December 31st
-
రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా!
చెన్నై : సూపర్‌స్టార్ రజనీ ఎంట్రీ దగ్గర నుంచి తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ పేరుగా మక్కల్ సేవై కర్చీ, పార్టీ గుర్తుగా ఆటో రిక్షాను ఎంపికచేసినట్లు సమాచారం. కాగా పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ ఈనెల 31న ఒక ప్రకటన చేయనున్నారంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. కాగా పార్టీ ఏర్పాటుకు రజనీ జనవరి 14 లేదా 17 తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనవరి 14న తమిళ పొంగల్ సందర్భంగా పార్టీ పెట్టాలని కొందరు సూచిస్తే.. ఎంజీఆర్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 17న పార్టీ పెట్టాలని మరికొందరు రజనీకి సూత్రప్రాయంగా వెల్లడించినట్లు తెలుస్తుంది.ఏదైమైనా జనవరి 17నే రజనీ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు కానుందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరగనున్నాయి.(చదవండి : రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై!) కాగా తూత్తుకుడి ఆందోళనల ఘటనపై నటుడు రజనీకాంత్‌కు సోమవారం సమన్లు జారీ అయ్యాయి. జనవరి 19 లోపు సమాధానం ఇవ్వాలని సింగిల్ జడ్జి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 2018 మేలో తూత్తుకుడిలోని స్టెరిలైట్ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీలో కాల్పులు జరగడంతో 13మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్ట్ జస్టిస్ అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని రజనీకాంత్ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు మక్కల్ సేవై కట్చి పేరును రజనీకాంత్ రిజిస్టర్ చేస్తే కోర్టులో కేసు దాఖలు చేస్తామని అఖిల భారత మక్కల్ సేవై ఇయక్కం అధ్యక్షుడు తంగ షణ్ముగసుందరం హెచ్చరించారు. -
వెలుగులనమ్మే చిన్నారి
సంవత్సరం చివరి రోజున జరిగే కథ. సంవత్సరంలో ఏరోజూ జరగకూడని కథ. చలి మరీ తీవ్రంగా ఉంది; మంచు కురిసింది; చీకటి కూడా పడుతోంది. అది సాయంత్రం, ఆ సంవత్సరపు చివరి సాయంత్రం. ఇట్లాంటి చలిలో, చీకటిలో ఒక పేద బాలిక నడుస్తూవుంది; తలకు కట్టయినా, కాళ్లకు చెప్పులయినా లేకుండా. ఇల్లు వదిలినప్పుడు ఆమె కాళ్లకు చెప్పులున్న మాట వాస్తవం; కానీ ఏం లాభం? అవి ఆమె కాళ్లకు చాలా పెద్దవైనాయి; అంతకుముందు వాళ్లమ్మ వేసుకున్నవాయె. పోనీ అవైనా ఉన్నాయనుకుంటే, ఆ వీధిలోంచి భయంకరమైన వేగంతో వెళ్లిన రెండు గుర్రపుబళ్లకు భయపడి పరుగెత్తడంలో అవెక్కడో జారిపోయినై. ఒక చెప్పు ఎక్కడా కనబడనేలేదు; కనబడిన రెండోదాన్ని ఎవరో పేద తుంటరి పిల్లాడు ఎత్తుకొని పరుగెత్తాడు; వాడికి ఎప్పటికైనా పిల్లలు పుడితే కొనవలసిన ఊయలకు పెట్టుబడిగా పనికి వస్తుందనేమో. ఇంక ఈ చిన్నారి తల్లి తన చిన్న కాళ్లతోనే నడుచుకుంటూ పోయింది. చలికి ఆమె ఎర్రటి పాదాలు నీలంరంగులోకి మారుతున్నాయి. ఆమె వేసుకున్న పాత ఏప్రానులో కొన్ని అగ్గిపుల్లలున్నాయి; ఇంకో కట్టేమో ఆమె చేతిలో ఉంది. పొద్దుటినుంచీ అందులోంచి ఒక్కటైనా ఎవరూ కొనలేదు, ఒక్క ‘ఫార్తింగ్’ అయినా ఇవ్వలేదు. పాపం ఆ చిన్నారి అట్లానే ఆ చలికి వణుకుతూ, ఆకలికి మాడుతూ, కాళ్లను ఈడ్చుకుంటూ పోయింది. ఎంత హృదయ విదారక దృశ్యం! ఆమె మెడచుట్టూ అందంగా జాలువారిన ఆమె పొడవాటి జుట్టు మంచు ముద్దలతో నిండిపోయింది. కానీ ఆమె దానిగురించి ఒక్కసారైనా ఆలోచించలేదు. అన్ని కిటికీల్లోనూ కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, రుచికరమైన బాతు మాంసం వాసన వేస్తోంది. అది కొత్త సంవత్సరపు వేడుక. దీని గురించైతే ఆమె ఆలోచించకుండా ఉండలేకపోయింది. రెండు ఇళ్ల మధ్య ఏర్పడిన మూలలో– అందులోంచి ఒక ఇల్లు కొంచెం ఎక్కువ పొడుచుకు వచ్చినట్టుగా ముందుకు వచ్చింది– ఆ చిన్నారి చేతులు ముడుచుకుని కూర్చుంది; తన కాళ్లను మరింత, మరింత దగ్గరకు లాక్కుంది; అయినా చలికి ఇంకా, ఇంకా వణుకుతూనేవుంది. అయినప్పటికీ ఇంటికి తిరిగివెళ్లడానికి ధైర్యం చాల్లేదు; ఒక్క అగ్గిపుల్లయినా అమ్మలేదాయె, చేతిలోకి ఒక్క ఫార్తింగ్ అయినా రాలేదాయె, ఇంటికి వెళ్తే నాన్న నుంచి దెబ్బలు తప్పవాయె. పోనీ ఇంటికి వెళ్లినా అక్కడా చలి తప్పదాయె; ఇంటికి పైకప్పు తప్ప ఏమీలేదాయె. పెద్ద పెద్ద పర్రెలను గడ్డితోనూ పాతబట్టలతోనూ కప్పినప్పటికీ గాలి ఇంకా ఈల వేస్తూనేవుంటుంది. ఆమె చిన్న చేతులు చలికి దాదాపుగా మొద్దుబారిపోయినై. అయ్యో! కట్టలోని ఒక్క అగ్గిపుల్ల వెలిగించగలిగినా ఆమెకు కొంత ఉపశమనమైనా దొరుకునే! ఆ కట్టలోంచి తీయడానికి ధైర్యం చేసి, దాన్ని ఆ గోడకు గీకి, ఆ మంటకు తన వేళ్లను కాపుకోగలిగితే బాగుండు! ఆ, ఆమె ఒకటి బయటికి తీసింది. ‘సుర్ర్!’ ఎలా వెలిగింది, ఎలా మండింది! కొవ్వొత్తిలాగా వెచ్చటి, ప్రకాశవంతమైన మంట. దాని మీద ఆమె వేళ్లను ఉంచింది. ఎంత బాగుంది! మెరుగుపెట్టిన ఇత్తడి కాళ్లతో ఉండే ఒక పెద్ద ఇనుప పొయ్యి ముందు కూర్చున్నట్టుగా అనిపించింది. ఎంత అందమైన మంట! చిన్నారి తన పాదాలను కూడా ఆ వేడి తగిలేట్టుగా చాపింది; కానీ ఇంతలోనే ఆ బుల్లి మంట ఆరిపోయింది; పొయ్యి మాయమైంది. ఆమె చేతిలో కాలిపోయిన పుల్ల తప్ప ఇంకేమీ లేదు. మరొక్కదాన్ని గోడకు వ్యతిరేకంగా గీకింది; ప్రకాశంగా అది మండింది; గోడ మీద ఎక్కడైతే వెలుతురు పడిందో ఉన్నట్టుండి అది పారదర్శకమైన తెరలా మారిపోయింది; లోపల గది అంతా ఆమెకు కనబడుతోంది. టేబుల్ మీద మంచులాంటి తెల్లటి బట్ట పరిచివుంది; దానిమీద అందమైన పింగాణీ పాత్రలు అమర్చివున్నాయి; యాపిల్ ముక్కలు, ఎండు రేగుపళ్లతో గొప్పగా గార్నిష్ చేసిన కాల్చిన బాతులోంచి ఉడుకు పొగలు వస్తున్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం, ఛాతీకి కత్తి, ఫోర్కులను గుచ్చివున్న ఆ బాతు ఆ పాత్రలోంచి గెంతి, నేరుగా ఆ చిన్నారి దగ్గరకే నడుచుకుంటూ వచ్చేలోగా ఆ అగ్గిపుల్ల ఆరిపోయింది; మందపు, చల్లటి, తడిసిన గోడ తప్ప అక్కడ ఇంకేమీ లేదు. ఆమె ఇంకోటి వెలిగించింది. ఇప్పుడు ఆమె ఒక బ్రహ్మాండమైన క్రిస్మస్ ట్రీ కింద కూర్చునివుంది; గాజు తలుపులోంచి ధనిక వ్యాపారి ఇంట్లో తను చూసినదానికన్నా పెద్దది; అంతకంటే దివ్యమైన అలంకరణ చేసినది! దాని ఆకుపచ్చ కొమ్మల మీద వేలాది దివ్వెలు వెలుగుతున్నాయి, గొప్ప రంగుల బొమ్మలు మెరుస్తున్నాయి, దుకాణాల్లో చూసి ఎప్పటికీ కొనలేనని తను అనుకున్నలాంటివి. వాటిని అందుకోవడానికి చేతులు సాచేలోగా అగ్గిపుల్ల ఆరిపోయింది. క్రిస్మస్ ట్రీలోని దివ్వెలు పైకి, ఇంకా పైకి లేచాయి; అవిప్పుడు స్వర్గంలోని నక్షత్రాల్లా ఆమెకు కనబడుతున్నాయి; అందులోంచి ఒక తార రాలిపోయింది, ఒక పెద్ద మంటతో. ‘‘ఇప్పుడే ఎవరో చనిపోయారు!’’ అని చెప్పింది, వాళ్ల నానమ్మతో. ఆమెను ముద్దుచేసిన ఏకైక వ్యక్తి ఇప్పుడు లేని ఈ నానమ్మ. ఒక తార రాలిందంటే ఒక ఆత్మ దేవుడి దగ్గరకు చేరుకున్నట్టని చెప్పిందావిడ. ఆ గోడకు మరో అగ్గిపుల్ల వెలిగింది; మళ్లీ దివ్యమైన వెలుగు; అందులో ముసలి నానమ్మ నిలుచునివుంది, ఒళ్లంతా కాంతులీనుతూ, ముఖం నిండా శాంతితో, ప్రేమతో. ‘‘నానమ్మా!’’ అని కేకేసింది పాప. ‘‘నీతో నన్ను తీసుకెళ్లు. అగ్గిపుల్ల ఆరిపోగానే నువ్వు వెళ్లిపోతావు, మాయమైపోతావు– వెచ్చటి పొయ్యిలా, రుచికరమైన బాతులా, బ్రహ్మాండమైన క్రిస్మస్ ట్రీలా నువ్వు కనబడకుండా పోతావు!’’ వెంటనే తన దగ్గరున్న మొత్తం అగ్గిపుల్లల్ని ఆ గోడకు గీకి వెలిగించింది, నాన్నమ్మను తన దగ్గరే ఉంచుకోవాలన్న కృత నిశ్చయంతో. ఆ అగ్గిపుల్లలు ఎంత గొప్పగా వెలిగినాయంటే పట్టపగలు కాంతి కూడా వాటిముందు వెలవెలబోతుంది. అంతకుముందెప్పుడు నాన్నమ్మ అంత పొడుగ్గా, అంత అందంగా కనబడలేదు. ఆమె ఆ చిన్నారి బాలికను తన చేతిలోకి తీసుకుంది; ఆ వెలుగులో, ఆ సంతోషంలో ఇరువురూ పైకి, ఎంతో ఎత్తుకి ఎగిరిపోయారు. ఇంక అక్కడ చలి లేదు, ఆకలి లేదు, వేదన లేదు– వాళ్లు దేవుడితో ఉన్నారు. కానీ ఆ మూలకు, ఆ సాయంత్రపు చలి వేళలో, గోడకు ఆనుకుని కూర్చున్న ఆ గులాబీ చెక్కిళ్ల నవ్వు ముఖపు చిన్నారి పాప మంచుకు గడ్డ కట్టుకుపోయింది, ఆ ఏడాది చివరి రోజున. బొమ్మలా, కదలకుండా తన అగ్గిపుల్లలతో కూర్చుంది ఆ చిన్నారి; ఆ అగ్గిపుల్లల్లో ఒక కట్ట కాలిపోయివుంది. ‘‘తనను తాను వెచ్చగా కాపుకోవాలనుకుంది పాపం,’’ అన్నారు జనం. కానీ ఏ ఒక్కరికైనా ఇంత కూడా అనిపించలేదు, కలలో కూడా వాళ్లు తలిచివుండరు; ఎంత అందమైన వాటిని తను చూసివుంటుంది! ఎంత తేజస్సుతో ఆమె తన నానమ్మతో కలిసి కొత్త సంవత్సరపు సంరంభంలోకి అడుగుడివుంటుంది! హాన్స్ క్రిస్టియన్ యాండెర్సెన్ (1805–75) రాసిన ‘ద లిటిల్ మాచ్‌స్టిక్ గర్ల్’ కథ ఇది. అనువాదం: సాహిత్యం డెస్క్. రచనాకాలం: 1845. మనుషుల్లో ఉండవలసిన కరుణను ప్రధాన వస్తువుగా చేసుకున్న ఈ ఫెయిర్ టేల్ ప్రపంచవ్యాప్తంగా ఎందరో కళాకారులను ఇప్పటికీ ఆకర్షిస్తూనేవుంది; ఎన్నోసార్లు వివిధ రూపాల్లో తెరకెక్కుతూనేవుంది. అదే కారణంగా ఎన్నో క్రిస్మస్ కథా సంకలనాల్లోనూ చోటు చేసుకుంది. డెన్మార్క్‌కు చెందిన యాండెర్సెన్ కవి, నవలాకారుడు, నాటక రచయిత అయినప్పటికీ ఆయన పేరు ఫెయిర్ టేల్స్‌తోనే ముడిపడిపోయింది. మూడు వేలకుపైనే ఇలాంటివి రాశాడంటారు. పిల్లలకోసం ఉద్దేశించినా పెద్దలూ చదివారు. పాశ్చాత్య ప్రపంచపు ఉమ్మడి చైతన్యాన్ని రూపొందించిన కథలుగా వీటిని పరిగణిస్తారు. అందువల్లేనేమో ఎన్నో దేశాల్లో ఆయన విగ్రహాలు కనబడతాయి. హాన్స్ క్రిస్టియన్ యాండెర్సెన్ -
ఆ రోజు వాట్సాప్‌లో ఎన్ని మెసేజ్‌లు పంపుకున్నారో తెలుసా.?
