ఎక్కడైతే అన్యాయంపై ప్రజలు గొంతెత్తుతారో.. ఎక్కడైతే న్యాయం కోసం ప్రజలు ఆందోళనల బాట పట్టి తమ హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుందో.. అలాంటి ప్రాంతంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని విజ్ఞులు చెబుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో నియంతృత్వ పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు మాత్రం.. ప్రజల గొంతు తనకు వినబడకూడదని హు కుం జారీ చేసింది. ఆందోళనలపై ఉక్కుపా దం మోపాలని అధికారులను ఉసిగొల్పింది. గొంతెత్తితే పీడీ కేసులు పెట్టి నొక్కేయాలని ఆదేశించింది. ఆందోళనలు అంటేనే ప్రజలు ఆమడ దూరంలో ఉండేలా చేసి ప్రజాస్వామ్యానికి పాతరేసేయాలని సూచించింది. సీఎం ఇలా నేరుగా ఆదేశాలివ్వడం ప్రజాస్వా మ్య వాదులను కలవరపెడుతోంది.
Published Sun, Oct 2 2016 6:21 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement