నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఒంటిగంట వరకు మాత్రమే వేడుకలు జరుపుకొనేందుకు అనుమతిస్తున్నట్టు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. డీజేలు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. పార్టీలో పాల్గొనే మహిళలకు ప్రత్యేక బ్యారెక్లు ఏర్పాటు చేయాలని సీవీ ఆనంద్ తెలిపారు. ఆయుధాలతో వచ్చే వారిని వేడుకలకు అనుమతించరాదని చెప్పారు. ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల ఫ్లై ఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్డును మూసివేస్తున్నట్టు సైబరాబాద్ కమిషనర్ తెలియజేశారు.
Published Wed, Dec 24 2014 3:55 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
Advertisement