ఒక్క సారిగా కలెక్టర్ కార్యాలయంలో కలకలం. కలెక్టర్ చాంబర్ నుంచి నల్లటిపొగలు దట్టంగా వస్తున్నాయి. సిబ్బందిలో ఆందోళన... ఏమి జరిగిందో అర్థం కాలేదు. చాంబర్ వద్దకు వెళ్లలేనంతగా లోపలి నుంచి పొగలు వెలువడుతున్నాయి. ఏఓ శివరామకృష్ణ అప్రమత్తయ్యారు. చాంబర్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు గుర్తించి అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు.. ఐదు నిమిషాల వ్యవధిలో ఆ శాఖ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.