే సభ ప్రాంగణంలో ఉన్న జనాలు గుట్ట వైపు తరలారు. అప్పటిదాకా గుట్ట మీద పోలీసుల ఆంక్షలు కొనసాగడం, ఆ తరువాత కొద్దిగా సడలించడంతో గుట్టపైనే పథకం చూసేందుకు వారు ఆసక్తి కనపరచారు. ఎట్లాగు ఇక్కడిదాక వచ్చాం.. పథకం చూసి పోదాం అనే భావనలో వారంతా గుట్ట మీదికి గుంపులుగా చేరిపోయారు. సభ ప్రాంగణంలో ‘సెల్ఫీ’ల జోరు ప్రధాని సభ ప్రాంగణంలో ఏ వైపు చూసినా ‘సెల్ఫీ’ల జోరు కన్పించింది. సభకు వచ్చిన ప్రతి ఒక్కరు తమ సెల్ఫోన్లో సెల్ఫీలు తీసుకున్నారు. కొందరు గుట్టపైన సెల్ఫీలు తీసుకుంటే, మరికొందరు తరలివస్తున్న జనంలో కలిసిపోయి సెల్ఫీలు తీసుకున్నారు. ఇంకొందరు సభ ప్రాంగణంలోని ఎల్సీడీల వద్ద సెల్ఫీలు తీసుకున్నారు. ఎక్కువ శాతం యువతీ యువకులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు కూడా సెల్ఫీలు దిగుతూ హంగామాగా కన్పించారు. పులిహోర తిని.. గోదావరి నీళ్లు తాగి.. సభకు వచ్చిన జనం తమ వెంట తెచ్చుకున్న పులిహోర ప్యాకెట్లు సభా ప్రాంగణంలోనే తిని అక్కడే ఏర్పాటు చేసిన నల్లాల ద్వారా వచ్చిన గోదారమ్మ నీళ్లు తాగారు. వృద్ధులు నల్లాల వద్దకు చేరుకుని గోదారి నీళ్లతో గొంతు తడుపుకున్నారు. బాగున్నాయంటూ మురిసిపోయారు. ఇక మా పల్లెల్లో కూడా ఈ నీళ్ల తాగుతామని సంబరపోయారు. సక్సెస్ కోసం నమాజ్ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మక మిషన్ భగీరథ పథకం సఫలం కావాలని ఓ ముస్లిం అభిమాని సభా ప్రాంగణం పక్కన మొక్కల నడుమ ‘నమాజ్’ చేస్తూ కన్పించాడు. పది నిమిషాల పాటు ప్రార్థన కొనసాగించాడు. భారీ జనాన్ని పట్టించుకోకుండా అతను నమాజ్‌లో మునిగిపోయాడు. ఆ తరువాత ఆయనను ఆరా తీస్తే మిషన్ భగీరథ సక్సెస్ కావాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపాడు. నృత్యాలు చేస్తూ ముందుకుసాగిన బంజారాలు సభకు వివిధ ప్రాంతాలనుంచి గిరిజనులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళలు తమ సంప్రదాయ బంజారా నృత్యం చేసుకుంటూ సభికులను ఆకట్టుకున్నారు. వీరు పార్కింగ్ స్థలం నుంచి నృత్యం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బైక్‌లాంటి సైకిల్‌పై.. బైక్ సీటు, పెట్రోల్ ట్యాంక్, హెడ్‌ల్యాంప్‌తో వెనక హరితహారం మొక్క డిజైన్‌తో గజ్వేల్‌కు చెందిన ముస్లిం యువకుడు హల్చల్ చేసాడు. ‘గుండు’ మీద కేసీఆర్ వీరాభిమానం ఓ యువకుని గుండు చేయించుకునేలా చేసింది. కేసీఆర్ అక్షరాలు ఉండేలా గుండు గీయించుకుని గజ్వేల్‌కు చెందిన మెకానిక్ మల్లేషం ఆకట్టుకున్నాడు. అతన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. -
మోదీ చేత్తో అట్టహాసంగా..
-
మోదీ చేత్తో అట్టహాసంగా..
హైదరాబాద్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో గజ్వేల్ లోని నెమటూర్ హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయన హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కోమటిబండ చేరుకున్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించి పథకానికి అంకురార్పణ చేశారు. ఆ వెంటనే గ్రామాలకు నీటి సరఫరా చేసే పంపును స్విచ్ తో ప్రారంభించారు. అలాగే, మిషన్ భగీరథ మొదటి నల్లా ప్రారంభిస్తారు. దీంతోపాటు మిషన్ భగీరథ తీరుతెన్నులపై ప్రదర్శన కార్యక్రమాన్ని తిలకించారు. అలాగే, ఇదే వేదిక నుంచి 1,600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ శంకుస్థాపన, రామగుండం ఎరువుల కర్మాగారం (ఎఫ్‌సీఐ) పునరుద్ధరణ, మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్ శంకుస్థాపన, వరంగల్‌లోని కాళోజీ విశ్యవిద్యాలయం శిలాఫలకాలను రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి నిర్మించిన 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారి ప్రధాని మోదీ తెలంగాణ గడ్డపై అడుడుపెట్టారు. సరిగ్గా మ2.15గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సురేశ్ ప్రభు, అనంతకుమార్ కూడా ఉన్నారు. వీరితోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు కూడా ఉన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన పథకాల విశేషాలు.. మిషన్ భగీరథ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన బృహత్ పథకమిది. మొత్తం రూ.42 వేల కోట్ల అంచనాతో 26 ప్యాకేజీలుగా ఈ పథకాన్ని సర్కారు చేపట్టింది. తొలిదశలో తొమ్మిది నియోజకవర్గాలకు తాగునీటిని అందించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని 243 ఆవాసాల్లో 66 వేల కుటుంబాలకు తాగునీటిని అందించే ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. సింగరేణి విద్యుత్ కేంద్రం ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో రూ.8,250 కోట్లతో సింగరేణి ఈ ప్రాజెక్టును చేపట్టింది. 1,200 మెగావాట్ల ఈ విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్లో జూన్ నుంచి, రెండో యూనిట్లో జూలై 27 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటివరకు తొలి యూనిట్ 140 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసింది. ఈ ప్లాంటును ప్రధాని జాతికి అంకితం చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.5,254 కోట్లతో పునరుద్ధరిస్తోంది. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంలో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 2,200 ఎంటీపీడీ అమ్మోనియా యూనిట్‌ను, 3,850 ఎంటీపీడీ యూనిట్ల యూరియా ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. గ్యాస్ ఆధారితంగా నిర్మించే ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తారు. 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్ పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. మొదటి దశలో 1,600 మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాంగణంలోనే రూ.10,598 కోట్ల ఖర్చుతో చేపట్టే ఈ విద్యుత్ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ హైదరాబాద్-కరీంనగర్ జిల్లాలను కలిపే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మించాలనేది ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్. ఎట్టకేలకు ప్రధాని గజ్వేల్ సభలో ఈ పనులకు పునాదిరాయి వేశారు. రూ.1,160 కోట్ల ఖర్చుతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే గజ్వేల్ వరకు 900 ఎకరాల మేరకు భూసేకరణ పూర్తి చేసి రైల్వేకు అప్పగించారు. మొత్తం 150 కిలోమీటర్ల పొడవుండే ఈ లైన్‌ను మూడేళ్లలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మనోహరాబాద్ (మేడ్చల్) నుంచి గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా ఈ లైన్ కరీంనగర్ (కొత్తపల్లి)కు చేరుతుంది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విభజనలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పేరుతో వరంగల్ కేంద్రంగా ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. -
నేడు కోమటిబండకు మోదీ
-
మోదీజీ వెల్కమ్
► నేడు మధ్యాహ్నం 2.20 గంటలకు నగరానికి రాక ► ప్రత్యేక హెలికాప్టర్లలో గవర్నర్, సీఎంతో కలసి 3 గంటలకు సభాస్థలికి ► మెదక్ జిల్లా కోమటిబండలో భారీగా ఏర్పాట్లు ► తొలుత ‘మిషన్ భగీరథ’ ప్రారంభం.. తొలి నల్లాకు నీటి విడుదల ► అక్కడే మరో ఐదు పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ► అనంతరం బహిరంగ సభలో ప్రసంగం ► నగరంలోని బీజేపీ మహాసమ్మేళనంలో పాల్గొననున్న ప్రధాని మోదీ ► నాలుగున్నర గంటల పాటు పర్యటన.. సాయంత్రం 6.15కు ఢిల్లీకి.. ప్రధానమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం.. సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కింద ఏర్పడిన తెలంగాణ కొత్త రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా అడుగుపెడుతున్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీటిని అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు మరో ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన వెంట ఐదుగురు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, పీయూష్ గోయల్, అనంత్‌కుమార్, బండారు దత్తాత్రేయ తదితరులూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎన్నో అంచనాలు, మరెన్నో ఆశల మధ్య ప్రధాని మోదీ రాక రాష్ట్ర రాజకీయ శ్రేణుల్లో, అధికారవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు లక్షల మందిని బహిరంగ సభకు తరలించేందుకు సన్నాహాలు చేసింది. వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సభాస్థలిని ఏర్పాటు చేసింది. ఘనంగా స్వాగతానికి ఏర్పాట్లు ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తదితరులు ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచే గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రులతో కలసి మూడు ప్రత్యేక హెలికాప్టర్లలో మెదక్ జిల్లా కోమటిబండకు బయలుదేరుతారు. ప్రధానికి సంప్రదాయంగా స్వాగతం పలకడంతో పాటు వివిధ కార్యక్రమాల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు చేసింది. కోమటిబండలో ప్రారంభోత్సవాలు, సభ అనంతరం సాయంత్రం ఐదు గంటల సమయంలో మోదీ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనంలో పాల్గొని... పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. ప్రధాని పర్యటనపై భారీ ఆశలు ప్రధాని మోదీ తొలిసారిగా రాష్ట్రానికి రానుండటంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కేంద్రం నుంచి ఆశించినంత సహకారం అందడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు మొదలు ప్రత్యేక ప్యాకేజీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు ఆర్థిక సాయం అందించాలని పలుమార్లు సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని స్వయంగా కలసి విజ్ఞప్తి చేశారు. మరో రూ.1,000 కోట్ల రుణసాయం అందించాలని కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న బృహత్తర పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. వీటిని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు రూ.24,650 కోట్లు విడుదల చేయాలని ఇటీవలే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, చెరువుల పునరుద్ధరణ (మిషన్ కాకతీయ)కు రూ.5,000 కోట్లు ఇవ్వాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాని తన తొలి పర్యటనలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు తమవంతుగా ఎలాంటి సాయం ప్రకటిస్తారనేది ఆసక్తి రేపుతోంది. నాలుగున్నర గంటల్లో.. రాష్ట్రంలో మోదీ పర్యటన పూర్తి వివరాలివే.. 