రాహుల్‌ చేసిన ‘భూకంపం’ ప్రకటన ఇదే | Rahul Gandhi accuses PM Modi of taking bribes, BJP hits back | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 22 2016 6:28 AM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM

ప్రధాని మోదీ అవినీతిపరుడని, ఆయన వ్యక్తిగత అవినీతికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, ఆయన అవినీతిపై తాను నోరు విప్పితే భూకంపమే వస్తుందంటూ ఇటీవలి కాలంలో వరుసగా ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ‘ఆ భూకంపం వచ్చే’ ఆరోపణల వివరాలు తాజాగా వెల్లడించారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బుధవారం జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. గుజరాత్‌ సీఎంగా ఉండగా మోదీకి ప్రముఖ వ్యాపార సంస్థలు సహారా గ్రూప్, బిర్లా గ్రూప్‌లు ముడుపులు చెల్లించాయని, అందుకు సంబంధించిన ఆధారాలు ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్నాయని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement