సిమి కార్యకర్తల ఎన్ కౌంటర్ పై కొంత మంది చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం తగదన్నారు. మన సైనికుల త్యాగాలను గుర్తించకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.