2.20: బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ రాక 2.25: బేగంపేట నుంచి హెలికాప్టర్లో గజ్వేల్ పయనం 2.50: గజ్వేల్‌లోని నెమటూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు 2.55: హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం 3.00: ప్రారంభోత్సవం జరిగే కోమటిబండ వద్దకు చేరుకుంటారు 3.01: మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ 3.03: గ్రామాలకు నీటి సరఫరా చేసే పంపు ఆవిష్కరణ 3.04: మిషన్ భగీరథ మొదటి నల్లా ప్రారంభం 3.05: మిషన్ భగీరథ తీరుతెన్నులపై ప్రదర్శన 3.10: బహిరంగసభ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు 3.15 నుంచి 3.24 వరకు: 1,600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ శంకుస్థాపన, రామగుండం ఎరువుల కర్మాగారం (ఎఫ్‌సీఐ) పునరుద్ధరణ, మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్ శంకుస్థాపన, వరంగల్‌లోని కాళోజీ విశ్యవిద్యాలయం శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి నిర్మించిన 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్‌ను జాతికి అంకితం చేస్తారు. 3.25: బహిరంగసభ వేదిక పైకి రాక 3.27: కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతోపన్యాసం 3.30-3.37: సీఎం కేసీఆర్ ప్రసంగం 3.37-4.10: ప్రధాని మోదీ ప్రసంగం 4.13: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందన సమర్పణ 4.20: కోమటిబండ నుంచి బయలుదేరుతారు 4.25: నెమటూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు 4.30: హెలికాప్టర్లో హైదరాబాద్‌కు పయనం 4.55: బేగంపేటకు చేరుకుంటారు 5.00: బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఎల్బీ స్టేడియానికి వస్తారు 5.15-6.15: బీజేపీ కార్యకర్తల మహాసమ్మేళనంలో పాల్గొంటారు 6.20- 6.35: ఎల్బీ స్టేడియం నుంచి రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తారు 6.40: ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు ఘనంగా స్వాగతిద్దాం ఏర్పాట్లపై సమీక్షలో కేసీఆర్ జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు శనివారం తెలంగాణ భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్... ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలువురు మంత్రులు, పార్టీ నాయకులతో సమీక్షించారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. మోదీ తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్నందున ఘనంగా స్వాగ తం తెలపాలని కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల నుంచి కనీసం రెండు వేల మంది చొప్పున తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీగా తరలించాలన్నారు. భద్రతా కారణాల రీత్యా సభా వేదికపైకి కొందరికే అనుమతి ఉంటుందని... అవకాశం రాని మంత్రులు సంయమనం పాటించాలని సూచించినట్లు తెలిసింది. కండువాలు, జెండాలకు అనుమతి లేదు సభాస్థలిలో పార్టీల కండువాలకు, జెండాలకు, బ్యానర్లకు, ఫ్లెక్సీలకు అనుమతి లేదు. వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులు తీసుకెళ్లడాన్ని కూడా నిషేధించినట్లు మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎస్పీజీ నిబంధనల ప్రకారం కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమతోపాటు ఎక్కువ మందిని తీసుకువచ్చే పరిస్థితి లేదని.. వారికోసం ప్రత్యేకంగా రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రముఖులకు, మీడియాకు మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన ఏర్పాట్లు చేశారు. ప్రధాని ప్రారంభించే పథకాల విశేషాలివే.. మిషన్ భగీరథ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన బృహత్ పథకమిది. మొత్తం రూ.42 వేల కోట్ల అంచనాతో 26 ప్యాకేజీలుగా ఈ పథకాన్ని సర్కారు చేపట్టింది. తొలిదశలో తొమ్మిది నియోజకవర్గాలకు తాగునీటిని అందించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని 243 ఆవాసాల్లో 66 వేల కుటుంబాలకు తాగునీటిని అందించే పథకాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. సింగరేణి విద్యుత్ కేంద్రం ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో రూ.8,250 కోట్లతో సింగరేణి ఈ ప్రాజెక్టును చేపట్టింది. 1,200 మెగావాట్ల ఈ విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్లో జూన్ నుంచి, రెండో యూనిట్లో జూలై 27 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటివరకు తొలి యూనిట్ 140 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసింది. ఈ ప్లాంటును ప్రధాని జాతికి అంకితం చేస్తారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.5,254 కోట్లతో పునరుద్ధరిస్తోంది. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంలో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 2,200 ఎంటీపీడీ అమ్మోనియా యూనిట్‌ను, 3,850 ఎంటీపీడీ యూనిట్ల యూరియా ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. గ్యాస్ ఆధారితంగా నిర్మించే ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తారు. 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్ పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. మొదటి దశలో (800్ఠ2) 1,600 మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాంగణంలోనే రూ.10,598 కోట్ల ఖర్చుతో చేపట్టే ఈ విద్యుత్ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ హైదరాబాద్-కరీంనగర్ జిల్లాలను కలిపే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మించాలనేది ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్. ఎట్టకేలకు ప్రధాని గజ్వేల్ సభలో ఈ పనులకు పునాదిరాయి వేయనున్నారు. రూ.1,160 కోట్ల ఖర్చుతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే గజ్వేల్ వరకు 900 ఎకరాల మేరకు భూసేకరణ పూర్తి చేసి రైల్వేకు అప్పగించారు. మొత్తం 150 కిలోమీటర్ల పొడవుండే ఈ లైన్‌ను మూడేళ్లలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మనోహరాబాద్ (మేడ్చల్) నుంచి గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా ఈ లైన్ కరీంనగర్ (కొత్తపల్లి)కు చేరుతుంది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విభజనలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పేరుతో వరంగల్ కేంద్రంగా ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ప్రత్యేక ఏర్పాట్లు సభా స్థలంలో 1.5 లక్షల మందికి సరిపోయేలా రెయిన్ ప్రూఫ్ టెంట్లు, మరో 50వేల మందికి సరిపోయేలా సాధారణ టెంట్లు వేశారు. 160 ఎకరాలను ఎనిమిది సెక్టార్లుగా విభజించి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. జనాన్ని తరలించేం దుకు 4,500 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. 4 వేల మందికిపైగా కేంద్ర, రాష్ట్ర బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను శనివారం బండారు దత్తాత్రేయ, హరీశ్‌రావు పరిశీలించారు. స్వల్ప మార్పులు, చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. వేదికపై పరిమిత సంఖ్యలో.. ప్రధాని ప్రసంగించే ప్రధాన వేదికపై దాదాపు 20 మంది ప్రముఖులు మాత్రమే ఉండనున్నారు. ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, పీయూష్ గోయల్, అనంత్‌కుమార్, బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పి.మహేందర్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మెదక్ జెడ్పీ చైర్పర్సన్ రాజారాణి తదితరులు వేదికపై ఉంటారు. ఇక కుడివైపు ఏర్పాటు చేసిన మరో వేదికపై మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్ పర్సన్లు, మేయర్లు, ఇతర ముఖ్యులు ఉంటారు. ఎడమ వైపు వేదికపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధిపతులు కూర్చుంటారు. ఇక ముగ్గురు మాత్రమే ప్రసంగించనున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతోపన్యాసం చేస్తారు. తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడాక.. ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. చివరగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వందన సమర్పణ చేస్తారు. అనంతరం ప్రధాని హైదరాబాద్‌కు బయలుదేరుతారు. -
నేడు కోమటిబండకు మోదీ
‘మిషన్ భగీరథ’కు వేదికైన కోమటిబండ పంప్‌హౌస్‌ను ప్రారంభించనున్న ప్రధాని 243 గ్రామాలకు ఏకకాలంలో నీటి సరఫరా సర్వత్రా ఉత్కంఠ.. ఆసక్తి అంతటా ఒకటే ఉత్కంఠ.. అందరిలోనూ ఆసక్తి.. పల్లె గొంతు తడిపే బృహత్తర ‘మిషన్‌భగీరథ’ స్వప్నం సాకారమయ్యే క్షణాలు సమీపించిన వేళ అందరి చూపూ గజ్వేల్ మండలంలోని కోమటిబండ వైపే.. గుక్కెడు నీళ్ల కోసం తండ్లాడిన మహిళలు.. నేటి నుంచి ఇంటి చెంతనే గోదావరి నీటిని ఒడిసి పట్టుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ప్రధాని నరేంద్రమోది ఆదివారం ప్రారంభించే ఈ కార్యక్రమానికి సంబంధించి సర్వం సిద్ధమైంది. గజ్వేల్: గజ్వేల్ మండలం కోమటిబండలో మోడీ సభకు సర్వం సిద్ధమైంది. జాతీయ స్థాయిలో చర్చనీయంశమయ్యేవిధంగా భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత... ప్రధాని తొలి పర్యటన కావడం ఈ సభకు మరో విశేషం. 1998లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ప్రారంభించిన మంచినీటి పథకాన్ని అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ‘మిషన్ భగీరథ’గా పరిచయం చేస్తున్న ప్రతిష్టాత్మక మంచినీటి పథకానికి ఈ సభ వేదికవుతోంది. ప్రధాని పంప్‌హౌస్‌ను ప్రారంభించడంతో ఏకకాలంలో నియోజకవర్గంలోని 243 గ్రామాలకు నీటి సరఫరా జరగనుండడంతో... మహిళల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆదివారం నాటి సభపై అంతటా ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం నియోజకవర్గంలోని 243 గ్రామాల్లో 67275 నల్లా కనెక్షన్లను దాదాపు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే గజ్వేల్ మండలంలోని 27 ఆవాసాల్లోని 38931 జనాభాకు, జగదేవ్‌పూర్ మండలంలోని 42 ఆవాసాల్లోని 47073 జనాభాకు, కొండపాక మండలంలోని 38 ఆవాసాల్లోని 46766 జనాభాకు, ములుగు మండలంలోని 42 ఆవాసాల్లోని 39821 జనాభాకు, తూప్రా¯ŒS మండలంలోని 53 ఆవాసాల్లోని 47287 జనాభాకు, వర్గల్ మండలంలోని 46 ఆవాసాల్లోని 43278 జనాభాకు నీటి సరఫరాకు ఏర్పాట్లు జరిగాయి. దశాబ్ధాలుగా మంచినీటి కష్టాలతో తల్లడిల్లుతున్న జనం ఈ పథకంతో శాశ్వత పరిష్కారాన్ని పొందగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గజ్వేల్ మండలం కోమటిబండ, వర్గల్ మండలం మైలారం, నెంటూరు,, జగదేవ్‌పూర్ మండలంలోని తిమ్మాపూర్, అంగడి కిష్టాపూర్ గ్రామాల్లో మహిళలను ‘సాక్షి పలుకరించగా ఏండ్ల సంది మంచినీటికి అరిగోస పడుతున్నం... కేసీఆర్ సారూ పుణ్యమా అని... ఇక మంచినీటి గోస పోతుంది అంటూ మురిసిపోయారు. ఈ మంచి పథకాన్ని ప్రారంభించేం దుకు ఢిల్లీకెళ్ళి మోడీ సాబు వస్తుండట.. మేమ్ కూడా సభకు పోతున్నం... ఆడ చెప్పిన ముచ్చ ట్లు ఇంటం.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు. తరలింపునకు ఏర్పాట్లు సభకు 2 లక్షల మందికిపైగా జనాన్ని తరలించడానికి ఇప్పటికే ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 4500 ఆర్టీసీ బస్సుల్లో జనం తరలివస్తున్నట్లు చెబుతున్నారు. కోమటిబండ గుట్టపై హెడ్‌వర్కŠస్ ప్రాంతాన్ని ఎస్పీజీ బృందం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడికి ప్రధాని వచ్చే సందర్భంలో మీడియాకు కూడా ప్రవేశం లేదు. మధ్యాహ్నం 3 గంటలకు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ప్రధా ని హెలికాప్టర్లో కోమటిబండ సభాస్థలి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత కేసీఆర్‌తో కలిసి కాన్వాయ్‌లో కోమటిబండ గుట్టపై ఉన్న ‘మిష¯ŒS భగీరథ’ హెడ్‌వర్కŠస్పై పైలా¯ŒSను ఆవిష్కరిస్తారు. అలాగే, పంప్‌హౌస్, నల్లా నీటిని ప్రారంభిస్తారు. ఇదే ప్రదేశంలో తెలంగాణలోని ‘మిష¯ŒS భగీరథ’ 26 గ్రిడ్ల డిజై¯ŒSను సూచిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తారు. ‘మిషన్ భగీరథ’పై వీడియో ప్రదర్శన కూడా ఉంటుందని చెబుతున్నారు. ఆ తర్వాత ప్రధాని సభావేదిక వెనుక భాగంలో థర్మల్ విద్యుత్ కేంద్రానికి, రామగుండం ఎరువులు కర్మాగారం పునఃరుద్ధరణ, వరంగల్ కాళోజి హెల్త్ అండ్ సైన్ యూనివర్సిటీ శిలాఫలకాల ఆవిష్కరణ, 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ పవర్స్టేన్ జాతికి అంకితం చేస్తారు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలై¯ŒSకు శంకుస్థాపన చేస్తారు. వేదికపై పది మందే.. ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం కేసీఆర్, గవర్నర్ నర్సింహ¯ŒSతో పాటు ఐదుగురు కేంద్ర మంత్రులు, మరో 10 మంది మాత్రమే వేదికపై ఉంటారు. కుడివైపున ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, ఇతర ముఖ్యులు ఉంటారు. ఎడమవైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధిపతులు కూర్చుంటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతోపన్యాసం చేసే అవకాశముండగా... సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వందన సమర్పణ చేస్తారు. ఇది పూర్తి కాగానే ప్రధాని హెలిపాడ్ గుండా సుమారు 4:15 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. సభా వేదిక వద్ద సేద తీరే ఏర్పాట్లు ప్రధాని మోదీ సేద తీరేందుకు మూడు ప్రత్యేకమైన రెయి¯ŒSప్రూఫ్ గదులను ఏర్పాటు చేశారు. సభావేదిక వద్ద ప్రముఖులకు, మీడియాకు మధ్యాహ్నం 1 గంటకు భోజన ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రధాని హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు.. నెంటూరు–చౌదర్పల్లి–వర్గల్ చౌరస్తా– రాజీవ్ రహదారి మార్గంలో జన సంచారాన్ని నిలిపివేశారు. శనివారం ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. వీరు ప్రధాని గుట్టపై తిరిగే ప్రదేశాలు, సభావేదిక, హెలిపాడ్ స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదిలా ఉంటే ‘మిష¯ŒS భగీరథ’ వైస్ చైర్మ¯ŒS వేముల ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిష¯ŒS తదితరులు సైతం ఏర్పాట్లు పరిశీలించారు. -
ప్రతి పల్లెకొమటిబండ కదలాలి
జగదేవ్‌పూర్:మొట్ట మొదటి సారిగా ప్రధాని నరేంద్రమోడీ మిషన్‌భగీరథ పథకాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న క్రమంలో మండల ప్రజలు కొమటిబండ సభకు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి కోరారు. శుక్రవారం మండలంలో అధికారులతో కలిసి పర్యటించారు. ప్రధానమంత్రి సభపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్‌భగీరథ పథకం దేశ చరిత్రలోనే నిలుస్తుందన్నారు. ఇంటింటికి గోదావరి జాలాలు అందించే లక్ష్యంగా మిషన్‌భగీరథ పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలుకుదామన్నారు. సభకు వచ్చేవారి కోసం బస్సు సౌకర్యం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదవరెడ్డి, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీపీ రేణుక, రాష్ట్ర నాయకులు రంగారెడ్డి, నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఎంపీడీఓ పట్టాభిరామారావు. తహసీల్దార్ పరమేశం, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో... కోమటి బండకు ప్రధాని వస్తున్న నేపథ్యంలో మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సభకు హాజరు కావాలని బీజేపీ గజ్వేల్ బాధ్యులు ఆకుల రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని వట్టిపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. 7న జరిగే ప్రధాని సభను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు సత్యం, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సాయిబాబా, రాములు తదితరులు పాల్గొన్నారు.