ప్రతి పల్లెకొమటిబండ కదలాలి
జగదేవ్‌పూర్:మొట్ట మొదటి సారిగా ప్రధాని నరేంద్రమోడీ మిషన్‌భగీరథ పథకాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న క్రమంలో మండల ప్రజలు కొమటిబండ సభకు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి కోరారు. శుక్రవారం మండలంలో అధికారులతో కలిసి పర్యటించారు. ప్రధానమంత్రి సభపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్‌భగీరథ పథకం దేశ చరిత్రలోనే నిలుస్తుందన్నారు.
ఇంటింటికి గోదావరి జాలాలు అందించే లక్ష్యంగా మిషన్‌భగీరథ పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలుకుదామన్నారు. సభకు వచ్చేవారి కోసం బస్సు సౌకర్యం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు యాదవరెడ్డి, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీపీ రేణుక, రాష్ట్ర నాయకులు రంగారెడ్డి, నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఎంపీడీఓ పట్టాభిరామారావు. తహసీల్దార్ పరమేశం, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో...
కోమటి బండకు ప్రధాని వస్తున్న నేపథ్యంలో మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సభకు హాజరు కావాలని బీజేపీ గజ్వేల్ బాధ్యులు ఆకుల రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని వట్టిపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. 7న జరిగే ప్రధాని సభను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు సత్యం, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సాయిబాబా, రాములు తదితరులు పాల్గొన్నారు.