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక మంది యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7500 కోట్లు మెస్సేజ్‌లు. గత నెల 31న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ యూజర్లు పంపిన సందేశాల సంఖ్య ఇది. ఈ విషయాన్ని వాట్సప్ తాజాగా వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక మంది యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌గా వాట్సప్ నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాదు మెస్సేజ్‌లకు తోడు 1,300 కోట్ల ఇమేజ్‌లు, 500 కోట్ల వీడియోలను న్యూ ఇయర్ సందర్భంగా వాట్సప్ యూజర్లు పంపుకున్నారు. అయితే డిసెంబర్ 31 అర్ధరాత్రి తరువాత వాట్సప్ కొంత సేపు పనిచేయలేదు. ఆ యాప్‌ను పెద్ద ఎత్తున యూజర్లు వాడడంతో క్రాష్ అయింది. కానీ సమస్యను త్వరగా చక్కదిద్దారు. దీంతో మళ్లీ వాట్సప్ సేవలు యదావిధిగా నడిచాయి. ఇందులో ప్రస్తుతం రోజుకు 100 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉంటున్నారు. -
వార్నింగ్ : డిసెంబర్ 31 అర్ధరాత్రి 12లోగా..
బెంగళూరు : కొత్త సంవత్సరం పేరుతో జరిగే వేడుకల ద్వారా సెక్స్, డ్రగ్స్, మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని, తద్వారా దేశ సంస్కృతి, సంప్రదాయాలను దిగజార్చుతున్నారని హిందూ అతివాద సంస్థలు మండిపడుతున్నాయి. అందుకే డిసెంబర్ 31న అర్ధరాత్రి 12లోపే అన్నీ మూసుకోవాలని హోటళ్లు, పబ్‌ల యాజమాన్యాలకు హుకుం జారీచేశాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం హిందూ సంస్థల బెదిరింపులు పట్టించుకోవాల్సిన అవసరంలేదని భరోసా ఇస్తోంది. గతంలో పబ్‌లపై దాడి, మహిళలపై దారుణకాండ ఇత్యాది ఘటనల నేపథ్యంలో కర్ణాటకలోని మంగళూరు, బెంగళూరు నగరాల్లో జరగబోయే ఈవెంట్లపై భయాందోళనలు నెలకొన్నాయి. హోటల్, పబ్ యాజమాన్యాలకు సందేశాలు : వీహెచ్‌పీ, భజరంగ్ దళ్, కేఆర్వీవైఎస్ లాంటి సంస్థలు ఇప్పటికే మంగళూరు నగరంలోని ప్రముఖ హోటళ్లు, పబ్‌లకు సందేశాలు పంపినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12లోగా మూసివేయాలని ఆయా యాజమాన్యాలను కోరినట్లు పేర్కొన్నారు. అయితే కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి మాత్రం ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకున్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ‘‘భజరంగ్ దళ్ లాంటి సంస్థలు ప్రతి ఏడాది ఇలాంటి ప్రకటనలు చేయడం మామూలే. అసలు ఇలా శాసించే హక్కు వాళ్లకి లేదు. వేడుకలు జరిగే చోట బందోబస్తు ఏర్పాటుచేస్తాం’’ అని చెప్పారు. గత ఏడాది కీచకపర్వం : సరిగ్గా ఏడాది కిందట బెంగళూరులోని ఎంజే రోడ్డులో జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో మద్యం, డ్రగ్స్ సేవించిన కొందరు యువకులు మహిళలపై కీచక పర్వాలకు దిగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శ్రీరాంసేన కార్యకర్తలు కొందరు మంగళూరులోని ఓ పబ్‌లోకి చొరబడి మహిళలను చితకబాదిన ఉదంతం గుర్తే. ఈ గత అనుభవాల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వేడుక వేళ భద్రతా చర్యల్లో భాగంగా ఎంజీ, బ్రిగేడ్ రోడ్లలో 30 శాతాన్ని కేవలం మహిళల కోసం కేటాయించనున్నారు. ఇక్కడకు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుషులను అనుమతించరు. అదే విధంగా 70 శాతం రోడ్డును పురుషులకు కేటాయిస్తారు. ఇక్కడ పురుషులతో పాటు మహిళలకూ ప్రవేశం ఉంటుంది. దంపతులు, స్నేహితులు తదితరులు ఇక్కడకు వచ్చి వేడుకల్లో పాల్గొనవచ్చు. తాగినోళ్లకు తాగినంత..: న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు నగరంలో పబ్బులు, రెస్టారెంట్లు, బార్ల క్లోజింగ్ టైమ్‌లో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. బార్లు, పబ్బులును ఉదయం రెండు గంటలకు వరకూ తెరిచివుంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బార్లు, పబ్బుల్లో స్త్రీ, పురుషులకు ప్రత్యేక గదులను కేటాయించడంతో పాటు, పిల్లలతో వచ్చే తల్లులకు రిజర్వ్డ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని బెంగళూరు పోలీసులు బార్లు, పబ్బులు, రెస్టారెంట్ల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
ఈ నెల 31న అన్ని ఫ్లైఓవర్లు బంద్
హైదరాబాద్ : నగరంలో ఈ నెల 31వ తేదీన సైబరాబాద్, హైద్రాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అన్ని ఫ్లై ఓవర్లు మూసివేస్తామని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. 31న నైట్ సెలెబ్రేషన్స్ రాత్రి ఒంటి గంట వరకే పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరిస్తామని, మొత్తం 120 టీమ్‌లు బ్రీత్ అనలైజర్లతో సిద్ధంగా ఉంటారన్నారు. అలాగే స్పీడ్ లిమిట్ తప్పనిసరి అని, అతి వేగంతో వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని వెల్లడించారు. -
కొత్త పార్టీని ప్రకటించనున్న రజనీ.?
సాక్షి, చెన్నై: తమిళనాడులో రాజకీయంగా ఎదగాలని భావించేవారికి సినిమా రంగం రాచబాట. వెండితెర వేలుపులుగా ఉన్నవారు రాజకీయ వేదికలపై మెరిసిపోయే అవకాశాన్ని అలవోకగా అందుకోవచ్చు. తమిళనాడు అలనాటి ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత ఇలా అందరూ కోలీవుడ్‌తో బలమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నవారే. తమిళనాడులోని ప్రముఖ హీరోల తుది టార్గెట్ సీఎం కుర్చీనే అంటే అతిశయోక్తికాదు. అయితే ఇప్పటివరకు సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్లు పరోక్షంగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఇక సూపర్‌స్టార్ త్వరలోనే రాజకీయాల్లో రానున్నారని తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి 31 వరకు ఆరు రోజుల పాటు అభిమానులతో రజనీ మరోసారి భేటీ కానున్నారు. భేటీ అనంతరం డిసెంబర్ 31న లేదా జనవరి 1నో కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో అభిమానులతో సమావేశమైన సందర్భంలో రజనీ రాజకీయల్లోకి వస్తున్నారంటూ భారీగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. -
‘సన్నీ నైట్స్’ని ఎందుకు నిరాకరిస్తున్నారు.?
సాక్షి,బెంగళూరు: డిసెంబర్ 31న బెంగళూరులో బాలీవుడ్ నటి సన్నీలియోన్ ‘సన్నీనైట్స్’కు అనుమతి ఇవ్వకపోవడానికి కారణం చెప్పాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 31న మాన్యతా టెక్పార్కులోని ఓ హోటల్లో సన్నీనైట్స్ కార్యక్రమానికి అనుమతి లేదని నగర కమిషనర్ సునీల్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. సునీల్‌కుమార్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ నిర్వాహకులు కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నగరంలో ఎన్ని క్లబ్బులు ఉన్నాయి? అందులో డిసెంబర్ 31 రాత్రి వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎన్ని దరఖాస్తు చేశాయి? ఇప్పటి వరకూ ఎన్నింటికి అనుమతి ఇచ్చారు? ఎన్నింటికి అనుమతి ఇవ్వలేదు? అందుకు కారణాలు ఏమిటీ అన్న విషయాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని గురువారం తన ఆదేశాల్లో పేర్కొంది. -
'ఒంటిగంట తర్వాత పట్టుబడితే కఠిన చర్యలు'
హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం మీడియాతో మాట్లాడారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఔటర్ రింగ్‌రోడ్డుపై నిషేధాజ్ఞలు విధించినట్లు ఆయన చెప్పారు. సైబరాబాద్‌లో 7వేల మంది పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. వేడుకలు జరిగే చోట తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరిమితికి మించి టికెట్లు అమ్మరాదని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేయాలని, ఈవెంట్స్‌కు పోలీసులు ఆటంకం కలిగించరని ఆయన చెప్పారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి ఒంటిగంట వరకే వేడుకలకు అనుమతిస్తామన్నారు. ఒంటిగంట తర్వాత 100 పోలీసు బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని సీవీ ఆనంద్ హెచ్చరించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఔటర్ రింగ్‌రోడ్డు, పీపీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్లు మూసివేయనుట్లు చెప్పారు. గతంలో పట్టుబడ్డ 25మంది ఫామ్‌హౌస్ మేనేజర్లకు 131 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు సీవీ ఆనంద్ పేర్కొన్నారు. -
'రాత్రి ఒంటిగంట వరకే వేడుకలు'
-
'రాత్రి ఒంటిగంట వరకే వేడుకలు'
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఒంటిగంట వరకు మాత్రమే వేడుకలు జరుపుకొనేందుకు అనుమతిస్తున్నట్టు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. డీజేలు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. పార్టీలో పాల్గొనే మహిళలకు ప్రత్యేక బ్యారెక్‌లు ఏర్పాటు చేయాలని సీవీ ఆనంద్ తెలిపారు. ఆయుధాలతో వచ్చే వారిని వేడుకలకు అనుమతించరాదని చెప్పారు. ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల ఫ్లై ఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్డును మూసివేస్తున్నట్టు సైబరాబాద్ కమిషనర్ తెలియజేశారు. -
2 రోజులు..రూ. 5 కోట్లు
కామారెడ్డి, న్యూస్‌లైన్: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేం దుకు డిసెంబర్ 31న యువకులు పెద్ద ఎత్తున విందులు చేసుకున్నారు. మంగళవారం అర్ధరా త్రి వరకు తాగి, తూగారు. అర్ధరాత్రి దాటాక కొ త్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే కేరింత లు కొడుతూ ఎంజాయ్ చేశారు. జనవరి 1 బుధవారం కూడా పెద్ద ఎత్తున విందులు, వినోదాలు కొనసాగాయి. నిజామాబాద్, కామారె డ్డి, ఆర్మూర్, బోధన్ పట్టణాలతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు సాగాయి. దుకాణాల వద్ద వందలా ది మంది బారులు తీరారు. రెండు రోజులకు కలిపి దాదాపు రూ.ఐదు కోట్ల విలువైన మ ద్యం అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకల కోసం దుకాణాల యజమానులు ముందస్తుగానే మద్యం పెద్ద ఎత్తున తె ప్పించి పెట్టారు. మాంసం అమ్మకాలూ పెద్ద ఎ త్తున సాగాయి. ముఖ్యంగా కోడి మాంసం అమ్మకాలు ఎక్కువగా సాగినట్టు తెలుస్తోంది. పండుగలను మరిపించిన వేడుకలు సాధారణంగా పండుగల సమయంలో అన్ని వర్గాల ప్రజలు విందులు చేసుకుంటారు. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా మాం సాహారం తినే ప్రతీ ఇంటిలో మాంసం వండుకుంటారు. తాగే అలవాటు ఉన్నవారు మద్యం తెచ్చుకుని విందు చేసుకుంటారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ విందులతో ఊరట పొందుతారు. ఆ సందర్భంలో మద్యం దుకాణాలు, మాంసం దుకాణాల వద్ద రద్దీ కనిపించే ది. ఈ సారి నూతన సంవత్సరం సందర్భంగా జనం మద్యం, మాంసం దుకాణాల వద్ద ఎగబడడం చూస్తే ఈ వేడుకలు సంప్రదాయ పండుగలను మరిపించాయనే చెప్పాలి. సంబరాలను ‘మత్తు’గా చేసుకోవడానికే ఇష్ట పడ్డారని చెప్పాలి.