ముందుగా చెప్పాలా.. ప్రధాని చెప్పలేదా? | prime minister has indicated well in advance about demonitisation, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 11 2016 11:03 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

నల్లధనం ఉన్నవాళ్లు వెంటనే దాన్ని బయటపెట్టాలని, అందుకు ఇదే చిట్టచివరి అవకాశమని, తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండబోదని నల్లధనం వెల్లడి పథకం సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారని, అయినా అప్పట్లో చాలామంది పట్టించుకోలేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఇప్పుడు మాత్రం కొంతమంది నోట్ల రద్దు విషయాన్ని ముందుగా చెప్పాలి కదా అంటున్నారని, ప్రధానమంత్రి అంత స్పష్టంగా 'మన్‌కీ బాత్'లో చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకపోతే ఎవరేం చేస్తారని అన్నారు. నోట్ల రద్దు విషయమై ఆయన శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. 500, 1000 నోట్ల రద్దు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమీ కాదని, దాని వెనుక చాలా సుదీర్ఘమైన ఏర్పాట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. స్వార్థ ప్రయోజనాలు ఉన్న కొద్దిమంది తప్ప ఈ చారిత్రక నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. రైతుల వద్ద ఉన్న నల్లధనం పనికిరాకుండా పోతోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రైతులను ఇలా అవమానించవద్దని చెప్పారు. తాను కూడా రైతునే అని ఈ సందర్భంగా అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement