నేడు కోమటిబండకు మోదీ | PM coming to komatibanda | Sakshi
Sakshi News home page

నేడు కోమటిబండకు మోదీ

Published Sat, Aug 6 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

ప్రారంభానికి సిద్ధమైన మిషన్‌ భగీరథ హెడ్‌వర్క్స్‌ రెగ్యులరేటర్‌

ప్రారంభానికి సిద్ధమైన మిషన్‌ భగీరథ హెడ్‌వర్క్స్‌ రెగ్యులరేటర్‌

  • ‘మిషన్‌ భగీరథ’కు వేదికైన కోమటిబండ
  • పంప్‌హౌస్‌ను ప్రారంభించనున్న ప్రధాని
  • 243 గ్రామాలకు ఏకకాలంలో నీటి సరఫరా
  • సర్వత్రా ఉత్కంఠ.. ఆసక్తి
  • అంతటా ఒకటే ఉత్కంఠ.. అందరిలోనూ ఆసక్తి.. పల్లె గొంతు తడిపే బృహత్తర ‘మిషన్‌భగీరథ’ స్వప్నం సాకారమయ్యే క్షణాలు సమీపించిన వేళ అందరి చూపూ గజ్వేల్‌ మండలంలోని కోమటిబండ వైపే.. గుక్కెడు నీళ్ల కోసం తండ్లాడిన మహిళలు.. నేటి నుంచి ఇంటి చెంతనే గోదావరి నీటిని ఒడిసి పట్టుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ప్రధాని నరేంద్రమోది ఆదివారం ప్రారంభించే ఈ కార్యక్రమానికి సంబంధించి సర్వం సిద్ధమైంది.
     

    గజ్వేల్‌: గజ్వేల్‌ మండలం కోమటిబండలో మోడీ సభకు సర్వం సిద్ధమైంది. జాతీయ స్థాయిలో చర్చనీయంశమయ్యేవిధంగా భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత... ప్రధాని తొలి పర్యటన కావడం ఈ సభకు మరో విశేషం. 1998లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ప్రారంభించిన మంచినీటి పథకాన్ని అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తుతం ‘మిషన్‌ భగీరథ’గా పరిచయం చేస్తున్న ప్రతిష్టాత్మక మంచినీటి పథకానికి ఈ సభ వేదికవుతోంది.

    ప్రధాని పంప్‌హౌస్‌ను ప్రారంభించడంతో ఏకకాలంలో నియోజకవర్గంలోని 243 గ్రామాలకు నీటి సరఫరా జరగనుండడంతో... మహిళల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆదివారం నాటి సభపై అంతటా ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం నియోజకవర్గంలోని 243 గ్రామాల్లో 67275 నల్లా కనెక్షన్లను దాదాపు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే గజ్వేల్‌ మండలంలోని 27 ఆవాసాల్లోని 38931 జనాభాకు, జగదేవ్‌పూర్‌ మండలంలోని 42 ఆవాసాల్లోని 47073 జనాభాకు, కొండపాక మండలంలోని 38 ఆవాసాల్లోని 46766 జనాభాకు, ములుగు మండలంలోని 42 ఆవాసాల్లోని 39821 జనాభాకు, తూప్రా¯ŒS మండలంలోని 53 ఆవాసాల్లోని 47287 జనాభాకు, వర్గల్‌ మండలంలోని 46 ఆవాసాల్లోని 43278 జనాభాకు నీటి సరఫరాకు ఏర్పాట్లు జరిగాయి.

    దశాబ్ధాలుగా మంచినీటి కష్టాలతో తల్లడిల్లుతున్న జనం ఈ పథకంతో శాశ్వత పరిష్కారాన్ని పొందగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గజ్వేల్‌ మండలం కోమటిబండ, వర్గల్‌ మండలం మైలారం, నెంటూరు,, జగదేవ్‌పూర్‌ మండలంలోని తిమ్మాపూర్, అంగడి కిష్టాపూర్‌ గ్రామాల్లో మహిళలను ‘సాక్షి పలుకరించగా ఏండ్ల సంది మంచినీటికి అరిగోస పడుతున్నం... కేసీఆర్‌ సారూ పుణ్యమా అని... ఇక మంచినీటి గోస పోతుంది అంటూ మురిసిపోయారు. ఈ మంచి పథకాన్ని ప్రారంభించేం దుకు ఢిల్లీకెళ్ళి మోడీ సాబు వస్తుండట.. మేమ్‌  కూడా సభకు పోతున్నం... ఆడ చెప్పిన ముచ్చ ట్లు ఇంటం.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

    తరలింపునకు ఏర్పాట్లు
    సభకు 2 లక్షల మందికిపైగా జనాన్ని తరలించడానికి ఇప్పటికే ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 4500 ఆర్టీసీ బస్సుల్లో జనం తరలివస్తున్నట్లు చెబుతున్నారు. కోమటిబండ గుట్టపై హెడ్‌వర్కŠస్‌ ప్రాంతాన్ని ఎస్పీజీ బృందం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడికి ప్రధాని వచ్చే సందర్భంలో మీడియాకు కూడా ప్రవేశం లేదు.

    మధ్యాహ్నం 3 గంటలకు.
    ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ప్రధా ని హెలికాప్టర్‌లో కోమటిబండ సభాస్థలి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత కేసీఆర్‌తో కలిసి కాన్వాయ్‌లో కోమటిబండ గుట్టపై ఉన్న ‘మిష¯ŒS భగీరథ’ హెడ్‌వర్కŠస్‌పై పైలా¯ŒSను ఆవిష్కరిస్తారు. అలాగే, పంప్‌హౌస్, నల్లా నీటిని ప్రారంభిస్తారు. ఇదే ప్రదేశంలో తెలంగాణలోని ‘మిష¯ŒS భగీరథ’ 26 గ్రిడ్ల డిజై¯ŒSను సూచిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తారు.

    ‘మిషన్‌ భగీరథ’పై వీడియో ప్రదర్శన కూడా ఉంటుందని చెబుతున్నారు. ఆ తర్వాత ప్రధాని సభావేదిక వెనుక భాగంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి, రామగుండం ఎరువులు కర్మాగారం పునఃరుద్ధరణ, వరంగల్‌ కాళోజి హెల్త్‌ అండ్‌ సైన్‌ యూనివర్సిటీ శిలాఫలకాల ఆవిష్కరణ, 1200 మెగావాట్ల జైపూర్‌ థర్మల్‌ పవర్‌స్టేన్‌ జాతికి అంకితం చేస్తారు. మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వేలై¯ŒSకు శంకుస్థాపన చేస్తారు.

    వేదికపై పది మందే..
    ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం కేసీఆర్, గవర్నర్‌ నర్సింహ¯ŒSతో పాటు ఐదుగురు కేంద్ర మంత్రులు, మరో 10 మంది మాత్రమే వేదికపై ఉంటారు. కుడివైపున ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, ఇతర ముఖ్యులు ఉంటారు. ఎడమవైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధిపతులు కూర్చుంటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతోపన్యాసం చేసే అవకాశముండగా... సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వందన సమర్పణ చేస్తారు. ఇది పూర్తి కాగానే ప్రధాని హెలిపాడ్‌ గుండా సుమారు 4:15 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్తారు.

    సభా వేదిక వద్ద సేద తీరే ఏర్పాట్లు
    ప్రధాని మోదీ సేద తీరేందుకు మూడు ప్రత్యేకమైన రెయి¯ŒSప్రూఫ్‌ గదులను ఏర్పాటు చేశారు. సభావేదిక వద్ద ప్రముఖులకు, మీడియాకు మధ్యాహ్నం 1 గంటకు భోజన ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రధాని హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు.. నెంటూరు–చౌదర్‌పల్లి–వర్గల్‌ చౌరస్తా– రాజీవ్‌ రహదారి మార్గంలో జన సంచారాన్ని నిలిపివేశారు. శనివారం ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. వీరు ప్రధాని గుట్టపై తిరిగే ప్రదేశాలు, సభావేదిక, హెలిపాడ్‌ స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదిలా ఉంటే ‘మిష¯ŒS భగీరథ’ వైస్‌ చైర్మ¯ŒS వేముల ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిష¯ŒS తదితరులు సైతం ఏర్పాట్లు పరిశీలించారు.  


     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement