ఇవీ దక్షిణ మధ్య రైల్వే కేటాయింపులు | Railway allocation for South Central Railway in Union Budget -2017 | Sakshi
Sakshi News home page

Feb 3 2017 7:30 PM | Updated on Mar 21 2024 8:11 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు ప్రకటించారు. విడిగా రైల్వే బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన సమయాల్లో ఎప్పుడూ దక్షిణ మధ్య రైల్వేకు ఇంతమొత్తం కేటాయించిన దాఖలా లేదు. శుక్రవారం సభకు సమర్పించిన అనంతరం పూర్తి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. గత బడ్జెట్‌లో తెలంగాణకు కేవలం రూ.601 కోట్లు మాత్రమే కేటాయించగా ఈసారి రూ.1,729 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు గత బడ్జెట్‌లో రూ.2,195 కోట్లు కేటాయించగా ఈసారి రూ.3,406 కోట్లు కేటాయించటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement